Jump to content

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి

వికీపీడియా నుండి
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి
Toll gate on Vijayawada - Hyderabad highway.jpg
నందిగామ, ఆంధ్రప్రదేశ్ సమీపంలో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి టోల్ గేట్ దృశ్యం
మార్గ సమాచారం
నిర్వహిస్తున్న సంస్థ జి.ఎం.ఆర్ హైదరాబాద్ - విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్
ముఖ్యమైన కూడళ్ళు
నుండిఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్
వరకుగొల్లపూడి, విజయవాడ
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ
రహదారి వ్యవస్థ

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి (హైదరాబాద్ - విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే) విజయవాడ, హైదరాబాదు లను కలిపే 181 కి.మీ నాలుగు నుంచి ఆరు వరుసల జాతీయ రహదారి. ఇది మచిలీపట్నంను పూణేతో కలిపే జాతీయ రహదారి 65 లో ఒక భాగం. దీనిని రెండు వరుసలనుండి విస్తరణ పని పూర్తి చేసి అక్టోబర్ 2012 లో ప్రారంభించారు. జిఎంఆర్ గ్రూప్ అనుబంధ సంస్థ "జిఎంఆర్ విజయవాడ-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్" ద్వారా బిల్డ్-ఓన్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (BOOT) ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. [1]

చరిత్ర

[మార్చు]

2007 ప్రారంభంలో, భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ అప్పటి రెండు వరుసల విజయవాడ-హైదరాబాద్ సెక్షను నాలుగు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ 2007 లో మంజూరు చేయబడింది. రహదారి పనికి ఎంపికైన జి.ఎం.ఆర్ గ్రూప్ 11 జూన్ 2009 న జి.ఎం.ఆర్ హైదరాబాద్ విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది

ఈ ప్రాజెక్టుకు 22 మార్చి 2010 న అంచనా వ్యయం 1,470 కోట్లు. నార్కెట్‌పల్లిలో ఈ పునాది వేడుకలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, సూదిని జైపాల్ రెడ్డి, రతన్‌జిత్ ప్రతాప్ నరేన్ సింగ్ పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు 2012 అక్టోబర్‌లో పూర్తయింది.

మార్గం

[మార్చు]

ఈ మార్గంలో నాలుగు రహదారి సుంకం వసూలి కేంద్రాలు (టోల్ ప్లాజా) ఉన్నాయి.

ప్రాముఖ్యత

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత, ఈ ఎక్స్‌ప్రెస్వే , తెలంగాణ రాజధాని హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (విజయవాడ) లను కలిపే ప్రధాన రహదారిగా మారింది. ఎక్స్‌ప్రెస్‌వే వివిధ వ్యాపారాలకు ప్రధాన కేంద్రంగా మారింది.[2] పారిశ్రామిక పార్కులు, ఫార్మా రంగాలు, ఇతర కారిడార్లను తెలంగాణా ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Ahmed, Syed (2020-12-18). "త్వరలో విజయవాడ-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌వే- భూసేకరణకు కేంద్రం ప్రయత్నాలు". telugu.oneindia.com. Retrieved 2021-02-04.
  2. "Vijayawada: The connectivity hub". www.businesstoday.in. Retrieved 2021-02-04.