చదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చదం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా లోని రాయదుర్గం మండలానికి చెందిన గ్రామం.

చదం
—  రెవిన్యూ గ్రామం  —
చదం is located in Andhra Pradesh
చదం
చదం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 14°46′34″N 76°52′14″E / 14.776110°N 76.870447°E / 14.776110; 76.870447
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండలం రాయదుర్గం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషుల సంఖ్య 1,789
 - స్త్రీల సంఖ్య 1,628
 - గృహాల సంఖ్య 699
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది మండల కేంద్రమైన రాయదుర్గం నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 699 ఇళ్లతో, 3417 జనాభాతో 825 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1789, ఆడవారి సంఖ్య 1628. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 558 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 6. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 594661[1].పిన్ కోడ్: 515865.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి.బాలబడి, మాధ్యమిక పాఠశాల‌లు రాయదుర్గంలో ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల రాయదుర్గంలోను, ఇంజనీరింగ్ కళాశాల బళ్ళారిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల బళ్ళారిలోను, పాలీటెక్నిక్ రాయదుర్గంలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల రాయదుర్గంలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు అనంతపురంలోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

చాదంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం, ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 6 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

చాదంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 15 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 28 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 20 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 248 హెక్టార్లు
  • బంజరు భూమి: 286 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 228 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 762 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

చాదంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వేరుశనగ, వరి, పొగాకు

దేవాలయాలు[మార్చు]

చతుర్ముఖనందీశ్వర లింగం-పశుపతినాధ దేవాలయం చరిత్ర[మార్చు]

ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న కొండపై నిర్మింపబడింది ఈ ప్రాచీన దేవాలయం.స్థానికులచే ఈ దేవాలయం పశుపతినాధ దేవాలయం అని పేర్కొనబడుచుంది..ఈ దేవాలయంలో ప్రతిష్ఠించబడిన శివలింగమే చతుర్ముఖ నందీశ్వరలింగం.ఆలయంతోటి ఈగుట్ట నిండుగ లింగాకారంలో పెక్కు గుడులు ఉన్నందున ఈ గుట్టను ఇచ్చటివారు లింగాలబండ అంటూ ఉంటారు.ఈ ఆలయం గురించి మాజీ పురాతత్వ శాఖ అధికారి నిప్పాణి రంగారావు పలు విషయములు పరిశోధించాడు. ఈ ఆలయం చుట్టూ ప్రాకారం ఉంది.నాలుగు మూలల నందులు ఉన్నవి. నాలుగు ద్వారాలు కలవు.ద్వారాలపై చిన్న గోపురాలు అమర్చబడి ఉన్నాయి.ప్రతి గోపురానికి నాలుగు మూలల దేవకోష్థములతో నాలుగు వృషభ వాహనారూఢ శివవిగ్రహాలు తీర్చబడి ఉన్నాయి.లోపల ఒకమూల పాకశాల, దానికి కొంతదూరంలో ఒక మంటపం ఉన్నాయి.గర్భ గృహం, అంతరాల మంటపం, అర్ధముఖ మంటపం అన్నీ ఆలయాలలో వలే శాస్త్రప్రకారం నిర్మించబడి ఉన్నాయి.కానీ గోడలపైగాని, ఆలయం లోపల వైపునగాని, స్థంభాలకు గాని, చెప్పదగ్గ కళాత్మకమైన శిల్పం ఈ ఆలయంలో కనిపించదు.ఉన్న విషయమంతా ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన చర్ముఖ నందీశ్వర లింగమే!

ఈ ఆలయం ఏకాలంలో నిర్మించబడినదో, ఆలయ నిర్మాతలెవరో తెలియదగిన శాసనాధారం ఇచ్చట లభించలేదు.అన్ని ఆలయాల్లో దృవబేరమనీ, మూలవిరాట్టుని, చెప్పబడే ప్రధానమూర్తి గర్భగృహం మధ్యభాగంలో ఏదిలేక పానవట్టంపై ప్రతిష్ఠించబడుట సంప్రదాయం, శాస్త్రవిహితం అయ్యిండగా ఈఆలయంలో ఇందుకు విరుద్ధంగా గర్భగృహం ఖాళీగా వుంచబడి మూలవిరాట్టు గర్భగృహానికి ముందుభాగాన ఉండే అంతరాల మండపం మధ్యలో వేదికపై ప్రతిష్టించబడి ఉంది.లింగం నాలుగు నందులు ఒకేరాయితో కలిసికట్టుగా మలచబడి ఉండుట ఈ లింగం విశేషం.నందులు సర్వాలంకారాలు కలిగి ఉండునట్లు చక్కగా తీర్చబడినవి.విమానం మాత్రం గర్భగృహం పైననే కట్టబడి ఉంది.విమానం నాలుగు మూలలా నాలుగు నందులు ఉన్నాయి.ఇది ఈ దేవాలయం స్వరూపం. ఇటువంటి లింగాలని ఆగమ శాస్త్రాలయందు ఎక్కడా చెప్పబడుటలేదు.

ఆగమ శాస్త్రాలను విరివిగా పరిశోధించిన పెద్దలు ఆచార్య సి.శివరామమూర్తి,టి.గోపీనాధరావు, బి.యన్.శర్మ మొదలగువారు చతుర్ముఖ లింగముగూర్చి ఎక్కడ వారి రచనలో పేర్కొని ఉండలేదు.

నంది, నందీశ్వర, నంది కేశాది నామాలతో శివునకు పరివార దేవతులున్నట్లు హేమాద్రి వివరించాడు.వరాహపురాణంలో నందికేశ్వరుడు శివునిగూర్చి కఠోరమైన తపస్సుచేసి ఆదేవుని అనుగ్రహానికి పాత్రుడై శివసారూప్యము పొంది ప్రమధగణాలన్నింటికి అధిపతి చేయబడినట్లు చెప్పుచుంది.శివునకు నందీశ్వరుని రూపం ఇచ్చినట్లు ఎక్కడా చెప్పబడుటలేదు.

12వ శతాబ్దంలో చాళుక్య ప్రభువు మూడవ తైలపదేవుని పరాజయం తరువాత వీరశైవ మతం ప్రాధాన్యానికి వచ్చుటతో శివాలయాలలోకూడ నందీశ్వరునికి ప్రముఖస్థానం ఇచ్చినట్లు తెలుస్తుంది. వీరశైవులేకాక లింగాయతులనబడు బసవ మతానుయూయులకు ఈనందీశ్వరుడు ఆరాధ్యదైవమైనాడు.వీరశైవమతం విస్తరంగా ప్రాచుర్యం పొందిన కర్ణాటక రాష్ట్రానికి ఈ గ్రామం దగ్గరలో ఉండుటవలన వీరశైవమతస్థులే 13 వ లేదా 14వ శతాబ్దకాలంలో ఈఆలయాన్ని నిర్మించిఉంటారు. వీరశైవులకు అప్పుడు ఇది ఒక పవిత్ర యాత్రాస్థలంగా చదం గ్రామమునందలి ఈపశుపతినాధ ఆలయం వర్ధిల్లి ఉండవచ్చును.

మూలాల జాబితా[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=చదం&oldid=3320167" నుండి వెలికితీశారు