గోపీ గాఁయె బాఘా బఁయె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్యజిత్ రే

గోపీ గాఁయ్నె బాఘా బఁయ్నె (గోపీ పాడతాడు - బాఘా వాయిస్తాడు) 1969లో విడుదలైన బెంగాలీ సినిమా. ఈ చిత్రం ఉత్తమ చలనచిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది. ఈ పురస్కారం క్రింద స్వర్ణకమలం, 20 వేల రూపాయల నగదు లభించాయి. దర్శకుడికి 5 వేల రూపాయల నగదు, నగిషీ చెక్కబడిన ప్లేటు (plaque) ఇచ్చారు. ఇదే సినిమాకు గాను ఈ చిత్రదర్శకుడు సత్యజిత్ రేకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు దక్కింది. ఈ చిత్రానికి నేపాల్ దత్తా, ఆషిమ్‌ దత్తాలు నిర్మాతలు.

చిత్రకథ

[మార్చు]

గోపీ ఒక పల్లెటూరులోని ఒక చిన్న వ్యాపారస్తుని కొడుకు. అతనికి సంగీతం అంటే ఎంతో ఇష్టం. అయిత అతని గొంతు అందుకు సహకరించేది కాదు. అతనికి సరైన స్వరాలు పలికేవి కావు. కొందరు పెద్దమనుషులు సరదాకి అతన్ని పొగిడి రాజుగారి దగ్గరకు వెళ్ళి పాడమని ప్రోత్సహించారు. గోపీ వారన్న మాటలన్నీ నిజమేనని నమ్మి రాజుగారి దగ్గరకు వెళ్ళి పాడాడు. ఫలితంగా రాజు అతన్ని కఠినంగా దండించాడు. అతనిని ఆ గ్రామం నుంచి బహిష్కరించాడు.

గోపీ ఆ గ్రామం విడిచి నడవసాగాడు. చీకటి పడే సమయానికి అతను ఒక అరణ్య సమీపానికి వచ్చాడు. అక్కడ అతనికి ఓ స్నేహితుడు కలిసాడు. అతని పేరు 'బాఘా'. అతనికీ సంగీతంలో ప్రవేశం ఉంది. అతడు డోలు వాయిస్తాడు. అతనికీ, గోపీకి పట్టిన గతే పట్టడం వల్ల వారిద్దరికీ త్వరగా సాన్నిహిత్యం కుదిరింది. చీకట్లో ప్రయాణం చేయడానికి వారిద్దరూ భయపడ్డారు. అందువల్ల గోపీ పాడుతూ, బాఘా డోలు వాయిస్తూ ఆ చీకట్లో నడవసాగారు. వారి పాట, వాద్యం ఆ అడవిలో నివాసం ఏర్పరచుకున్న దయ్యాలకు విపరీతంగా ఆకర్షించాయి. అవన్నీ ఉత్సాహంగా నృత్యం చెయ్య నారంభించాయి. అందుకు ప్రతిఫలంగా దయ్యాలరాజు వారు కోరుకున్నప్పుడల్లా ఆహారము, వస్త్రాలు లభించేటట్టు, వారి సంగీత వాద్యాలు సర్వజనులనూ రంజించేటట్టూ, తను ఇచ్చిన పాదరక్షలు ధరించి కావలసిన చోటకు వెళ్ళగలిగేటట్టూ మూడు వరాలు ఇచ్చాడు.

గోపీ, బాఘా ఆ వరాలను తీసుకుని 'ఘండి' అనే సన్మార్గుడైన రాజు ఆస్థానానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. అక్కడికి వెళ్ళి వారు ఒక సంగీత పోటీలో గెలుపొందారు. మంచి పేరు సంపాదించుకున్నారు. అక్కడే సుఖంగా జీవించసాగారు. అయితే అంతలో పొరుగు దేశమైన 'హలా' దేశపు రాజు దుర్మార్గుడైన అతని ప్రధానమంత్రి ప్రోత్సాహంతో ఘండీ మీద యుద్ధం ప్రకటించాడు. గోపీ, బాఘా అతనిని ఎదుర్కోవడానికి నిశ్చయించుకున్నారు. చాలా సాహసాలూ, మాయలూ చేసి 'హల్లా' రాజును పట్టి బంధించి 'ఘండీ' వద్దకు తీసుకుని వచ్చారు. అతనిని చూసి ఘండీ ఆశ్చర్యపోయాడు. వారిద్దరూ కవలలు! అతను ఎన్నడో తప్పిపోయిన తన సొంత సోదరుడు. ఇద్దరూ అమితానందం పొందారు. తమ కలయికకు కారణభూతులైన గోపీ, బాఘాలకు తమ కుమార్తెలను ఇచ్చి వివాహం చేశారు. అదృష్టదేవత వారిద్దర్నీ మరోసారి వరించింది. ఇద్దరూ సుఖంగా జీవించసాగారు.[1]

మూలాలు

[మార్చు]
  1. సంపాదకుడు (1 February 1970). "జాతీయ బహుమతులు". విజయచిత్ర. 4 (8): 26, 29.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు