చర్చ:పెద్దలకు మాత్రమే
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి. |
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : తొలగించాలి. K.Venkataramana(talk) 09:15, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
1. తొలగింపు చర్చ జరిగినంత కాలమూ ఏమీ మాట్లాడలేదు. తొలగించాలని నిర్ణయించి, తొలగించాక, తిరిగి సృష్టించారు. 2. ఇప్పుడు కూడా ఒక్క మూలమూ లేదు. అంతా స్వకపోల కల్పితమే. 3. ఇంగ్లీషు వికీలో ఒక అయోమయ నివృత్తి పేజీకి లింకు ఇచ్చారు. ఏ పేజీకి ఇవ్వాలో, అసలు ఇందులో ఏం రాయదలచారో స్పష్టత ఉన్నట్టు లేదు. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 07:12, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వారం రోజుల (మే 20) వరకు ఈ వ్యాసాన్ని విస్తరించకుంటే తొలగించాలి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 07:29, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- మరొక సంగతి.. వాడుకరి:YVSREDDY గారు ఈ వ్యాసాన్ని సృష్టించడం/పునస్థాపింపజెయ్యడం మూడుసార్లు చేసారు. గతంలో ఒకసారి తొలగిస్తే, అడిగి మరీ పునస్థాపించుకున్నారు. ఇది మూడో తొలగింపు/తొలగింపు ప్రతిపాదన. __చదువరి (చర్చ • రచనలు) 10:47, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- విస్తరించి మూలాలు చేర్చకపోతే తొలగించవచ్చు. కె.వెంకటరమణ (చర్చ) 17:57, 17 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఫలితం
ఈ వ్యాసం తొలగించడానికి గల కారణాలను పైన తెలియజేసారు. ఈ వ్యాసం ఆంగ్లంలోని అయోమయ నివృత్తి పేజీకు లింకు అయి ఉంది. ఈ వ్యాసానికి మూలాలు లేవు. స్వంతగా రాసిన విషయం. ఈ వ్యాసం ఎందుకు తొలగించకూడదో వ్యాస సృష్టికర్త YVSREDDY తెలియజేయకుండా ఆ వ్యాసాన్ని ఈ పుటలోనికి చేర్చారు. ఎందుకు చేర్చారో అర్థం కాని విషయం. పైన చేసిన చర్చ ఆధారంగా ఈ వ్యాసాన్ని తోలగించాలి. K.Venkataramana(talk) 09:11, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
==పెద్దలకు మాత్రమే వ్యాసం నుంచి==
ఒక విషయం గురించి చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు లేదా చూస్తున్నప్పుడు ఏది తప్పో, ఏది ఒప్పో తెలుసుకోలేని వయసులో ఉన్నవారు వాటిని అనుసరించి చెడు మార్గం వైపు వెళ్తారని భావించిన వాటిని ఇవి పెద్దలకు మాత్రమే అని ఒక సూచనను ఇవ్వడం జరుగుతుంది. 18 సంవత్సరముల వయసు పైబడినవారు, కొన్ని దేశాలలో 21 సంవత్సరాలు దాటినవారు పెద్దవారు కింద లెక్క.
==సినిమాలు==
పిల్లలు చూడకూడదని నిర్ణయించిన శృంగార భరిత మరియు హర్రర్ చిత్రాలకు A అనే అక్షరాన్ని ఆ చిత్రానికి సంబంధించిన వాల్ పోస్టర్లపై ముద్రిస్తారు. కొన్ని సినిమాలలో అశ్లీలత లేదా బూతు మోతాదు ఎక్కువగా ఉంటుంది, ఇటువంటి చిత్రాలకు పెద్దలకు మాత్రమే అని హెచ్చరిక ఉంటుంది, ఇటువంటి చిత్రాలకు యుక్తవయసు (18 లేదా 21 సంవత్సరముల వయసు) రాని వారిని అనుమతించరు.
==నీలి చిత్రాలు==
ఇంటర్నెట్ లోని కొన్ని వెబ్సైట్లు నీలి చిత్రాలకు సంబంధించినవి ఉంటాయి. ఈ సైట్లలో అశ్లీలత లేదా బూతు మోతాదు అధికంగా ఉంటుంది, ఇటువంటి సైట్లను ఒపెన్ చేసినప్పుడు ఆ సైట్లలో హెచ్చరికగా "పెద్దలకు మాత్రమే" అని అర్థం వచ్చేలా "A" అక్షరాన్ని పెద్దగా ప్రదర్శిస్తారు. ఇక్కడ "A" అంటే Adults అని అర్థం. AO అంటే Adults Only అని అర్థం.
నీలి చిత్రాలకు సంబంధించిన సైట్ ఒపెన్ చేసినప్పుడు ఒక్కొసారి ఇటువంటి సందేశం ఉంటుంది:
- దయచేసి మీకు ఒక సలహా ఇది ఒక అసభ్యకరమైన లైంగిక విషయం, మీరు 18 లేదా 21 ఏళ్లలోపు మైనర్లయితే ఇది మీరు చూడకూడదు. మీకు చట్టబద్దమైన వయస్సు లేకపోతే దయచేసి ఈ వీడియోను వెంటనే మూసివేయండి.
==మద్యం==
మద్యం ఉత్పత్తులైన సారాయి, బీరు, బ్రాంది, విస్కీ, వోడ్కా, రమ్ము, జిన్ను వంటి ఆరోగ్యానికి హాని కలిగించే వాటిని పెద్దలకు మాత్రమే విక్రయిస్తారు.
==పొగాకు ఉత్పతులు==
పొగాకు ఉత్పతులైన బీడి, సిగరెట్ వంటి ఆరోగ్యానికి హాని కలిగించే వాటిని పెద్దలకు మాత్రమే విక్రయిస్తారు.
==గుట్కాలు==
గుట్కాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి, వీటిపై ఇవి తింటే ఆరోగ్యం పాడవుతుంది అని వ్రాసి ఉంటది, ఇటువంటి వాటిని సాధారణంగా నిషేధిస్తారు లేదా పెద్దలకు మాత్రమే విక్రయిస్తారు.
- ఈ వ్యాసానికి ఆంగ్ల వ్యాసమైన en:Age of majority సరియైనది కావచ్చు. ఆంగ్ల వ్యాసాలతో సంబంధం లేకపోయినా తొలగించనవసరం లేదు.
- ఉదాహరణకు
- 23:49, 31 జనవరి 2015 YVSREDDY చర్చ రచనలు 354 బైట్లు +354 కొత్త పేజీ: సెవెన్ సీస్ ఎక్స్ప్లోరర్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన..
- 15:23, 7 April 2015 Bahnfrend talk contribs 2,529 bytes +2,529 new article thank
- సెవెన్ సీస్ ఎక్స్ప్లోరర్ అనే వ్యాసాన్ని ఆంగ్ల వ్యాసం కంటే కొన్ని నెలల ముందే నేను వ్రాసాను.YVSREDDY (చర్చ) 05:47, 17 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.