చర్చ:ఆర్థర్ కాటన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


Cscr-featured.svg ఆర్థర్ కాటన్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2017 సంవత్సరం, 20 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia

చిత్రాలచేర్పు[మార్చు]

ఆర్థర్ కాటన్ వ్యాసంలో,ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో ఉపయోగించిన యంత్రాల చిత్రాలను చేర్చవచ్చునా?.దయచేసితెలుపగలరు.పాలగిరి (చర్చ) 03:47, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి ఆర్ధర్‍ కాటన్చేసిన కృషి వివరిస్తూ చిత్రాలను చేరిస్తే బాగుంటుంది. --t.sujatha (చర్చ) 04:27, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసము చివరి భాగమున ఆనకట్ట నిర్మాణంలో ఉపయోగించిన యంత్రాలు, తదితర మయినవి "'చిత్రాలు"' విభాగము నందు చేర్చిన బావుంటుంది అని నా అభిప్రాయము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:14, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ధవళేశ్వరం ఆనకట్ట గురించి ప్రత్యేకమైన సమాచారంతో ఒక వ్యాసం చేస్తే బాగుంటుంది. కాలువలు, కోనసీమలో వ్యవసాయాన్ని దాని ప్రయోజనం మొదలైన విషయాలతో, కొత్తగా దాని మీద నిర్మించిన రోడ్డు గురించి కూడా చేర్చవచ్చును.Rajasekhar1961 (చర్చ) 06:18, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నా సందేహానికి స్పందించి సలహలిచ్చినందుకు మీకు ధన్యవాదాలు.ప్రస్తుతానికి చిత్రమాలిక పేరుతో కాటన్ వ్యాసంలో చిత్రాలు చేర్చాను.ధవళేశ్వరం బ్యారేజి గురించి తగినంత సమాచారం సేకరించిన తరువాత,చిత్రాలను ఆవ్యాసంకు తరలిస్తాను.ధవళేశ్వరం గురించి తగినంత సమాచారం ప్రస్తుతం నావద్ద లేదు.పాలగిరి (చర్చ) 06:49, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియా:చొరవ_తీసుకుని_దిద్దుబాట్లు_చెయ్యండిచూడండి. దాని ప్రకారం ధైర్యంగా దిద్దుబాట్లు చేయడమే వికీ పద్ధతి. ఈ విషయం ఆవ్యాసం చర్చాపేజీలో వ్రాసి, {{సహాయం కావాలి}} మూస చేర్చితే చర్చసరియైనపేజీలో వుండి ముందుముందుకూడ వుపయోగంగా వుంటుంది. వికీపీడియా అంతటికీ సంబంధించిన చర్చా విషయాలు మాత్రమే ఇక్కడ చేర్చమనికోరుతున్నాను. --అర్జున (చర్చ) 09:17, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో ఆర్థర్ కాటన్ కృషి ఉన్నంత మాత్రాన ఆనకట్ట నిర్మాణంలో ఉపయోగించే యంత్రాల చిత్రాలనూ చేర్చే అవసరం లేదు. ఆ యంత్రాలకు కాటన్ కు ప్రత్యక్ష సంబంధం ఉండి ఉంటే మాత్రం కొన్ని చేర్చవచ్చు, అదీ వ్యాస పరిమాణానికి అనుగుణంగానే. 106.66.81.73 14:08, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఆనకట్ట నిర్మాణానికి వాడిన యంత్రాలను,ధవళేశ్వరం ఆనకట్ట వద్దనున్న 'కాటన్ మ్యూజియం ' లో ప్రదర్శనకు వుంఛారు.ఆయంత్రాలను ఎప్పుడు,ఎందుకువాడారో వివరణ ఫలకాలున్నాయి.వాటికి కాటన్ కు సంబంధం లేనిచో ఆయనకు సంబంధించిన మ్యూజియంలో వుంచరుకదా!పాలగిరి (చర్చ) 17:06, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఆనకట్టకు సంబంధించిన యంత్రాల చిత్రాలను ఒక విభాగంలో చేర్చితే తప్పులేదు. ఎందువలనంటే ఆ యంత్రాలు ఆ ఆనకట్టకు సంబంధించినవి మరియు కాటన్ కు సంబంధం గలవి.( కె.వి.రమణ- చర్చ 17:29, 13 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
పాలగిరిగారు ! అరుదైన చిత్రాలు చేర్చినందుకు ధన్యవాదాలు. ఈ చిత్రాలను తొలగించకండి. కావాలంటే ధవళేశ్వరం ఆనకట్ట వ్యాసం ప్రారంభించి చిత్రాలను అందులోకి తరలిద్దాం ఈ ఆనకట్టకు ఆర్ధర్ కాటన్ ఎంతో కృషి చేసారు. ఆయన వ్యాసంలో ఈ చిత్రాలు ఉండడం పొరపాటేమి కాదు. ఆనకట్ట నిర్మాణం తరువాత గోదావరి నదిలో స్నానమాచరిస్తూ బ్రాహ్మణులు సంకల్పం చెప్పే సమయంలో ఆర్ధర్ కాటన్ పేరు స్మరించే వారని ఎక్కడో చదివాను. అంటే వారు ఈ ఆనకట్ట నిర్మాణంలో అంత పాలుపంచుకున్నారన్నమాట. --t.sujatha (చర్చ) 17:45, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

గోదావరిలో స్నానం తరువాత బ్రాహ్మణులు పఠించిన స్మరణ శ్లోకం

నిత్య గోదావరిస్నాన పుణ్యదోయోమహమతిః

స్మరామ్యాంగ్లేయ దేశియం కాటనుంతం భగీరథం

పాలగిరి (చర్చ) 14:45, 14 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వంశవృక్షం[మార్చు]

కాటన్ వంశవృక్షం తయారుచేస్తే బాగుంటుంది. వీరిలో ముగ్గురు వ్యక్తులు భారతదేశంలో ఉన్నతస్థానాన్ని చేరి దేశానికి సేవచేశారు.--User:Rajasekhar1961