చర్చ:తెలంగాణ ముఖ్యమంత్రుల జాబితా
Jump to navigation
Jump to search
ప్రాతిపదికపై చర్చ
[మార్చు]- క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.
ఈ జాబితా ప్రాతిపదిక విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి:
- పరిపాలన భూభాగాలు వేరు ఈనాటి తెలంగాణ, ఆనాటి హైదరాబాద్ రాష్ట్రం భౌగోళికంగా ఒకటి కాదు. హైదరాబాద్ రాష్ట్రంలో నేటి తెలంగాణ, మహారాష్ట్రలోని మరాఠ్వాడా, కర్ణాటకలోని కర్ణాటక హైదరాబాద్ ప్రాంతాలు కలిసి ఉండేవి. ఈనాటి తెలంగాణ అప్పటి హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలున్న రాష్ట్రం మాత్రమే. కాబట్టి తెలంగాణా ముఖ్యమంత్రులు అన్న వ్యాసంలో హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా వేయడం సరికాదు.
- తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రుల జాబితా?: తెలంగాణ ముఖ్యమంత్రుల జాబితా అన్నది తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రుల జాబితాగా మార్చుకుని తదనుగుణంగా తిరగరాయవచ్చు. అప్పుడు నియమిత ముఖ్యమంత్రి అయిన ఎం.కె.వెల్లోడి జాబితాలో ఉండరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన పి.వి.నరసింహరావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య వంటివారూ జాబితాలో చోటుచేసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖరరావు ఎలానూ ఉంటారు.
కాబట్టి దీన్ని తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రులన్న జాబితా చేద్దామా? --పవన్ సంతోష్ (చర్చ) 05:19, 13 జూన్ 2019 (UTC)
- పవన్ సంతోష్ గారు చెప్పినట్లు తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రుల జాబితా సరైనదే.--నాయుడు గారి జయన్న (చర్చ) 17:21, 13 మార్చి 2021 (UTC)
- చదువరి అభిప్రాయం
- అవును, తెలంగాణా ముఖ్యమంత్రులు అన్న వ్యాసంలో హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా వేయడం సరికాదు. దానికి ఈ పేజీ సరైన స్థానం కాదు.
- "తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రుల జాబితా" అని ఎందుకు మార్చాలో అర్థం కాలేదు. ఈ పేజీ ఈ రూపంలో ఉంటే తప్పేమీ లేదు కదా. నా ఉద్దేశం మార్చకూడదు, ఇలాగే ఉండనివ్వాలి. __చదువరి (చర్చ • రచనలు) 06:29, 7 మే 2021 (UTC)
నిర్ణయం అమలైపోయింది కాబట్టి చర్చను ముగిస్తున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 04:55, 16 జూన్ 2022 (UTC)
పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.