చర్చ:నారా చంద్రబాబునాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నారా చంద్రబాబునాయుడు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2014 సంవత్సరం, 21 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


నారా చంద్రబాబునాయుడు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2020 సంవత్సరం, 17 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


chandrababu naidu's dual standards on many issues were not highlighted in the story

వంశవృక్షంలో పలు సార్లు ఇంటిపేరు

[మార్చు]

వంశవృక్షంలో పలుమార్లు ఇంటి పేరు వ్రాశారు. ఇంటి పేరు లేకుండా ఉంటే చదివేటప్పుడు కొంత సమయం మిగులుతుంది. నందమూరి కాకుండా మిగతా వాళ్ల ఇంటిపేర్లు ఉంచవచ్చు కానీ నందమూరి ఎలాగూ ఇంప్లైడ్ కదా తొలగించవచ్చనుకుంటాను. Chavakiran (చర్చ) 08:41, 27 మే 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వంశవృక్షం తయారుచేసిన రమణగారికి ధన్యవాదాలు. వంశవృక్షాలలో అందరికీ ఇంటిపేర్లు తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలకు పుట్టింటి పేరు తప్పకుండా ఉండాలి. లేకపోతే ఆమె ఏ కుటుంబం నుండి వచ్చింది తెలుసుకొనే అవకాశం ఉండదు. Rajasekhar1961 (చర్చ) 09:41, 27 మే 2014 (UTC)[ప్రత్యుత్తరం]

విమర్శనాత్మక విషయాలు తొలగించడం

[మార్చు]

ఈ పేజి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించింది. ఇందులో కొన్ని అభ్యంతరకరమైన వాక్యాలు (1. 1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించి ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయిన పిదప లక్ష్మీ పార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామనే అధికారం నుంచి దించి అతను పీఠం ఎక్కడం అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాలలోనే సంచలనం కలిగించింది. 2. బాబు గారి ప్రభుత్వ హయాంలో ఎర్ర చందనాన్ని అక్రమంగా జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు దాటిస్తున్న స్మగ్లర్లను, కింగ్‌పిన్‌లను వదిలిపెట్టి పక్కరాష్ట్రం నుండి పొట్టకూటి కోసం వచ్చిన 20 మంది కూలీలను చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో టాస్క్‌ఫోర్స్‌, అటవీశాఖ సంయుక్త ఆపరేషన్‌ పేర పట్టుకొచ్చి పోలీసులు విచక్షణారహితంగా కాల్చి చంపినారు) ఉన్నాయి. అంతేకాకుండా వివాదాలు, విమర్శలు అనే దానిలో చంద్రబాబునొ విమర్శిస్తూ రాశారు. వాటిని తొలగిస్తే మంచిదని నా అభిప్రాయం. --Pranayraj1985 (చర్చ) 19:43, 20 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక్కో విషయంపై విశ్లేషణ

[మార్చు]
  • బాబు గారి ప్రభుత్వ హయాంలో ఎర్ర చందనాన్ని అక్రమంగా జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు దాటిస్తున్న స్మగ్లర్లను, కింగ్‌పిన్‌లను వదిలిపెట్టి పక్కరాష్ట్రం నుండి పొట్టకూటి కోసం వచ్చిన 20 మంది కూలీలను చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో టాస్క్‌ఫోర్స్‌, అటవీశాఖ సంయుక్త ఆపరేషన్‌ పేర పట్టుకొచ్చి పోలీసులు విచక్షణారహితంగా కాల్చి చంపినారు.
    • విచక్షణారహితంగా కాల్చారో, లేక వాళ్ళే చెప్పినట్టు దాడిచేస్తుంటే ఎదురుదాడి చేశారో అప్పుడే తేలే విషయం కాదు. ప్రజాశక్తి, సాక్షిలాంటి దినపత్రికల మూలాలు ఇచ్చారు. దీనికి మరోకోణం మిగిలిన పత్రికల్లో ఉంటుంది. ఇటువంటివి తప్పనిసరిగా పక్షపాత ధోరణలోనే ఉన్నట్టున్నాయి.
  • అం.ప్ర రాజధాని ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవసరాలను విశ్లేషణా నివేదిక, పర్యావరణ, సామాజిక ప్రభావాల మదింపు, వివరణాత్మక ప్రాజక్టు నివేదిక లాంటి అంశాలన్నిటినీ విస్మరించినారు.
    • దీనికి కొంచెం బెటర్ మూలం ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనరాదు, అది మంత్రివర్గ నిర్ణయం.
  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో మళ్లీ కన్సల్టెన్సీల రాజ్యం మొదలైంది. కన్సల్టెన్సీలకోసం ప్రణాళికా శాఖ పద్దు కింద 2015 సం.కి గాను ఏకంగా రూ.వంద కోట్లను కేటాయించాలని ప్రతిపాదించడం ఆర్ధిక శాఖ అధికారులను విస్మయపరిచింది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. ఆయా కార్యక్రమాలకు కన్సల్టెన్సీలను నియమించి కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను చెల్లించినాడు.
    • మళ్ళీ కన్సల్టెన్సీల రాజ్యం మొదలైంది అన్న పదమే పక్షపాతానికి నిదర్శనం. ఒక్కో ముఖ్యమంత్రి పనితీరు ఒక్కోలా ఉంటుంది. కన్సెల్టెన్సీలు నియమించి కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులు చెల్లించడం అన్న పదంలో దోషారోపణ ఏమీ కనిపించడంలేదు. ఆయా కన్సెల్టెన్సీలు పనిచేయకపోతే దోషం కానీ. దీనికి మళ్ళీ సాక్షి మూలంగా ఇచ్చారు.
  • నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధానిలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకొక రూలు, తమకు, తమ తాబేదార్లకు ఇంకో రూలు పాటిస్తూ పక్షపాతా నికి తెరదీయడం జుగుప్సాకరం. రైతుల ఇష్టా ఇష్టాలతో సంబంధం లేకుండా ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి మరీ రాజధానికి భూములివ్వాలని బలవంతపెడుతున్న సర్కారు, తమ వారి దగ్గరకొచ్చేసరికి ఎక్కడలేని ఉదారం ప్రదర్శిం చడం దారుణం.
    • ఇదీ తీవ్రారోపణలే పనిగా పెట్టుకున్నట్టు లేదూ? మళ్ళీ ప్రజాశక్తే మూలం. పత్రికల్లో ఇలాంటి ఆరోపణలు తప్పులేదు కానీ మనం ఇటువంటి విషయాలు రాయాలంటే ఒకరినొకరు రోజూ దోషాలెంచుకునే పత్రికలను కాక సమగ్రమైన నివేదికలు ఏమైనావుంటే వాటిని ఆధారంగా పెట్టుకోవాలి. అందులోనూ పత్రికా పదజాలం వాడడానికి లేదు. జుగుప్సాకరం, దారుణం లాంటివి కాకుండా విషయం విషయంగా తెలిపే పదాలు, సమగ్రమైన నివేదికలు ఉంటే దాని ఆధారంగా వ్రాయాలి.
  • నిధులు రాబట్టుకొనేందుకు కేంద్రంపై ఒత్తిడి చేయకుండా.. పెట్రోలియం ఉత్పత్తులపై ప్రత్యేక సుంకం, విద్యుత్‌ ఛార్జీలపెంపు, స్థానిక సంస్థల్లో పౌర సేవలకు వినియోగ ఛార్జీలు తదితరాలు ప్రజలపై ఇష్టారీతిన మోది ఖజానా నింపుకోవదానికి ప్రయత్నిస్తున్ననది. సర్కారీ అస్పత్రులనూ వదిలేటట్లు లేరు.
    • మళ్ళీ మనకు తగని పదజాలం. నిధులు రాబట్టుకునేందుకు రాష్ట్రప్రభుత్వం ఫలానావారిపై ఒత్తిడి తేవాలని మనం సూచించరాదు. ఖజానా నింపుకోవడం, సర్కారీ ఆస్పత్రులను వదిలేట్లు లేకపోవడం వంటి ప్రయోగాలు వికీలో తగవు.
  • సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా అన్నిటా ఆధార్ అమలుకు నడుం బిగించి సంక్షేమ పథకాలకు కోత వేసినారు. సామాజిక పింఛను మొత్తాన్ని ఐదు రెట్లు పెంచిన ప్రభుత్వం లబ్ధిదార్ల సంఖ్యను ఘోరంగా కుదించింది.
    • ఇది కొంత మేలు. దూషణ పదజాలం లేదు.
  • అం.ప్ర రాజధాని కోసం 2013, భూసేకరణ చట్టం పరిధిలో కాకుండా ల్యాండ్‌ పూలింగ్‌ పద్ధతిలో భూములను సేకరించేందుకు సిద్ధపడ్డారు. పూలింగ్‌కు ఒప్పుకోకపోతే బలవంతపు భూ సేకరణ చేస్తామని బెదిరింపులకు దిగారు. రైతుల నుంచి సమీకరించిన భూములను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేయడం, యూజర్‌ ఛార్జీలతో ప్రజలపై భారాలు మోపడం, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పేర సమస్తాన్నీ ప్రైవేటీకరించడం సర్కారు ఎజెండాగా కనబడుతోంది.
    • సర్కారు ఎజెండాగా ఏదో కనిపిస్తే దాన్ని అలా రాసేయడం కుదరదు. ఉదాహరణకు ఫలానా సినిమా విజయవంతం అవుతుందని అందరూ అనుకుంటున్నారని పత్రికల్లో రాసేస్తారు. వికీలో అలారాయడం చెల్లదు. ఇక మిగిలిన పాయింటుకు పైన 4వ పాయింటులో సమాధానమిచ్చాను.
  • 2004లో నిలిపివేసిన ప్రపంచ బ్యాంకు అజెండాను తిరిగి నెత్తికి ఎత్తుకున్నారు.
    • ఏవిటా అజెండా, ఏయే అంశాల్లో తిరిగి పునస్థాపించారు? వంటివి లేకుండా ఆరోపణ.
  • అధికారం కోసం పిలనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచారని అపఖ్యాతి మూటగట్టుకున్నారు.
    • ఇది పక్కా పక్షపాతపు ఆరోపణే. ఇది ఆయన జీవితంలోని ముఖ్యఘటనే, కాకుంటే వాటిని వికీ ఒక శైలిలో వ్రాస్తుంది. ఉదా: 1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించి ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయిన పిదప లక్ష్మీ పార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామనే అధికారం నుంచి దించి అతను పీఠం ఎక్కడం అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాలలోనే సంచలనం కలిగించింది. అంతకు మించి పదేపదే ప్రస్తావించడం ఏమీ అంత నిష్పాక్షికమైన ధోరణి అనిపించుకోదు.
  • ప్రపంచబ్యాంకు విధానాలకు వంత పాడి అం.ప్ర రాష్ట్రాన్ని ప్రయోగశాలగా మార్చాడు.
    • ప్రయోగాల వల్ల జరిగిన లోటుపాట్లేమిటన్నది వదిలి ప్రయోగశాలగా మార్చారంటే అదేమంత విమర్శ అనిపించుకోదు.
  • విభజన తర్వాత అం.ప్ర రాజధాని ఎంపిక విషయంలో కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కన పెట్టి పచ్చని పంట పొలాలలో రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. ఈ విషయంలో రైతులు, మేధావుల నుండి వస్తున్న అభ్యంతరాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా ముందుకు పోతున్నారు
    • పునరుద్ఘాటన
  • 2014లో మంగంపేట ముగ్గురాల్లలో స్థానికులకు ఉండే కోటాను రద్దు చేసినారు.
    • కొంత మెరుగు
  • 2014 సార్వత్రిక ఎన్నికలలో తెదేపా తరపున 52 మంది నేరచరితులకు టికెట్లు ఇచ్చి శాసనసభ్యులుగా గెలిపించినారు.
    • దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నాయకుల చరిత్రలోనూ ఇవే రాయగలిగితే తప్ప ఇది పక్షపాతం అనిపించుకుని తీరుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది, తెదేపా ఏమీ మినహాయింపు కాదు.
  • ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అనేక ప్రభుత్వ పరిశ్రమలను ప్రయివేటు పరం చేసినాడు. సొంత జిల్లా చిత్తూరులో ప్రభుత్వ సహకార డెయిరీలను మూసివేసి, కుటుంబ సభ్యులకు చెందిన హెరిటేజ్ డెయిరీలకు మేలు చేశాడనే ఆరోపణ ఎదుర్కొన్నారు.
    • దీనికి మూలాలు కూడా ఇవ్వలేదు.

కనుక నేను చెప్పవచ్చేదేమిటంటే ఇది పైన ప్రణయ్ అన్నట్టు చాలావరకూ పక్షపాత ధోరణి ప్రతిబింబిస్తోంది. ఆయన జీవితంలో జరిగిన ముఖ్యఘట్టాలను ప్రస్తావిస్తూ అక్కడే ఈ ఆరోపణల్లాంటి విషయాలను రాస్తే ఏ సమస్యా ఉండదు తప్ప వేరుగా ఆరోపణలని విభాగం పెట్టి మరీ తూర్పారబట్టడం తెవికీకి పక్షపాతాన్నే అంటకట్టేదే తప్ప మరేమీ కాదు.(వేరే వ్యాసాల్లో ఉన్నా సమర్థనీయం కాదు) అందుకని నా అభిప్రాయంలో వీటిలో కాస్త నిష్పక్షపాతంగా ఉన్నవాటిని తీసుకెళ్ళి సంబంధిత విభాగాల్లో, వికీశైలికి అనుగుణంగా రాయడం. మొత్తంగా ఈ విభాగాన్ని తీసివేయడం మంచిదనిపిస్తోంది.--పవన్ సంతోష్ (చర్చ) 05:55, 21 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పేజీ సంరక్షణకు అభ్యర్థన

[మార్చు]

ఈ పేజీని పక్షపాత పత్రికల మూలాల ద్వారా పూర్తి సానుకూలంగా పొగడడమో లేదా పూర్తి వ్యతిరేక ఆరోపణల ద్వారా నిందలు వేయడమో జరుగుతుంది. అందువలన ఈ పుటను సంరక్షణలో ఉంచడం మేలేమో. తద్వారా వ్యాసం లో చేర్చాల్సిన విషయాలను చర్చా పేజీలో ముందు చర్చించి ఆపై చేర్చే లా చర్యలు తీసుకోగలము.

పేజీ సంరక్షణ కు సుముఖం
  1. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:32, 28 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పేజీ సంరక్షణకు వ్యతిరేకం
తటస్థం