గుడివాడ దిబ్బ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుడివాడ దిబ్బ
—  బౌద్ధ క్షేత్రం  —
గుడివాడ దిబ్బ వద్ద బౌద్ధ స్తూపపు దిబ్బ
గుడివాడ దిబ్బ వద్ద బౌద్ధ స్తూపపు దిబ్బ
గుడివాడ దిబ్బ is located in ఆంధ్రప్రదేశ్
గుడివాడ దిబ్బ
గుడివాడ దిబ్బ
ఆంధ్రప్రదేశ్ పటంలో గుడివాడ దిబ్బ స్థలం
దేశం  India
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా విజయనగరం
Time zone IST (UTC+5:30)
సమీప నగరం విశాఖపట్నం

గుడివాడ దిబ్బ ఆంధ్ర ప్రదేశ్, విజయనగరం జిల్లా, భోగాపురం మండలంలోని గుడివాడ గ్రామం వద్ద ఉన్న ఒక చిన్న కొండ. ఇది గోస్తనీ నది ఒడ్డున ఉంది.

స్థల అన్వేషణ

[మార్చు]

2012 అక్టోబరులో గుడివాడ దిబ్బపై జరిపిన అన్వేషణల్లో[1] ఈ పురాతన బౌద్ధ వారసత్వ ప్రదేశం, బహుశా సా.పూ. 2వ శతాబ్దానికి చెంది ఉంటుందని తేలింది. ఈ స్థల వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురాతత్వ శాఖ నమోదు చేసింది.

స్థల వివరణ

[మార్చు]

ఈ దిబ్బ 2 మెరక మైదాన స్థలాల నుండి ఏర్పడింది. తూర్పు వైపున ఉన్న ఎగువ మెరక స్థలంలో బౌద్ధ స్థూపం అవశేషాలు, ఒక చిన్న రాతిలో చెక్కిన నీటి తొట్టె ఉన్నాయి. పశ్చిమాన ఉన్న దిగువ మెరక స్థలంలో బౌద్ధ విహార అవశేషాలు, రెండు దుర్గాదేవి దేవాలయాలు (బహుశా 100 సంవత్సరాల క్రితం నిర్మించి ఉండవచ్చు) ఉన్నాయి. కొండకు పశ్చిమాన గోస్తని నది వైపు రాతిలో చెక్కిన మెట్లు ఉన్నాయి. ఈ ప్రదేశానికి, సమీపంలోని పావురాళ్లకొండ, తొట్లకొండ బౌద్ధ క్షేత్రానికీ పోలికలున్నాయి. ఇది భీమునిపట్నం నుండి 6 కి.మీ దూరంలో ఉంది. గుడివాడ దిబ్బ బౌద్ధ క్షేత్రం విశాఖపట్నం జిల్లాలోని తగరపువలస, చిట్టివలస వాణిజ్య పట్టణానికి చాలా సమీపంలో ఉంది.

చిత్ర మాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. B. Madhu Gopal (2012-10-09). "Evidence of Buddhist site found". The Hindu. Retrieved 2013-09-07.