Jump to content

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్

వికీపీడియా నుండి
ఎడ్వాంటేజ్‌ ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023
GIS 2023
తేదీలు2023 మార్చి 3-4
ప్రదేశంఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానం, విశాఖపట్నం
ప్రారంభించినది2023
దాత(లు)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
వెబ్‌సైటు
https://www.advantageap.in/

ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 (ఆంగ్లం: Global Investors’ Summit) అనేది విశాఖపట్నం వేదికగా 2023 మార్చి 3, 4 తేదీలలో నిర్వహించిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు. ఎడ్వాంటేజ్‌ ఏపీ నినాదంతో 14 రంగాల్లో ఈ సదస్సును నిర్వహించారు. దీనికి దేశవిదేశాల నుంచి వాణిజ్య ప్రతినిధులు, వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలు, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.[1][2]

విశేషాలు

[మార్చు]

మొదటి రోజు

[మార్చు]
  • కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత ముఖేష్‌ అంబానీ సహా దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు పలువురు హాజరయ్యారు.
  • రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 340 ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించాడు. కాగా మొదటి రోజు రూ.11.85 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 92 ఎంఓయూలు కుదుర్చుకున్నారు. 15 కీలక రంగాల్లో పెట్టుబడులతో 6 లక్షల 3 వేల 223 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం నిర్వహిస్తున్న జీ-20 సదస్సుకు సంబంధించిన వర్కింగ్‌ కమిటీ సమావేశాలకూ విశాఖ నగరం ఆతిథ్యమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

రెండవ రోజు

[మార్చు]
  • గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర పోర్టులు, షిప్పింగ్స్‌ శాఖ మంత్రి శర్బానంద సోనోవాలా, భారత్‌ బయోటెక్‌ ఎండీ సుచిత్ర కె ఎల్లా, రెడ్డిస్‌ ల్యాబ్‌ చైర్మన్‌ సతీష్‌ రెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ తదితరులు
  • రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 248 ఒప్పందాలు
  • మొత్తం రూ. 13 లక్షల 5వేల 663 కోట్ల పెట్టుబడులు రాబట్టారు
  • జీఐఎస్‌ విజయానికి కృషి చేసిన  అందరికీ రాష ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియచేసారు

మూలాలు

[మార్చు]
  1. "Global Investors summit: విశాఖలో ప్రారంభమైన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌." web.archive.org. 2023-03-04. Archived from the original on 2023-03-04. Retrieved 2023-03-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Global Investors Summit: ఏపీకి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు". web.archive.org. 2023-03-04. Archived from the original on 2023-03-04. Retrieved 2023-03-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)