శలభాసనము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శలభాసనము (సంస్కృతం: शलभसन) యోగాలో ఒక విధమైన ఆసనము. ఇది మిడతను పోలిన ఆసనం కనుక దీనికి శలభాసనమని పేరు.

పద్ధతి[మార్చు]

  • బోర్లా పడుకొని రెండు కాళ్ళను దగ్గరగా రెండు చేతులను తొడల క్రింద ఉంచాలి.
  • గడ్డం నేలపై ఆనించి, కొద్దిగా శ్వాస పీల్చి మొదట కుడికాలును మోకాలు వంచకుండా పైకి ఎత్తాలి.
  • ఈ స్థితిలో కొన్ని క్షణాలున్న తర్వాత మెల్లగా కాలు నేలపై ఆనించాలి.
  • ఇదే విధంగా ఎడమకాలితో చేయాలి.
  • మూడేసి సార్లు ఒక్కొక్క కాలితో చేసిన తర్వాత, రెండు కాళ్ళను కలిపి ఒకేసారి పైకి ఎత్తి కొద్ది క్షణాలు ఆగాలి. తర్వాత మెల్లగా క్రిందికి దించాలి. ఈ రకంగా మూడుసార్లు చేయాలి.
  • తర్వాత మకరాసనంలో కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలి.

ప్రయోజనం[మార్చు]

  • శలభాసనం పొట్టకు, తుంటి భాగానికి, కాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని తొలగిస్తుంది. నడుము సన్నబడుతుంది.
"https://te.wikipedia.org/w/index.php?title=శలభాసనము&oldid=2119172" నుండి వెలికితీశారు