Jump to content

చర్చ:పండిట్ నెహ్రూ బస్ స్టేషన్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

నా మార్పును ఎందులకు రద్దు చేయుచున్నారు? Hydkarthik (చర్చ) 02:32, 12 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మీరెందుకు కొత్తగా మార్పులు చేస్తున్నారు ?JVRKPRASAD (చర్చ) 02:55, 12 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఎందులకనగా ఇది తెలుగు వికి కనుకను, బస్సు స్టేషనును తెలుగున ప్రయాణ ప్రాంగణము అందురు గనుకను మార్పు చేసితిని. Hydkarthik (చర్చ) 02:57, 12 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఇటువంటి మార్పులకు తగు ఆధారములు కూడా కావలయును కదా మిత్రమా ! JVRKPRASAD (చర్చ) 03:07, 12 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అయ్యా, మీకు తెలియనిది గాదు. బస్సు స్టేషనును తెలుగులో ప్రయాణ ప్రాంగణము అందురు. ఇది చూడుడి. కర్నూలు ప్రయాణ ప్రాంగణపు పేరు పలక. https://www.youtube.com/watch?v=W5a8NpmYTEs Hydkarthik (చర్చ) 03:11, 12 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అయ్యా, మీతో అనుభవం నాకు తెలియనిది కాదు, మరపు రానిది, మరచి పోలేనిది. తెలుగులో 'బస్సు లేక బస్ అని వ్రాయాలో దయచేసి నాకు శలవివ్వండి. అన్నీ అలాగే మార్చుతాను. తమరు ఏదైనా మార్చాలనుకుంటే చర్చా పేజీలో ముందుగా వాసిన యెడల మా బోంట్లకు కూడా మార్పు ఏమి చేయవచ్చునో అర్థం చేసుకోగలము. తమరు పలక అని నామకరణం చేసారు, నామ ఫలకం అని నేను పొరపాటుగా వ్రాయుచున్నాను. పలక అని నిర్ణయము చేయుడి, అన్నీ తగు విధముగా మార్పులు నేను చేయుదును. కాస్త ఈ విషయము చూడుడి. JVRKPRASAD (చర్చ) 03:27, 12 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మహాప్రభో ! నామ ఫలకం అనునది తెలుగు కాదు. సంస్కృతము. అచ్చ తెలుగులో పేరు పలక అందురు. Hydkarthik (చర్చ) 03:33, 12 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ఇటులనే మరికొన్ని పదములను సిద్ధము చేసితిని. నచ్చినచో వినియోగించుడి.

  • ఎక్స్ ప్రెస్-- వడి బండి;
  • సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్-- కడు వడి బండి;
  • ప్యాసింజర్-- సెల బండి;
  • ఔటర్ రింగ్ రోడ్-- వెలి చుట్టు బాట;
  • ఇన్నర్ రింగ్ రోడ్-- లోచుట్టు బాట;
  • రన్ వే-- పరుగు పాదు;

ఎటుల నున్నవి? Hydkarthik (చర్చ) 03:37, 12 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మహాప్రభో ! మీరు అధికారులకు, నిర్వాహకులకు మీ తెలుగు పదాలు సూచించుడి, తెల్పుడి. నా దగ్గరనూ అనేక తెలుగు అచ్చ పదములున్నవి. తగు సమయమున సూచించెదను. అంతవరకు నేను మిన్నకుందును. నన్ను దయచేసి వదులుడి. వ్యాసం వ్రాస్తున్న నాకు ఇబ్బంది కనుక, అంతవరకు మార్పులు చేయకుండుడి. ఆ తదుపరి తమరిష్టమే, నేను తెలుగు పండితులయిన మీతో చర్చ చేయక మిన్నకుందును. దన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 03:43, 12 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అధికారులకా? యే అధికారులకు? ఉభయాంధ్ర ప్రభుత్వములు తెలుగు తల్లిని చంప యత్నించుచున్నవి. వారికి చెప్పినను బుద్ధ విగ్రహమునకు చెప్పినను ఒక్కటే. అందువలన ఇచ్చట మీబోటి భాషాభిమాన పెద్దలకు చెప్పదలచితిని. దయచేసి అర్థము చేసుకొనుడి. కోపము తెచ్చుకొనకుడి. మిమ్ములన్ బాధించినచో క్షంతవ్యుడన్ Hydkarthik (చర్చ) 03:49, 12 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మీలాంటి పెద్దలకు ప్రణామములు. నేను తమరుకు చెప్పినది తెలుగు వికీ పెద్దల గురించి మాత్రమేనని గ్రహించ గలరు. ఇచట తమరి మీద మాకు కోప మెందులకు. తమరు నన్ను మన్నించుడి. నేను మీముందు అల్పప్రాణిని, నన్ను వదులుడి, వేడితిని.JVRKPRASAD (చర్చ) 03:56, 12 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అటుల అనవలదు. నేన్ మీకన్న చిన్నవాడను. మీ ఆశిస్సులు నాకు కావలెను. తెలుగు నశించుట జూచి నాకు కన్నీరు వచ్చుచున్నది. Hydkarthik (చర్చ) 03:58, 12 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Hydkarthik, JVRKPRASAD గార్లకు, పై చర్చలో ఈ వ్యాసానికి సంబంధించిన భాగానికి మాత్రమే నా స్పందన. విజయవాడ బస్సు స్టేషనుకు "పండిట్ నెహ్రూ బస్ స్టేషన్" అనే పేరు ఉన్నట్టు ఫొటోల్లో గమనించవచ్చు. కాబట్టి వ్యాసానికి ఆ పేరే ఉంచాలి. ఈ పేజీకి గురి చేస్తూ "పండిట్ నెహ్రూ ప్రయాణ ప్రాంగణము" అనే పేరుతో ఒక దారిమార్పు పేజీని సృష్టించవచ్చు.
ఒక సూచన: పదేపదే ఒకరు చేసిన మార్పులను మరొకరు రద్దు చేస్తూ పోరాదు. వికీపీడియా:3RR నియమం చూడండి. __చదువరి (చర్చరచనలు) 08:52, 12 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు వికీపీడియా తెలుగు భాషాభివృద్ధికి సహకరిస్తోందన్నది, ఇక్కడ పలువురు వ్యక్తిగతంగా తెలుగు భాషాభిమానులు ఉన్నారన్నదీ నిజమే అయినా సంస్థాగతంగా తెలుగు వికీపీడియా తెలుగు భాషా వాదంతో సహా ఏ వాదానికీ వేదిక కాదు. తెలుగు భాషీయులకు అర్థమయ్యే రీతిలో తేటగా, వ్యవహారశైలిలో చెప్పాలన్నదే నియమం. ఈ విషయంపై చర్చలు, విధానాలు ఇప్పటికే ఉన్నాయి. గత చర్చల్లో మీకూ చాలా స్పష్టంగా చెప్పాం. పండిట్‌ నెహ్రూ బస్‌ స్టాండ్ అనే ప్రస్తుతం ఉన్న పరిరక్షణ ద్వారం మీద కనిపిస్తోంది. తెలుగు శాతవాహన ప్రయాణ ప్రాంగణమని మార్చాలనో, మార్చారనో చెదురుమదురుగా వినవస్తోందే తప్ప వెతికినా తగ్గ మూలాలు దొరకడం లేదు. ఇదంతా పరిశీలించిన మీదట గతంలో జరిగిన చర్చలను వదిలి, ఉద్దేశపూర్వకంగా మూలాలు లేకుండా మార్పుచేర్పులు చేస్తున్నారనే అర్థంచేసుకోవాల్సివస్తోంది. మూలాలు లేకుండా, బయట మార్పులు జరుగకుండా ఇటువంటి మార్పులు చేయవద్దని, తెలుగు వికీపీడియాను ఏదైనా వాదం ముందుకుతీసుకుపోయేందుకు వాడడం సరికాదని Hydkarthik గారికి గట్టిగా సూచిస్తున్నాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 13:29, 12 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
Hydkarthik గారూ, మీరు తెలియజేసిన అచ్చ తెలుగు పదములు చాలా తక్కువగా వాడబడుతున్నవి. వాటికి సరైన ఆధారాలు లేవు. విజ్ఞాన సర్వస్వంలో అందరికీ బహుళ ప్రాచుర్యంలో ఉన్న పదాలను వాడితే మంచిది. ఆ పదాలతోనే వెతుకుతారు. మీరు తెలియజేసిన "ప్రయాణ ప్రాంగణం" గూగుల్ లో శోధిస్తే 138 ఫలితాలను చూపిస్తుంది. అదే "బస్ స్టేషన్" పదాన్ని శోధిస్తే 54,30,00,000 ఫలితాలను చూపిస్తుంది. బహుళ వాడుకలో ఉన్న పదం "బస్ స్టేషన్" కనుక అదే పేరుతో శీర్షిక ఉండటం మంచిది. మూలాలు లేని వాక్యాలను చేర్చరాదని మీకు తెలియనిది కాదు. సరైన విధంగా వ్యాసాభివృద్ధికి తోడ్పడండి.--కె.వెంకటరమణచర్చ 13:37, 12 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు తెవికి నుండి వేరుపడి "తెంగ్లిష్ వికి" అనునొక క్రొత్త వికిని మొదలుపెట్టుకొనవలెనేమో. తెలుగును నామరూపములు లేకుండగ నశింపజేయవలెనని కంకణము కట్టికొని యున్నారు.Hydkarthik (చర్చ) 21:42, 12 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Hydkarthik గారూ! తెలుగు వికీపీడియన్లు తెలుగు వికీపీడియా కోసం ఏర్పరుచుకున్న మూలస్తంభాలు, పాలసీలు, శైలీ నియమాల పరిధిలో తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని అభివృద్ధి చేయడానికి కృషిచేస్తున్నారు. వ్యక్తిగతంగా "తీవ్రమైన తెలుగు భాషా వాదం" మీలానే నెత్తికి ఎత్తుకునేవారిలో మేమూ ఉన్నాం, కానీ అదృష్టవశాత్తూ మా అందరికీ ప్రతీ వేదిక మనం నమ్మే సిద్ధాంతాలన్నిటికీ పనికిరాదని తెలుసు. ఎన్నో విధాల చెప్పిచూస్తున్నాను. మీకు సాధ్యమైతే పత్రికల భాషను, ప్రజల భాషను మార్చి తర్వాత రండి అని మరొక్కసారి చెప్తున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా వికీపీడియా ఐదు మూలస్తంభాలలో నాలుగవ దాని ప్రకారం వికీపీడియాలో తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి. అన్న విషయం గుర్తుచేస్తున్నాను. మీ వాదనను వినిపించడానికి, వ్యక్తిగత దూషణలకు, సంస్థాగత దూషణలకు దిగవద్దని, ఇది నియమాలకు విరుద్ధమనీ మీకు మొదటి హెచ్చరిక చేస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 13:24, 15 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే దూషణ ఎలా అవుతుంది? నేనుఎవరిని దూషించలేదు. గమనించండి. నాకు హెచ్చరిక జారీ చేయుటకు మీకు ఉన్న హోదా ఏమిటో తెలుపుడి Hydkarthik (చర్చ) 01:45, 16 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అనంగీకారానికి ఉన్న పలు స్తరాలు - ఆంగ్లంలో
ఎన్నో విధానాలు, మార్గదర్శకాలు, మూలసూత్రాలు ప్రస్తావించినా వాటిపై చర్చ వదిలిపెట్టి "తెలుగును నామరూపములు లేకుండగ నశింపజేయవలెనని కంకణము కట్టికొని యున్నారు." - అని చేసింది చర్చను దెబ్బతీసే దూషణ. ఎవరి చేతిని వారు ఆడించవచ్చు కానీ ఎదుటివాడి ముక్కు కొన తగిలేంత వరకూ అన్నది వాక్‌స్వాతంత్ర్యానికి సాధారణమైన పరిమితి. మీరు దాన్ని అతిక్రమించి అభిప్రాయం అంటే చెల్లదు. విషయాన్ని మేం ప్రస్తావిస్తున్న విధానానికి పరిమితం చేయండి. ఇక వికీపీడియా వాడుకరిగా మూలసూత్రాలకు అనుగుణంగా తెవికీ నడుస్తుందా అన్నది పరిశీలించుకుని, తీరుతెన్నులు తెవికీనే దెబ్బతీస్తూంటే సముదాయ సంస్కృతిని దారిలో పెట్టే హక్కు నాకుంది, అందుకుతోడు మూలసూత్రాలను ప్రతిఫలిస్తున్న విధానాలు, మార్గదర్శకాలు అమలులోకి తీసుకురావడం నిర్వాహకునిగా నాకున్న బాధ్యత. ఇలా హెచ్చరించకపోతే నా బాధ్యతలను విస్మరించినట్టు అవుతుంది, సముదాయ సంస్కృతి దెబ్బతినిపోతుంది కాబట్టి నా విధి నిర్వర్తించాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:24, 16 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అది దూషణ ఎలా అవుతుంది? ఉన్న మాటే అన్నాను. తెవికి లో తెలుగు పదాలను వాడలి కదా. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ వాడుతారు తెలుగు పదాలని? ఇంగ్లిష్ వికి లోనా? ఉద్. కు తెలుగు లో పేజీ ని పుట అని అంటారు. ఉన్న పదాన్ని వదిలేసి, పేజీ అని ఎందుకు రాయాలి?Hydkarthik (చర్చ) 11:42, 16 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]