Jump to content

చర్చ:బిందుసారుడు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ప్రాజెక్టు టైగర్‌ వ్యాసాలు

[మార్చు]
ఈ వ్యాసాన్ని నేను ప్రారంభించ లేదు, కొత్తగా సమాచారం చేర్చాలనే ఉద్దేశ్యంతో నేను భాషాదోషాలను చూడలేదు. ఇప్పుడు చూసి తప్పకుండా సరి చేస్తాను మరియు తిరిగి సమర్పిస్తాను. మీకు ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 06:32, 31 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం ముందుగా నేను ప్రారంభించ లేదు. నావరకు నేను కొత్తగా సమాచారం చేర్చాను. వ్యాసంలో భాషా దోషాలు ఉన్నాయని ప్రాజెక్టు టైగర్‌కు వ్యాసాన్ని స్వీకరించలేదు, కనుక ఇప్పుడు దోషాలు సరి చేసాను. తిరిగి దీనిని ఎలా, ఎవరికి తెలియ జేయాలి అనేది నాకు తెలియదు. ఇంకా దోషాలు ఉన్నాయో లేదో తెలియజేయగలరు.JVRKPRASAD (చర్చ) 07:17, 31 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
జేవీఆర్కే ప్రసాద్ గారూ! 3 వాక్యాల మేరకు ఉన్న పేజీని ఇంత పెద్దగా విస్తరించినందుకు ముందుగా అభినందనలు. చదువరి గారి నిర్ణయం తర్వాత వ్యాసాన్ని పరిశీలించాను. ఈ కింది సమస్యలు నాకు తట్టాయి. ప్రధానంగా ఈ సమస్యలను 2018 మార్చి నాటికి ఉన్న మూడు వాక్యాలలోంచి చెప్పట్లేదు. ఆ సమస్యల్లో కొన్ని ఇలా ఉన్నాయి:
  • బీసీఈ అన్నదాన్ని తెలుగు వికీపీడియా శైలి ప్రకారం సా.శ.పూ. అని వాడదామని నిర్ణయించుకున్నాం. సామాన్య శక పూర్వం అన్న పదానికి ఇది సంక్షిప్త రూపం.
  • పత్రికా పరిభాషలోంచి, ఇతర ప్రామాణిక రచనల్లోంచి తొలగిపోయిన యొక్క వంటి పదాల వాడుక కూడా తగ్గించవచ్చు. "ఈ వాదన యొక్క ప్రామాణికత" అన్నది "ఈ వాదనకున్న ప్రామాణికత" అనీ, "బిందుసారుడు యొక్క భార్యలు" అన్నది "బిందుసారుడి భార్యలు" అనీ రాస్తే సరళంగా ఉంటుంది. సరళత సాధించేందుకు మార్చాల్సిన పదాలు ఇంకా ఉన్నాయి, ఉదా: నందు.
  • వ్యాకరణ సమస్యల వల్ల "బిందుసారుడునకు సుశిమా, అశోక మరియు విగాతశోక అను ముగ్గురు కుమారులు అని అశోకవదన యొక్క వచన రూపం నందు తెలియ వచ్చింది." వంటి వాక్యాలు పూర్తిగా అర్థం కాంకుండా ఉన్నాయి. బిందుసారుడునకు అన్న ప్రయోగం వ్యాకరణయుక్తం కానీ, వ్యవహారయుక్తం అని కానీ తోచదు, బిందుసారుడికి అని రాయాల్సివుంటుంది.

ఈ మూడు కేవలం ఒక అవగాహన కోసం ఇచ్చాను. కానీ ఇటువంటి సమస్యలు చాలానే ఉన్నాయి. గ్రాంథిక శైలి, యాంత్రిక శైలిలోంచి వ్యవహారిక శైలి (పత్రికలు కొలబద్దగా పెట్టుకోండి సరళంగా రావడానికి, సరిపోతుంది)లోకి మార్చడం చాలు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 11:28, 31 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారూ! మీరు వ్రాసినది చదివాను.
  • మీరు గమనిస్తున్న దోషాలు ఒక వ్యాసరూపంలో పెట్టండి. మీరు అనుకున్నవి ఇతరులకు తెలియదు. బీసీ, బీసీఈ అనే పదాలు తెలుగు వికీలో అనేక చోట్ల ఉన్నాయి. వాటిని వెంటనే మార్చవలసి ఉన్నది. పట్టికల్లో కూడా అంతే.
  • తొలగించుకున్న పదాలు వాడుక తగ్గించుకుంటాము అంటే మాబోటి వారికి కష్టమే. ఉదా:నేను బిందుసారుడు యొక్క భార్యలు అని వ్రాసాను. అతను (మరణించాడు నా పరంగా) మీ భాష పరంగా చచ్చిపోయాడు. మీ కొత్త భాష పరంగా బిందుసారుడు భార్యలు లేదా బిందుసారుడికి భార్యలు లేదా బిందుసారుని భార్యలు అనగా బ్రతికి ఉన్న వాని యొక్క భార్యలు అనే భావం వస్తున్నది నాకు. అందుకనే అలా వ్రాసాను. మీ శైలికి అనుగుణంగా మర్చుతాను.
  • "బిందుసారుడునకు సుశిమా, అశోక మరియు విగాతశోక అను ముగ్గురు కుమారులు అని అశోకవదన యొక్క వచన రూపం నందు తెలియ వచ్చింది." అనే వాక్యం మాబోంట్లకు అర్థం అవగతం అవుతుంది. మీరు వాడుక భాష వ్రాయమంటున్నారు. ఇప్పటికే తెలుగుకు రెండు రాష్టాలు ఈ యాస, భాష గురించి ఏర్పడ్డాయి. ఇంక ఎన్ని అవుతాయో మరి ? రెండు రాష్టాలకు చెందిన తెలుగుభాష వ్యాసాలు పెద్దగా అభివృద్ధి చెందటం లేదు. ఒక ప్రాతం యాస, భాషతో వ్యాసాలు తయారవుతున్నాయి, మరో రాష్ట్రంలో దీని ప్రధాన వికీ పని చేస్తోంది. నేను ఉన్న విజయవాడలో ఉంటే ఇక్కడ వారికి ఈ భాష తేలికగా అర్థం అవుతుంది. ఈ బాషనే తెలుగు వికీకి ప్రామాణికం చేసేవారు. ఇక్కడ తెలుగు వికీ ప్రధాన ఆఫీసు, సభ్యులు ఉండవలసిన అవసరం అత్యవసరం. ఏ రాష్ట్ర యాస, భాషతో ఆ తెలుగు వికీ ఉంటే ఈ సమస్య రాదు. మేము ఏది వ్రాసిననూ మీకు అనేక తప్పులు ఉన్నట్లుగా గోచరిస్తూ ఉంటుంది. నేను వ్యక్తులు కోసం వ్రాసాలు వ్రాయను, కేవలం తెలుగు మీద అభిమానంతోనే వ్రాస్తాను. మీరు నా వ్యాసాలు అనుమతించక పోయినా ఫర్వాలేదు. నేను వ్రాసిన నా వ్యాసాలలోని తప్పులను నాకుగా నేను మీకు తగ్గట్లు ఎన్నని, ఏవిధంగా సరిచేయగలను. మళ్ళీ మళ్ళీ మీకు తప్పులు కనిపిస్తునే ఉంటాయి. ఇది కొత్తకాదు ఇక్కడ, నేను అన్ని ప్రాంతాలలో నివసించి నేర్చుకున్న లోపభూయిష్టమైన పాతకాలపు తెలుగు భాష ఏమో అని మీరు అనుకున్ననూ నేను దానిని మనసులో పెట్టుకుని బాధ పడవలసిన అగత్యం, అవసరం కూడా ఉండదని మీకు తెలియ జేసుకుంటున్నాను.
  • సాధ్యమయినంతవరకు మీ వికీ ధోరణిలోని వ్రాత భాషకు వ్యాసాలలో మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తాను.12:07, 31 మార్చి 2018 (UTC)
దోషాలు సరి చేసాను. గమనించగలరు. JVRKPRASAD (చర్చ) 12:24, 31 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
భాషాదోషాలు ఇంకా కనిపిస్తున్నాయి. మచ్చుకు కొన్ని ఇవి:
  1. ఇది సంస్కృత 'అమిత్రఘాత' ని గ్రీకులో కి మార్చారు.
  2. చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు వంటి ఈ ఇద్దరు చక్రవర్తుల జీవితాలను గురించి చరిత్రలో నమోదు కాబడినట్లుగా బిందుసారుడు జీవితము మరియు జీవిత చరిత్ర అనేది నమోదు కాబడలేదు.
  3. ఒకసారి, చక్రవర్తి తన తలవెంట్రుకలను పెంచే నైపుణ్యాలను చూసి సంతోషించినప్పుడు, ఆమె తను రాణిని కావాలని ఉందని మనసులో ఉన్న తన కోరికను వ్యక్తం చేసింది.
  4. ప్రపంచ చరిత్రలోని గొప్ప చక్రవర్తుల్లో ఒకడు అయిన అశోకుడు బిందుసారుని వారసుడుగా, మౌర్య సామ్రాజ్యానికి బిందుసారుని మరణం అనంతరం క్రీ.పూ. 269లో ప్రభువైనాడు
  5. "బౌద్ధ గ్రంథాలు ద్వారా"
  6. "చారిత్రక ఆధారాలు ప్రకారం"
__చదువరి (చర్చరచనలు) 16:33, 31 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
__చదువరి గారు, తప్పుడు సమాచారం ఉన్న వ్యాసాలను అసలు పోటీలో ఎందుకు పెట్టారు ? పోనీ పెట్టారు, అక్షర దోషాలు, తప్పుడు సమాచారం ఉన్న వ్యాసాలు ఎవరు దిద్దాలి ? కొత్తగా అదనపు సమాచారం చేర్చే వారికి సంబంధం ఏముంటుంది ? కనీసం తప్పుడు సమాచారం ఉందని కనీసం ఒక మూస అయినా ఆ వ్యాసంలో ఉందా ? తప్పుడు సమాచారం ఉన్న వ్యాసాలను ఎవరూ అదనపు సమాచారం చేర్చి, కోరి తలనెప్పి తెచ్చుకుంటారు ? అసలు దోషాలేమిటో ఎలా తెలుస్తాయి ? కనీసం వ్యాసాలలో ఎటువంటి దోషాలు ఉన్నాయో ముందుగా గమనించి వాడుకరులకు చెప్పారా ? ఒక తప్పుడు సమాచారం వ్యాసాన్ని ఎంచుకుని దానికి అదనపు సమాచారం ఒక వాడుకరి జోడిస్తే వ్యాసంలో దోషాలున్నాయని పదేపదే వెనక్కి ముందుకి తిప్పుతూ ఉంటే అతనికి ఒక వ్యాసంతోనే ఉన్న పుణ్యకాలం గడిచి పోదా ? అంతకంటే ఇతరులతో ఆ దోషాలేమిటో సరిచేయించ కూడదా ? మీ మచ్చులుకి నా సమాధానం:
భాషాదోషాలు ఇంకా కనిపిస్తున్నాయి. : వీలయితే ఆ దోషాలేమిటో వేరొకరితో సరి చేయించండి. మీ అంత తెవికీ జ్ఞానం నాకు లేదు.
  1. ఇది సంస్కృత 'అమిత్రఘాత' ని గ్రీకులో కి మార్చారు. : నేను వ్రాసినది కాదు, ఈ వాక్యం తొలగిస్తాను.
  2. చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు వంటి ఈ ఇద్దరు చక్రవర్తుల జీవితాలను గురించి చరిత్రలో నమోదు కాబడినట్లుగా బిందుసారుడు జీవితము మరియు జీవిత చరిత్ర అనేది నమోదు కాబడలేదు. : వాక్యాన్ని ఇంకా ముక్కలు చేసి సరి చేస్తాను.
  3. ఒకసారి, చక్రవర్తి తన తలవెంట్రుకలను పెంచే నైపుణ్యాలను చూసి సంతోషించినప్పుడు, ఆమె తను రాణిని కావాలని ఉందని మనసులో ఉన్న తన కోరికను వ్యక్తం చేసింది.  : వాక్యాన్ని ఇంకా ముక్కలు చేసి సరి చేస్తాను.
  4. ప్రపంచ చరిత్రలోని గొప్ప చక్రవర్తుల్లో ఒకడు అయిన అశోకుడు బిందుసారుని వారసుడుగా, మౌర్య సామ్రాజ్యానికి బిందుసారుని మరణం అనంతరం క్రీ.పూ. 269లో ప్రభువైనాడు : వాక్యాన్ని ఇంకా ముక్కలు చేసి సరి చేస్తాను.
  5. "బౌద్ధ గ్రంథాలు ద్వారా" : తొలగిస్తాను.
  6. "చారిత్రక ఆధారాలు ప్రకారం" తొలగిస్తాను.
తెవికీ గురించి తప్పులు ఎంచి నాలాంటి వాళ్ళు మాట్లాడితే నామీద లేనిపోనివి సృషిస్తారు, కోపం, ఆవేశం అంటారు. ఎవరి తప్పులు వారికి తెలియవు. కేవలం ఒక గ్రూపుగా భజనబృందంలా ఉంటే ఎటువంటి సంస్థ అయినా ఎదగదు. నేను సామాజిక మాధ్యమంలో రోజూ కనీసం అనేక వేల మందితో అనుసంధానంగా ఉంటాను మరియు ఎటువంటి ఇబ్బందులు లేవు. తెవికీలో మాత్రం వ్రాసేవారు మాత్రం రావడం లేదు మరియు తెవికీ ఎంత ఎదుగుతోందో మాత్రం యాజమాన్యానికే తెలియాలి. ఇక్కడ మాత్రం వాడుకరులకు చాలా సమస్యలు ఉన్నాయి. రెండు రాష్ట్రాలలో తెవికీ అధికారిక వాడుకరులు ఉండాలి. కేవలం ఒక గ్రూపుగా, ఒకప్రాంతంలోనే తెవికీ పరిమితం అయ్యింది. తెవికీ గురించి వ్రాయడం ఇక్కడ అప్రస్తుతం అయినా యాజమాన్య లోపాల వల్ల వాడుకరులు ఇబ్బందులు పడటం వలన వ్రాయవలసి వచ్చింది. మీ సూచనలకు ధన్యవాదములు. (గమనిక:యాజమాన్యము అంటే అధికారులు, నిర్వాహకులు, వాడుకరులు అని అర్థం. ఇది వ్రాయకపోతే, నామీద దాడికి రంధ్రాన్వేషణతో ఒక పెద్ద చర్చను లేవదీసే పనిచేయని భజన బృందం వాదనలకు,గొడవలకు తయారవుతుంది.) JVRKPRASAD (చర్చ) 00:22, 1 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాకరణదోషాలు సరిచేసాను.JVRKPRASAD (చర్చ) 00:36, 1 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:JVRKPRASAD గారూ, ఇది ఒక పోటీ. దీనికి సమర్పించే వ్యాసాలు కనీసం భాషాదోషాల్లేకుండా ఉండాలి. ఈ వ్యాసాన్ని స్వీకరించనందుకు నేను సూచించిన కారణం భాషాదోషాలే -వ్యాకరణ దోషాలు, అక్షరదోషాలు వగైరాలు. చూపించిన నాలుగైదు దోషాలు మచ్చులు మాత్రమే. ఇవేకాక ఇంకా ఉన్నాయి. మీరు వీటిని సహృదయంతో స్వీకరించి వ్యాసాన్ని సరిదిద్దితే అది మరింత మెరుగ్గా ఉండేది. కానీ మీరు వ్యక్తిగతంగా తీసుకుని, "మీ అంత తెవికీ జ్ఞానం నాకు లేదు" అని నిరసించారు. కేవలం వ్యాసంలోని దోషాల గురించిన ఓ మామూలు చర్చను, తెవికీ "యాజమాన్యం" లోని లోపాలు, గ్రూపులు వగైరాల వద్దకు లాక్కెళ్ళారు. చర్చను పక్కదారి పట్టించారు. విస్తుగొలిపే చాతుర్యమది! పోతే.. నేనిక్కడో మామూలు వాడుకరిని. రాయడమే నా ఆసక్తి. తెవికీకి ఉపయోగపడే సాముదాయిక కృషిలో పాల్గొంటాను. కుట్ర సిద్ధాంతాలపై జరిగే చర్చలలో పాల్గొనను. ఉంటాను. __చదువరి (చర్చరచనలు) 01:48, 1 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, ఇది ఒక పోటీ కాని ఒలింపిక్స్ కాదు, మీరు సుప్రీంకోర్టు జడ్జీలు కారు. ఈ పోటీ కేవలం వాడుకరులను ప్రోత్సహపరిచేందుకే కదా ! ఈ పొటీకి సమర్పించే వ్యాసాలు కనీసం భాషాదోషాల్లేకుండా ఉండాలి అని మీరు అంటారు, కానీ మీ మనసుకు నచ్చినట్లు నేను ఎలా వ్రాయగలను. ఈ వ్యాసాన్ని ఇతరులు చదివి అందులోని వ్యాకరణ దోషాలు ఉన్నయోమో చూడమని మీవాళ్ళకి చెప్పండి, తప్పులు తెలుస్తాయి, వాళ్ళు వ్యాసచర్చా పేజీలో వ్రాయవచ్చు. నాకు తప్పులు లేవు అని అనుకుంటున్నాను. నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, ఇక్కడ ఉన్న ఒక గ్రూపుకు ఉన్న తెవికీ జ్ఞానం నాకు లేదు. ఇది వ్యక్తిగతంగా అనడం కాదు. ఇక్కడ కుట్రలు, కుతంత్రాలు, చిత్రవిచిత్రాలు ఎన్నెన్నో ఉన్నాయి.చర్చను పక్కదారి నేను పట్టించలేదు. ఇక్కడ అణగదొక్కే స్థితి పరిస్థితులు ఎప్పటికీ మారవు. ఏమైనా మీకు సంబంధం లేనివి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ లోని వర్గాలలో కొత్తగా జాబితాలో లేనివి నాకుగా నేను వ్యాసాలు వ్రాస్తే అనుమతి ఉంటుందా అని తెలియజేయగలరు.JVRKPRASAD (చర్చ) 02:01, 1 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]