గుణ 369

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుణ 369
Guna 369 Movie Poster.jpg
గుణ 369 సినిమా పోస్టర్
దర్శకత్వంఅర్జున్ జంధ్యాల
నిర్మాతఅనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి
రచనఅనిల్ కడియాల
నటులుకార్తికేయ గుమ్మకొండ
అనఘ ఎల్.కె
సంగీతంచైతన్ భరధ్వాజ్
ఛాయాగ్రహణంరామ్
నిర్మాణ సంస్థ
జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, ఎస్.జి. మూవీ మేకర్స్, స్ప్రింట్ ఫిల్మ్స్
విడుదల
2 ఆగస్టు 2019 (2019-08-02)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

గుణ 369[2] 2019, ఆగస్టు 2న విడుదలైన తెలుగు చలనచిత్రం. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కార్తికేయ గుమ్మకొండ, ఎల్.కె. అనఘ నటించారు.[3] ఎస్.జి. మూవీ మేకర్స్ పతాకంపై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి చైతన్ భరధ్వాజ్ సంగీతం అందించాడు.[1] ఆడపిల్లలను వేధించే వాళ్లకు శిక్షలు కఠినంగా ఉండాలన్న సందేశాన్ని కమర్షియల్ జానర్‌లో చెప్పబడింది.

కథా నేపథ్యం[మార్చు]

తన తండ్రి కోరిక ప్రకారం ఎలాగైనా బీటెక్‌ పాసవ్వాలనుకునే సాధారణ కుర్రాడైన గుణ (కార్తికేయ) కాలనీలో అందరికీ సాయం చేస్తూ మంచి కుర్రాడిగా పేరు తెచ్చుకుంటాడు. కాలనీకి కొత్తగా వచ్చిన గీత (అనఘ) అనే అమ్మాయితో గుణ ప్రేమలో పడతాడు. గుణ మంచితనం గురించి తెలిసి గీత కూడా తనని ఇష్టపడుతుంది. స్నేహితుడికి సాయం చేయబోయి గుణ ఇబ్బందుల్లో పడతాడు. గద్ధలగుంట రాధ (ఆదిత్య) అనే రౌడీ హత్య కేసులో గుణ జైలుకు వెళతాడు. దీంతో అప్పటి వరకు హ్యాపీగా సాగిపోతున్న గుణ జీవితం చిన్నాభిన్నం అవుతుంది. గుణ కుటుంబం ప్రమాదంలో పడుతుంది. ఈ సమస్యల నుంచి గుణ ఎలా బయటపడ్డాడు, రాధను హత్య చేసింది ఎవరు, తరువాత గుణ ఏం చేశాడన్నది మిగతా కథ.[4]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: అర్జున్ జంధ్యాల
  • నిర్మాత: అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి
  • రచన: అనిల్ కడియాల
  • సంగీతం: చైతన్ భరధ్వాజ్
  • ఛాయాగ్రహణం: రామ్
  • నిర్మాణ సంస్థ: జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, ఎస్.జి. మూవీ మేకర్స్, స్ప్రింట్ ఫిల్మ్స్

ఇతర వివరాలు[మార్చు]

  1. బోయపాటి శ్రీను వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్‌ జంధ్యాల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

పాటలు[మార్చు]

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "బుజ్జి బంగారం"  నకాష్ అజిజ్, దీప్తి పార్థసారథి 3:28
2. "తొలి పరిచయమా ఇది"  హరిచరణ్  
3. "మనసుకిది గరళం"  విజయ్ యేసుదాస్, శ్వేత మోహన్  
4. "దేవేరి"  గౌతమ్ భరధ్వాజ్, రమ్య బెహరా  
5. "ఢమరుక"  కాల భైరవ  
6. "ఉసురేమో"  మోహన భోగరాజు  

స్పందన[మార్చు]

ఈ చిత్రం విడుదలై ఎమోషనల్‌, యాక్షన్‌, సెంటిమెంట్ సీన్స్‌తో మాస్ ప్రేక్షకులను అకట్టుకుంది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 The Times of India, Entertainment (4 July 2019). "Guna 369: Kartikeya Gummakonda's film to hit the screens on August 2 - Times of India". మూలం నుండి 27 జూలై 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 5 January 2020. Cite news requires |newspaper= (help); Check date values in: |archive-date= (help)
  2. The Hans India, Cinema (12 July 2019). "Karthikeya's Guna 369 getting ready". మూలం నుండి 15 జూలై 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 5 January 2020. Cite news requires |newspaper= (help); Check date values in: |archive-date= (help)
  3. Nyayapati, Neeshita (28 June 2019). "Actress Anagha to make her debut with Kartikeya in Guna 369". The Times of India. మూలం నుండి 4 జూలై 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 5 January 2020. Check date values in: |archive-date= (help)
  4. సాక్షి, సినిమా (2 August 2019). "'గుణ 369‌‌' మూవీ రివ్యూ". సతీష్‌ రెడ్డి జడ్డా. మూలం నుండి 2 ఆగస్టు 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 5 January 2020. Cite news requires |newspaper= (help)

ఇతర లంకెలు[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో గుణ 369

"https://te.wikipedia.org/w/index.php?title=గుణ_369&oldid=2838186" నుండి వెలికితీశారు