చర్చ:ఫైలిన్ తుఫాను
Jump to navigation
Jump to search
సమకాలీన సంఘటనల వ్యాసం
[మార్చు]సమకాలీన సంఘటనలను వ్యాసరూపంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేసిన రాజశేఖర్ గారికి అభినందనలు. మీ ఈ ప్రయత్నం మిగిలిన వికీపీడియన్లకు మారదర్శకం కాగలదు. ఇటువంటి ప్రయత్నాలు కొనగస్తారని ఆశిస్తున్నాను.--t.sujatha (చర్చ) 05:03, 12 అక్టోబర్ 2013 (UTC)
- సమకాలీన/వర్తమాన అదియు ఇంకను పూర్తిగా చోటుచేసుకోని సంఘటనలను తెవికీలో వ్రాయడం వలన వికీపట్ల సరియైన అవగాహనలేని క్రొత్త ,పాత, ఔత్సహిక రచయితవలన దుర్వినియోగ పరచబడె ప్రమాదమున్నదని నా అభిప్రాయం.దీనిని అలసుగా చేసుకొని పత్రికలో వచ్చె ప్రతి అనవర సంఘటనలను(సభ్యుని వుద్దేశ్యం అది అవసరమైనవి) అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్టు చేసె ప్రమాదముందని నాభావన.పాలగిరి (చర్చ) 06:25, 12 అక్టోబర్ 2013 (UTC)
- మీ అభిప్రాయాలను దృష్టిలో వుంచుకొని ఇలాంటి వ్యాసాలు తయారు చేస్తాను. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 06:44, 12 అక్టోబర్ 2013 (UTC)
- వర్తమాన సంఘటనలగురించి వ్యాసాలు రాయవచ్చు. అయితే అవి వారపత్రికలలోని వివరాలకు నకలుగా వుండకూడదు. --అర్జున (చర్చ) 09:01, 12 అక్టోబర్ 2013 (UTC)
- సుజాత గారూ సమైక్యాంధ్ర ఉద్యమము పేరుతో నేను కూడా సమకాలీన సంఘటనలై వ్యాసం వ్రాశాను. అలాగే ఉన్న వ్యాసాలపై వార్తలలోని అప్ డేట్స్ కూడా చేరుస్తున్నాను. ఒక్కరు కూడా స్పందించలేదు. అర్జున రావు గారు దానికి కొన్ని మెరుగులు దిద్దారు. కొత్త సభ్యులకి ప్రోత్సాహం ఎంతో అవసరము. అది వారికి ఆక్సిజన్ లాంటిది. శ్రీ పాలగిరి గారి సలహా అక్షర సత్యము. దీనిపై తగిన విధి విధానాలు రూపొందిస్తే బాగుంటుంది. పెద్దలు ఆలోచించగలరు.--పోటుగాడు (చర్చ) 10:01, 12 అక్టోబర్ 2013 (UTC)
- వర్తమాన సంఘటనలగురించి వ్యాసాలు రాయవచ్చు. అయితే అవి వారపత్రికలలోని వివరాలకు నకలుగా వుండకూడదు. --అర్జున (చర్చ) 09:01, 12 అక్టోబర్ 2013 (UTC)
- మీ అభిప్రాయాలను దృష్టిలో వుంచుకొని ఇలాంటి వ్యాసాలు తయారు చేస్తాను. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 06:44, 12 అక్టోబర్ 2013 (UTC)
- వర్తమాన సంఘటనపై నావాఖ్యను అర్జును గారు తప్పుగా అర్థం చేసుకున్నట్లున్నారు.అసలు వర్తమానసంఘటనలగురించి వ్రాయకూడదనికాదు ,ఒకసంఘటన జరుగముందే అని,ఉదా:బంద్ జరుగకముందే పత్రికలో వచ్చిన వార్తల ఆధారంగా కాకుండ ,జరిగిన తరువాత విశ్లేషణతో వ్రాయవచ్చు.అలాగే ఒక క్రికెట్ ఆటకావొచ్చు,తుపాను కావొచ్చు,వుద్యమం కావొచ్చు. సమైక్యాంధ్ర ఉద్యమముకూడా ఇప్పటివరకు జరిగినవాటి ఆధారంగా వ్రాసారు బావుంది. పాలగిరి (చర్చ) 10:28, 12 అక్టోబర్ 2013 (UTC)
- ఇప్పటికె ఈ వ్యాసం ఆరు భాషలలో తయారయింది. ఈ వ్యాసం సమకాలీన అంశమైనప్పటికీ ఈ తుఫాను ప్రారంభం అయింది. దీనికి ఉపగ్రహ ఛాయా చిత్రాలు మరియు మూలాలు ప్రస్తుతం లభ్యమగుచున్నవి. ఈ వ్యాసాన్ని ఆ తుఫాను గూర్చి దాని తీవ్రత గూర్చి మరియు ఛాయా చిత్రాలు చేర్చితే సరిపోతుంది. ఆ తుఫాను కోస్తా తీరానికి తాకిన తర్వాత మిగిలిన విషయాలు చేర్చితే బాగుంటుంది. ఈ వ్యాసానికి ఆంగ్ల వ్యాసంలోని మూసను తెలుగులోని తరలించి చేర్చాను. సమాకాలీన విషయాలు జరిగిన తర్వాత చేర్చితే బాగుంటుంది. యిలా జరగవచ్చు అనే సంభావ్యత గల విషయాలు చేర్చకుండా జరిగిన తర్వాత దాని తీవ్రత యితర విషయాలు చేర్చితే బాగుంటుందని నా అభిప్రాయం.----K.V.Ramana Talk 10:47, 12 అక్టోబర్ 2013 (UTC)
- పాలగిరి, పోటుగాడు ,వాడుకరి:Kvr.lohith ,t.sujatha ,Rajasekhar1961 గార్ల ప్రతిస్పందనలకుధన్యవాదాలు. ఆంగ్ల వికీపీడియాలో వర్తమాన సంఘటనలపై వ్యాసాలు ప్రజాదరణ పొందుతున్నాయి. ఏ ఒక్కరు అన్ని వార్తామాధ్యమాలద్వారా విషయం గ్రహించలేని పరిస్థితిలో, వికీపీడియా వ్యాసం అన్ని దృక్కోణాలు చేర్చటంద్వారా అందరికి ఉపయోగపడుతుంది. అయితే మన తెలుగులో రాసేటప్పుడు నిరంతరం అందుబాటులో వుండే మూలాల కొరత వుంది. మూలాలు చేర్చకుండా రాయటం వ్యాసానికి విలువనీయదు. తప్పనిసరిగా మూలాలను పేర్కొనండి. ఒన్ఇండియా.ఇన్ (http://telugu.oneindia.in/) , హిందూ లాంటి ఆంగ్ల పత్రికలు ప్రభుత్వ వెబ్సైటులను మూలాలుగా పేర్కొనండి. అనువాదం చేసేటప్పుడు ఆంగ్లవికీలోని మూలాలను చూసి చేస్తే మంచిది. అలాగే ఆ మూలలను తెలుగు వ్యాసంలో చేర్చండి. వర్తమాన సంఘటనలను అభివృద్ధిచేయటంద్వారా తెవికీలో సహకారాన్ని మరింత పెంపొందించగలమని నా అభిప్రాయం. --అర్జున (చర్చ) 04:32, 13 అక్టోబర్ 2013 (UTC)
- ఇప్పటికె ఈ వ్యాసం ఆరు భాషలలో తయారయింది. ఈ వ్యాసం సమకాలీన అంశమైనప్పటికీ ఈ తుఫాను ప్రారంభం అయింది. దీనికి ఉపగ్రహ ఛాయా చిత్రాలు మరియు మూలాలు ప్రస్తుతం లభ్యమగుచున్నవి. ఈ వ్యాసాన్ని ఆ తుఫాను గూర్చి దాని తీవ్రత గూర్చి మరియు ఛాయా చిత్రాలు చేర్చితే సరిపోతుంది. ఆ తుఫాను కోస్తా తీరానికి తాకిన తర్వాత మిగిలిన విషయాలు చేర్చితే బాగుంటుంది. ఈ వ్యాసానికి ఆంగ్ల వ్యాసంలోని మూసను తెలుగులోని తరలించి చేర్చాను. సమాకాలీన విషయాలు జరిగిన తర్వాత చేర్చితే బాగుంటుంది. యిలా జరగవచ్చు అనే సంభావ్యత గల విషయాలు చేర్చకుండా జరిగిన తర్వాత దాని తీవ్రత యితర విషయాలు చేర్చితే బాగుంటుందని నా అభిప్రాయం.----K.V.Ramana Talk 10:47, 12 అక్టోబర్ 2013 (UTC)
- సమకాలీన వ్యాసాలను ప్రోత్సహించవచ్చన్నది నా అభిప్రాయం. పాలగిరి గారన్నట్లు వాటిలో లోటుపాట్లుంటే చర్చించి సరిచేయవచ్చు. నేటి సంఘటన రేపటి చరిత్ర కనుక సమకాలీన సంఘటనలు వికీపీడియాలో చేర్చడం మంచి ప్రయత్నం. తాజాగా వ్రాయబడతాయి కనుక సమగ్రమైన సమాచారం లభిస్తుంది. వీటికి అవసరమైన నియమ నిబంధనలను చర్చలద్వారా నిర్ణయించి వ్యాసాల నాణ్యత మెరుగుపరచవచ్చు. --t.sujatha (చర్చ) 06:22, 13 అక్టోబర్ 2013 (UTC)
- ఫైలిన్ తుఫాను వంటి ప్రాముఖ్యతవున్న వర్తమాన సంఘటన వ్యాసం వెంటనే పాఠకుల దృష్టిని ఆకర్షింటకై మీకు తెలుసా? కొత్తవ్యాసంలో చేర్చడం కాని,లేదా ముఖపుటలో ప్రకటనబాక్సును కొన్నిరోజులు వుంచినబాగుంటుందేమో?పాలగిరి (చర్చ) 06:29, 13 అక్టోబర్ 2013 (UTC)
- తెవికీలో దీనికొరకు ప్రత్యేకమైన పేజీ వర్తమాన ఘటనలు ప్రక్క పట్టీలో వుండేది. దానిని ఎవరూ నిర్వహించకపోవడంతో తొలగించబడింది. దానిని మరలచేర్చేవరకు మీకు తెలుసాలో మొదటి, లేక రెండో వరుసలో ఈ వ్యాసాలను పేర్కొనటం బాగానే వుంటుంది. దానిని నిర్వహిస్తున్నవాడుకరి:Kvr.lohith గారు మీసలహాని అమలుచేస్తారనుకుంటాను. --అర్జున (చర్చ) 06:43, 13 అక్టోబర్ 2013 (UTC)
- పాలగిరి, అర్జున ల సూచన మేరకు "మీకు తెలుసా" లో వర్తమాన విషయాలను ఉంచితేనే బాగుంటుంది. అటువంటి విషయాలు చేర్చే ప్రయత్నం చేద్దాము. సూచనకు ధన్యవాదాలు.----K.Venkataramana (talk) 07:21, 13 అక్టోబర్ 2013 (UTC)
- మరల ఆలోచించితే 'మీకు తెలుసా' పాత విషయాలకు అనువైనదనిపించింది. వర్తమాన ఘటనలు నిర్వహించితే ప్రక్కపట్టీలో లింకు చేర్చవచ్చు. వాడుకరి:Kvr.lohith గమనించవలసినదిగా కోరుచున్నాను. --అర్జున (చర్చ) 06:50, 14 అక్టోబర్ 2013 (UTC)