గొల్లపల్లి (త్రిపురాంతకం)
"గొల్లపల్లి(త్రిపురాంతకం) ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన గ్రామం[1].
గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°58′08″N 79°21′07″E / 15.969°N 79.352°ECoordinates: 15°58′08″N 79°21′07″E / 15.969°N 79.352°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | త్రిపురాంతకం మండలం |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | ![]() |
గ్రామంలోని దేవాలయాలు[మార్చు]
శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయం:- పురాతనమైన ఈ ఆలయం జీర్ణదశకు చేరటంతో గ్రామస్థులంతా కలసి ఎలాగైనా ఆలయాన్ని పునర్నిర్మించాలని గట్టి పట్టుదలతో చేయీచేయీ కలిపి చందాలు వసూలుచేసి, ఆలయాన్ని రు. 80 లక్షలతో పునర్నిర్మాణం చేసారు. ఆలయంలో మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నారసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, బలరామావతారం,కృష్ణావతారం, బుద్ధావతారం వంటి అందమైన విగ్రహాలను ఏర్పాటుచేసారు. రామాయణం, భాగవతం గ్రంధాలనుండి అంశాలతో పలురకాల శిల్పాలు ఏర్పాటుచేసారు. ఆలయ పునహఃప్రతిష్ఠాకార్యక్రమలను, 2014,జూన్-19 నుండి మూడు రోజులపాటు నిర్వహిoచారు. 21వ తేదీ శనివారం నాడు, శ్రీ సీతారామచంద్రమూర్తి మరియూ పరివార దేవతలతోపాటు, బొడ్రాయి ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. శనివారం నాడు, నిత్యపూజావిధి, పీఠన్యాసం, గర్తన్యాసం, రత్నన్యాసం, యంత్రస్థాపన, అనంతరం ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహించారు. రామనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారు మ్రోగినవి. పరిసర ప్రాంతాలనుండి భక్తులు, తరలివచ్చి ఉత్సవాన్ని కనులారా తిలకించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. [1] & [2]
మూలాలు[మార్చు]
వెలుపలి లింకులు[మార్చు]
[1] ఈనాడు ప్రకాశం; 2014,జూన్-2; 2వ పేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2014, జూన్-22; 9వపేజీ.