Jump to content

గుడిమల్లం

అక్షాంశ రేఖాంశాలు: 13°36′30.8160″N 79°34′36.4080″E / 13.608560000°N 79.576780000°E / 13.608560000; 79.576780000
వికీపీడియా నుండి
(గుడి మల్లం నుండి దారిమార్పు చెందింది)
గుడిమల్లం
పటం
గుడిమల్లం is located in ఆంధ్రప్రదేశ్
గుడిమల్లం
గుడిమల్లం
అక్షాంశ రేఖాంశాలు: 13°36′30.8160″N 79°34′36.4080″E / 13.608560000°N 79.576780000°E / 13.608560000; 79.576780000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి
మండలంఏర్పేడు
విస్తీర్ణం4.31 కి.మీ2 (1.66 చ. మై)
జనాభా
 (2011)[1]
2,071
 • జనసాంద్రత480/కి.మీ2 (1,200/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు1,025
 • స్త్రీలు1,046
 • లింగ నిష్పత్తి1,020
 • నివాసాలు552
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్517526
2011 జనగణన కోడ్595806

గుడిమల్లం, తిరుపతి జిల్లా, ఏర్పేడు మండలానికి చెందిన ఓ గ్రామం. ఇది మండల కేంద్రమైన ఏర్పేడు నుండి 34 కి.మీ. దూరం లోను, సమీప పట్టణమైన తిరుపతి నుండి 24 కి.మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 552 ఇళ్లతో, 2071 జనాభాతో 431 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1025, ఆడవారి సంఖ్య 1046. షెడ్యూల్డ్ కులాల జనాభా 358 కాగా షెడ్యూల్డ్ తెగల జనాభా 357. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595806.[2]

చారిత్రకంగా ప్రాముఖ్యమైంది. ఇచట ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం ఉంది. ఇది సా.శ .పూ 2 లేదా 3 శతాబ్దంలో నిర్మించినట్లు ఇక్కడ బయలుపడిన శాసనాలద్వారా చరిత్రకారులు నిర్ణయించారు. ఈ ఆలయానికి సంబంధించిన మరికొంత సమాచారం చంద్రగిరి కోటలో గల మ్యూజియంలో లభ్యమవుతుంది.

దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు

[మార్చు]
గుడిమల్లం పరశురామేశ్వరాలయం

తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు.ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ (అమరావతి సర్కిల్) పరిధిలోని కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలు / స్థలాల జాబితాలో ఉంది.[3] ఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయం లోని గర్భాలయం , ముఖమండపాల కన్నా లోతులో ఉంటుంది. ఇక్కడ గర్భగృహంలో ప్రతిష్ఠించబడిన శివలింగె లింగ రూపంలో కాకుండా శివుడు మానవ రూపంలో మహావీరుడైన వేటగాని వలె ఉంటుంది. ఈ లింగం ముదురు కాఫీరంగులో ఉన్న రాతితో చేయబడిన మానుష లింగం. లింగం సుమారుగా ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు కలిగి ఉంది. లింగంపైన ముందువైపు ఉబ్బెత్తుగానూ లింగం నుండి బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు, అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన (స్థానకమూర్తి) రూపంలో ఉన్నాడు. స్వామి రెండు చేతులతో ఉన్నాడు. కుడిచేతితో ఒక గొర్రెపోతు (తలక్రిందుగా) కాళ్ళు పట్టుకొనగా, ఎడమచేతిలో చిన్నగిన్నె (చిప్ప) ను పట్టుకొన్నాడు. ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని ఉన్నాడు. స్వామి జటాభార (జటలన్నీ పైన ముడివేసినట్లు) తలకట్టుతో, చెవులకు అనేక రింగులు ఇంకా వివిధ ఆభరణాలు ధరించి, నడుముచుట్టూ చుట్టి, మధ్యలో క్రిందకు వ్రేలాడుతున్నట్లు ఉన్న అర్ధోరుకం (నడుమ నుండి మోకాళ్ళ వరకూ ఉండే వస్త్రం) ధరించి ఉన్నాడు. ఆ వస్త్రం మధ్యలో వ్రేలాడుతున్న మడతలు అతి స్పష్టంగా కనుపిస్తాయి. ఆ వస్త్రం అతి సున్నితమైంది అన్నట్లుగా అందుండి స్వామివారి శరీరభాగాలు స్పష్టంగా కనుపిస్తాయి. స్వామికి యగ్నోపవీతం లేకపోవడం ఒక విశేషం. లింగపు అగ్రభాగం, క్రింది పొడవైన స్తంభభాగాలను విడదీస్తున్నట్లుగా ఒక లోతైన పల్లం పడిన గీత స్పష్టంగా ఉండి, మొత్తం లింగం పురుషాంగంను పోలి ఉంది. ఈ లింగం, అతిప్రాచీనమైన లింగంగా గుర్తించబడింది. ఆకాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తించబడింది.ఈ దేవాలయాన్ని కొంతకాలం చంద్రగిరి రాజులు ఉచ్ఛస్థితిలో నిలిపారు. తదనంతర కాలంలో ముస్లిం పాలకులు చంద్రగిరి సంస్థానంతో పాటు ఈ దేవాలయాన్ని కూడా చాలా వరకు పాడు చేసారు. కాకుంటే మూలవిరాట్ స్వామికి మాత్రం హాని కలగలేదు.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

ఈ గ్రామంలో 3 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, ఉన్నాయి. సమీప బాలబడి వైకుంటమాలలో, సమీప మాధ్యమిక పాఠశాల, సమీప మాధ్యమిక పాఠశాల (పాపానాయుడుపేటలో), ఈ గ్రామానికి 5 నుండి 10 కి.మీ దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, సమీప సీనియర్ మాధ్యమిక పాఠశాల, సమీప అనియత విద్యా కేంద్రం, (ఏర్పేడులో), సమీప ఇంజనీరింగ్ కళాశాలలు, సమీప ఆర్ట్స్, సైన్స్, కామర్సు డిగ్రీ కళాశాల, సమీప పాలీటెక్నిక్, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, సమీప వైద్య కళాశాల సమీప మేనేజ్మెంట్ సంస్, సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల (తిరుపతిలో), ఈ గ్రామానికి 10 కి.మీ కన్నా ఎక్కువ దూరములో వున్నవి

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సమీప ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, సమీప పశు వైద్యశాల, సమీప సంచార వైద్య శాల, ఈ గ్రామానికి 5 నుండి 10 కి.మీ దూరములో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, సమీప టి.బి వైద్యశాల, సమీప అలోపతీ ఆసుపత్రి, సమీప మాతా శిశు సంరక్షణా కేంద్రం, సమీప ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సమీప ఆసుపత్రి, సమీప కుటుంబ సంక్షేమ కేంద్రం ఈ గ్రామానికి 10 కి.మీ కన్నా ఎక్కువ దూరములో వున్నవి

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

ఈ గ్రామంలో 2 అవుట్-పేషెంట్ వైద్య సౌకర్యాలు ఇద్దరు డిగ్రీలు లేని వైద్యులు ఉన్నారు. గ్రామంలో 2 మందుల దుకాణాలులు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

రక్షిత మంచినీటి సరఫరా గ్రామంలో లేదు. గ్రామంలో మంచినీటి అవసరాలకు చేతిపంపుల నీరు, గొట్టపు బావులు / బోరు బావుల నుంచి నీటిని వినియోగిస్తున్నారు.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో మూసిన డ్రైనేజీ వ్యవస్థ లేదు. మురుగునీరు నేరుగా నీటి వనరుల్లోకి వదలబడుతోంది. ఈ ప్రాంతం పూర్తి పారిశుధ్య పథకం కిందికి వస్తుంది. సామాజిక మరుగుదొడ్ల సౌకర్యం ఈ గ్రామంలో లేదు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఈ గ్రామంలో టెలిఫోన్ (లాండ్ లైన్) సౌకర్యం, పబ్లిక్ ఫోన్ ఆఫీసు సౌకర్యం, ఆటో సౌకర్యం, మొబైల్ ఫోన్ కవరేజి, ట్రాక్టరు, పబ్లిక్ బస్సు సర్వీసు ఉన్నాయి. సమీప ప్రైవేట్ బస్సు సర్వీసు, సమీప టాక్సీ సౌకర్యం, ఈ గ్రామానికి 5 నుండి 10 కి.మీ దూరములో ఉన్నాయి. సమీప పోస్టాఫీసు సౌకర్యం, సమీప ఇంటర్నెట్ కెఫెలు / సామాన్య సేవా కేంద్రాల సౌకర్యం, సమీప ప్రైవేటు కొరియర్ సౌకర్యం, సమీప రైల్వే స్టేషన్, ఈ గ్రామానికి 10 కి.మీ కన్నా ఎక్కువ దూరములో వున్నవిసమీప జాతీయ రహదారి గ్రామానికి 10 కిలోమీటర్ల కన్నా దూరంలో ఉంది. సమీప రాష్ట్ర రహదారి గ్రామానికి 10 కిలోమీటర్ల కన్నా దూరంలో ఉంది.సమీప ప్రధాన జిల్లా రోడ్డు గ్రామానికి 10 కిలోమీటర్ల కన్నా దూరంలో ఉంది. .సమీప ఇతర జిల్లా రోడ్డు గ్రామానికి 10 కిలోమీటర్ల కన్నా దూరంలో ఉంది. .సమీప కంకర రోడ్డు గ్రామానికి 5 నుంచి 10 కిలోమీటర్ల లోపు ఉంది.ఈ గ్రామానికి, మండలంలోని ఇతర గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉంది.. ఈ గ్రామానికి ఏర్పేడు, రేనిగుంట రైల్వే స్టేషనులు సమీపములో ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

ఈ గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. సమీప వాణిజ్య బ్యాంకు, ఈ గ్రామానికి 5 నుండి 10 కి.మీ దూరములో ఉన్నాయి. సమీప ఏటియం, సమీప సహకార బ్యాంకు, సమీప వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ, సమీప వ్యవసాయ ఋణ సంఘం, సమీప వారం వారీ సంత, సమీప వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఈ గ్రామానికి 10 కి.మీ కన్నా ఎక్కువ దూరములో వున్నవి

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

ఈ గ్రామంలో ఏకీకృత బాలల అభివృద్ధి పథకం (పోషకాహార కేంద్రం), అంగన్ వాడీ కేంద్రం (పోషకాహార కేంద్రం), ఇతర (పోషకాహార కేంద్రం), ఆశా కార్యకర్త (గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త), వార్తాపత్రిక సరఫరా, శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీప ఆటల మైదానం, సమీప సినిమా / వీడియో హాల్, సమీప గ్రంథాలయం, సమీప పబ్లిక్ రీడింగ్ రూం, ఈ గ్రామానికి 5 నుండి 10 కి.మీ దూరములో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

ఈ గ్రామంలో విద్యుత్తు ఉంది.

భూమి వినియోగం

[మార్చు]

గ్రామంలో భూమి వినియోగం ఇలా ఉంది (హెక్టార్లలో):

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 72.03
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 105.22
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 1.75
  • నికరంగా విత్తిన భూ క్షేత్రం: 252
  • నీటి వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూ క్షేత్రం: 252

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో వ్యవసాయానికి నీటి పారుదల వనరులు ఇలా ఉన్నాయి (హెక్టార్లలో):

బావులు/గొట్టపు బావులు: 252

తయారీ

[మార్చు]

ఈ గ్రామం ఈ కింది వస్తువులను ఉత్పత్తి చేస్తోంది

వరి, వేరుశనగ

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. "Alphabetical List of Monuments – Andhra Pradesh « Archaeological Survey of India". web.archive.org. 2022-11-30. Archived from the original on 2022-11-30. Retrieved 2022-12-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు

[మార్చు]