చర్చ:నార్కెట్‌పల్లి - అద్దంకి - మేదరమెట్ల రహదారి
స్వరూపం
ఇది ఎక్స్‌ప్రెస్‌వేనా!?
[మార్చు]ఇది ఎక్స్‌ప్రెస్‌వే కాదనుకుంటాను. దీన్ని నిర్మించిన కంపెనీ పేరులో (నార్కట్‌పల్లి-అద్దంకి-మేదరమెట్ల ఎక్స్‌ప్రెస్‌వేస్ లిమిటెడ్) ఎక్స్‌ప్రెస్‌వే అని ఉంది తప్ప అది ఎక్స్‌ప్రెస్‌వే కాదు. ఎక్స్‌ప్రెస్‌వే అంటే యాక్సెస్ కంట్రోలుండాలి. దీన్ని అలా అనడం తప్పుదారి పట్టించేదిగా ఉంది. __ చదువరి (చర్చ • రచనలు) 06:35, 28 మార్చి 2022 (UTC)
- @Chaduvari గారు, ఈ సందేహం, నేను OSM లో సవరణలు చేయతలపెట్టినపుడు, OSM అనుభవజ్ఞడు కూడా వెలిబుచ్చాడు. మీరు చెప్పినట్లు, దీనిని చేపట్టిన గుత్తేదారు పేరులో NAM expressway limited అని ఉండడంతో చాలావరకు ఎక్స్‌ప్రెస్‌వే పేరు వాడతున్నారు. భారతదేశంలో కొన్ని రహదారులు ఆపేరుకి అర్హమైనవి కాకున్నా వాడుతున్నారని ఆంగ్లవికీ వ్యాసంలో వుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ డవలప్మెంట్ కార్పొరేషన్ జాబితాలో నార్కట్ పల్లి - అద్దంకి - మేదరమట్ల రోడ్డు అని వుంది. ఈ పనిచేపట్టటానికి ముందు రాష్ట్ర హైవే అని వాడేవారు. అలాగే విజయవాడ-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌వే కు కూడా పేరుసరియైనదో కాదో నిర్ధారించండి. దీనికి సంబందించి ఇటీవల ఎక్స్‌ప్రెస్‌వే ప్రతిపాదన వార్త కూడా చూడండి. దీనికి మెరుగైన పేరు సూచించండి. తరలిస్తాను. అర్జున (చర్చ) 01:16, 29 మార్చి 2022 (UTC)
- @Arjunaraoc గారూ, వ్యాసాన్ని బాగా అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు. నా సూచనలివి:
- దీనికి రాష్ట్ర రహదారి హోదా గానీ, జాతీయ రహదారి హోదాగానీ లేకపోతే దీన్ని "నార్కట్‌పల్లి-అద్దంకి-మేదరమెట్ల అంతర్రాష్ట్ర రహదారి" అని గానీ "నార్కట్‌పల్లి-అద్దంకి-మేదరమెట్ల రహదారి" అని గానీ అనవచ్చు.
- అలాగే రెండో దాన్ని "హైదరాబాదు-విజయవాడ రహదారి" అనవచ్చు.
- మరొకటి.. మనం రహదారుల పేజీలకు పేర్లు పెట్టడంలో ఒక పద్ధతిని, సంప్రదాయాన్నీ పెట్టుకోవాలి. నా అభిప్రాయాలివి:
- ఏదైనా జాతీయ రహదారి/రాష్ట్ర రహదారి గురించి రాసేటపుడు సదరు నంబరునే పేరుగా వాడవచ్చు - "జాతీయ రహదారి 65" లాగా.
- అందులో ఒక భాగానికి ప్రత్యేకంగా వ్యాసం రాసినపుడు దానికి ఆ పట్టణాల పేరునే పెడితే బాగుంటుంది. ఉదాహరణకు "హైదరాబాదు-విజయవాడ రహదారి".
- ఆయా రహదారులను నిర్మించిన కంపెనీల పేరిట రహదారి పేజీని పెట్టరాదు - ఇప్పుడు "నామ్ ఎక్స్‌ప్రెస్‌వే" అని పెట్టినట్టు.
- ఒకవేళ ప్రభుత్వం దానికి ఏదైనా పేరు పెడితే ఆ పేరునే మనమూ వాడాలి. ఉదా: "పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే"
- పరిశీలించండి. __ చదువరి (చర్చ • రచనలు) 03:12, 29 మార్చి 2022 (UTC)
- @Chaduvari గారు, మీ ప్రశంసకు ధన్యవాదాలు. ఈ వ్యాసం పేరును నార్కెట్‌పల్లి - అద్దంకి - మేదరమెట్ల రహదారి గా విజయవాడ-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌వే ను హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిగా మారుస్తాను. మీ రహదారిపేర్లను ప్రామాణీకరణకు సూచనలు బాగున్నాయి. అర్జున (చర్చ) 01:30, 31 మార్చి 2022 (UTC)
- @Arjunaraoc గారూ, వ్యాసాన్ని బాగా అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు. నా సూచనలివి:
జాతీయ రహదారి పేర్లు
[మార్చు]మరొక్క విషయం @Arjunaraoc గారూ.. జాతీయ రహదారి పేజీల పేర్లలో "(భారతదేశం)" అని రాస్తున్నాం. ఎన్వికీలో అది అవసరమే.. కనీ మనకు అక్కర్లేదని నా అభిప్రాయం. వేరే దేశపు రహదారుల గురించి రాసేటపుడు ఆయా దేశాల పేర్లు ఇస్తే సరిపోతుంది. మన విధానంలో అది కూడా చేరుద్దామా? పరిశీలించండి.__ చదువరి (చర్చ • రచనలు) 03:35, 29 మార్చి 2022 (UTC)
- @Chaduvari గారు, భారతదేశంలోని కొన్ని రహదారులకు ఆసియా రహదారుల పేరుకూడా చేరుతాయి. ఉదాహరణగా NH16 కు AH45. కావున అటువంటి రహదారి పేరులో (భారతదేశం) వుంచాలి. అలాగే ప్రపంచంలో ప్రముఖమైన రహదారులు ఆంగ్లంనుండి అనువదించి చేర్చే అవకాశమున్నందున, ఆంగ్ల వికీ సంప్రదాయాలను వాడడమే మెరుగుని నా అభిప్రాయం. అర్జున (చర్చ) 01:33, 31 మార్చి 2022 (UTC)