చర్చ:అశ్వఘోషుడు
అశ్వఘోషుడు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2022 సంవత్సరం, 23 వ వారంలో ప్రదర్శించారు.
పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ |
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఉంచెయ్యాలి
Sir, అశ్వఘోషుడు వ్యాసం చాలా కాలం (2009) నుంచి మొలక దశలోనే వుంది. మహాకవి కాళిదాసు యొక్క కవితా శైలిని ప్రభావితం చేసిన ఆశ్వఘోషుని వ్యాసం సంవత్సరాలుగా మొలక దశలోనే మగ్గుతుండడం విచారకరం. దీనిని విస్తరించే ప్రయత్నం కూడా ఏదీ ఇంతవరకు జరగలేదు. కాబట్టి వ్యాసాన్ని కొత్తగా ప్రారంభించడానికి అవకాశం ఎవరికైనా open గా కల్పిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మూస లో ప్రకటించిన గడువు (ఒక నెల రోజులు) కూడా మీరిపోయి వుంది. కాబట్టి నిర్వాహకులు మూసలో తెలియచేసినట్లుగా ఈ మొలక వ్యాసాన్ని తొలగించే అవకాశం ఏదైనా వుంటే అది పరిశీలించగలరు. తద్వారా అశ్వఘోషుడు వ్యాసాన్ని కనీసం సరికొత్తగా పునః ప్రారంబించే అవకాశం ఇంకొకరికి ఇచ్చినట్లవుతుంది. --Vmakumar (చర్చ) 13:19, 16 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
- కుమార్ గారూ, వ్యాసాన్ని విస్తరించేందుకు మీరు ఉత్సాహం కనబరచారు. మీరందుకు సమర్ధులు కూడాను. అయితే ఈ వ్యాసాన్ని తొలగించనవసరం లేదు.. ఉన్నపాటున విస్తరించవచ్చు. లేదూ తొలగించేసి కొత్తగా రాద్దామని మీరు భావిస్తే, అలాగే తొలగిస్తాను. నిర్ధారించండి. __చదువరి (చర్చ • రచనలు) 11:17, 12 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
కృతజ్ఞతలు
[మార్చు]Chaduvari గారు, అశ్వఘోషుడు వ్యాసం రెండు, మూడు రోజులలో ప్రారంభిస్తాను. మీరు తెలియచేసినట్లు అదే వ్యాసంలోనే విస్తరిస్తాను. పాత వ్యాసాన్ని ఏమాత్రం తొలగించనవసరం లేదు.
చాలా వ్యాసాలు మొలకలుగా మిగిలిపోతున్నాయి. ఎక్కువమంది వాటి మీద కూర్చొని విస్తరించడానికి ముందుకు రావడం లేనపుడు, ఒక సంవత్సరమో లేదా రెండు సంవత్సరాలో ఏదో ఒక time bound (కాలపరిమితి) పెట్టుకొని వాటిని ప్రక్కన పెట్టడానికి మీ వంటి అధికారులు, సీనియర్లు పూనుకొంటేనే బాగుంటుంది.
ఇలాంటి విషయంలో ఇంగ్లీష్ లాంటి పరభాషా వికీలో ఎలాంటి సంప్రదాయాలు వున్నాయి అనేది అధికారులకు తెలిసే అవకాశం వుంటుంది. ఏదైమైనా పైరు ఏపుగా పెరగాలి అంటే ఒకటి, రెండు సంవత్సరాలకు కూడా పెరగలేని, పెరగలేకపోయిన చిన్న చిన్న మొలకలను ప్రక్కన పెట్టడం మంచిదే అని భావిస్తున్నాను.
నా దృష్టిలో మొలకలు మంచివే. రేపో మాపో అవి చక్కగా విస్తరించబడవచ్చు కూడా. అయితే సంవత్సరాల తరబడి ఏమాత్రం పెరగని, పెరగలేని మొలకలతోనే అసలు సమస్య వస్తుంది. మన దృష్టి అటువంటి వాటి మీదనే పెట్టాల్సి వుంటుంది. అలా అని మొలకలను ముందుగా తొలగించినా బాగోదు. అవి ఎంతకూ ఎదగని మొలకలుగా ఉంటుండగానే అదే పేరుతొ ఎవరైనా కొత్త వ్యాసం రాయడానికి పూనుకొని ముందుకువస్తే, ఆవిధంగా కొత్త వ్యాసం రాయబడిన తరువాతనే పాత మొలక వ్యాసాన్ని తొలగించే ప్రయత్నం చేయవచ్చు.
ఈ విధంగా ఏళ్ల తరబడి పెరగలేని మొలకల విషయంలో మంచి ధృడమైన నిర్ణయం ఏదైనా అధికార్లు తీసుకొంటే, అది ఇంతవరకూ ఎవరూ తీసుకొనని నిర్ణయమైనప్పటికి, తెలుగువికీ అనే పైరు ఏపుగా పెరగడానికి ఒక మంచి సంప్రదాయం జత చేసినట్లవుతుంది.
దీనికోసం నా చిన్న సలహా
- ముందుగా అతి చిన్న మొలక వ్యాసాలను తొలగించడానికి కావాల్సిన criteria చర్చకు పెట్టండి. లేదా అధికారులుగా మీరే నిర్దేశించండి.(1.సైజు: ఒక వ్యాసం మొలక దశలో వున్నది అని చెప్ప్పడానికి కావలిసిన బైట్స్ పరిమితిని నిర్దేశించండి. 2.గిడస బారిన అంటే ఎదుగూ బొదుగూ లేకుండా వుండిన కాలం: ఎంతకాలం నుండి అది విస్తరించకుండా కురచబారిపోయి వుందో ఉదాహరణకు ఒకటి లేదా రెండు లేదా మరిన్ని సంవత్సరాలు - ఏదో ఒక ఒక కాలపరిమితిని నిర్దేశించండి)
- పై విధమైన రెండు ప్రమాణాలలో వున్న అత్యంత చిన్న మరియు ఎదుగూ బొదుగూ లేని మొలకల వ్యాసాలను list out చేసి వాటిని ఒక కొత్త వర్గంలో చేర్చండి.
- ఈ కొత్త వర్గంలోని చేర్చబడిన మొలక వ్యాసాలను అదే పేరుతో ఎవరైనా కొత్తగా ప్రారంభించవచ్చు అని ప్రకటించండి. అలా కొత్తగా ఎవరైనా రాసినపుడు, అలా రాయబడిన నూతన వ్యాసం అదే పేరుతొ వున్న పాత మొలక వ్యాసం కన్నా మెరుగైన స్థితిలో (రాశి, వాశిలో) వున్నప్పుడు, అదే పేరుతొ వున్న పాత మొలక వ్యాసంను తొలగిస్తామని ప్రకటించండి.
ఇలా ఒక పాలసీ గా నిర్ణయిస్తే ఎక్కువ మందికి ఇది ఆకర్షితంగా ఉండవచ్చు. కొత్తగా రాయడానికి ముఖ్యంగా కొత్తవారికి కావలిసిన ప్రేరణ ఇవ్వవచ్చు. ఒకవేళ మీరు ప్రకటించబోయే proposal ఎవరికీ నచ్చకపోయినా ఏం పరవాలేదు. ఎవరూ ముందుకు రాకపోయినా పరవాలేదు. ఎదుగూ బొదుగూ లేకుండా పడివున్న మొలక వ్యాసాలు ఇంతకు ముందు ఎలాగ వున్నాయో అలాగే పడి వుంటాయి. కారణం సంవత్సరాల తరబడి మన వికిలో గిడసబారిన మొలక వ్యాసాలు కలుపులా పేరుకుపోయాయి. తెలుగు వికి సంవత్సరాలుగా వాటిని మోస్తూ వచ్చింది. భవిష్యత్తులో కూడా మోస్తూనే వుంటుంది తమను విస్తరించేవారి కోసం ఎదురుచూస్తూ. కాకపొతే కొత్త వ్యాసంగా రాయాలనుకొనే కొత్తవారికి ప్రేరణ కల్పించే ఒక మంచి open అవకాశం మీరు వికీపీడియన్లకు కల్పించినట్లవుతుంది.
కొత్త వికీపీడియన్లు దీనిని ఒక చక్కని అవకాశంగా భావించవచ్చు. ఆ అవకాశం అంది పుచ్చుకొంటే మన పైరు ఏపుగా పెరుగుతుంది. ఆ అవకాశం అంది పుచ్చుకోకపోతే కొంపలు ఏమీ మునగవు. ఇంతకు ముందులాగే గిడసబారిన మొలకలు మన పైరులో పడివుంటాయి. అవి కూడా పెరిగేవరకూ మరింత సహనంతో మరికొంతకాలం నిరీక్షిస్తూ ఉండవచ్చు. మొలకలను తగ్గించడానికి వికీ పెద్దలు, అధికారులు ఒక మంచి ప్రయత్నం చేసినట్లు అవుతుంది.
ఏది ఏమైనా పైన పేర్కొన్న సూచనలు (అశ్వఘోషుడు మొలక వ్యాసానికి తెలియచేసిన విధంగా ఇతర మొలక వ్యాసాలకు ఒక పాలసీ పరంగా ప్రకటించవచ్చు) మీ వంటి పెద్దలు పరిశీలించగలరని కోరుకొంటున్నాను. ఇది wiki అధికారులకు, పెద్దలకూ నాకు తోచిన సలహా మాత్రమే.
Chaduvari గారు, అశ్వఘోషుడు వ్యాసం తప్పనిసరిగా రెండు, మూడు రోజులలో విస్తరించడం ప్రారంభిస్తాను. పాత వ్యాసాన్ని ఏమాత్రం తొలగించనవసరం లేదు. అని తెలియచేసుకొంటున్నాను. --Vmakumar (చర్చ) 23:14, 13 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
- Vmakumar గారూ, వ్యాసాన్ని ఉంచేస్తున్నాను. ఇకపోతే, మొలకలపై గతంలో కూలంకషంగా చర్చలు జరిగాయి. విస్తరణకు నోచుకోని మొల్క్లను తొలగించాలనే నిర్ణయాన్ని అప్పుడు తీసుకున్నారు. ఎన్నాళ్ళ తరువాత తొలగించవచ్చో నాకు గుర్తులేదు. ఓ సారి పాత రచ్చబండ చర్చల్లో వెతికి చూడాలి.__చదువరి (చర్చ • రచనలు) 04:51, 14 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.