Jump to content

చర్చ:బ్రహ్మంగారి కాలజ్ఞానం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
బ్రహ్మంగారి కాలజ్ఞానం వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 50 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


బ్రహ్మంగారి కాలజ్ఞానం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2012 సంవత్సరం, 2 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


వ్యాసంలోని విషయాలకు ఆధారాలు

[మార్చు]

బ్రహ్మంగారు మహమ్మదీయ భక్తులకు జ్ఞానబోధచేస్తూ వారి వేషధారణ మార్చి కాషాయ దుస్తులు రుద్రాక్షలు తిలకధారణ చేయిస్తూ వచ్చాడు లాంటి మతమార్పిడి విషయాలకు చారిత్రక అధారాలేమిటి? ఆయా నవాబుల పేర్లు పేర్కొనాలి. --Nrahamthulla 04:27, 24 నవంబర్ 2008 (UTC)

ఈ వ్యాసం అసలు ఉద్దేశ్యం బ్రహ్మంగారి కాలజ్ఞానం వివరణ అసలైన కాలజ్ఞానం ఇంకా వ్రాయవలసి ఉంది ఇప్పటి వరకు వ్రాసింది జ్ఞానబోధకు కావలసిన వేదిక మాత్రమే. కాలజ్ఞానం ఆసక్తి కరమైనది. తెలుగింట అనేకులు ఎప్పుడూ తలచుకునేది ఎక్కడ ఏమి అద్భుతం జరగినానేక తెలుగువారు ఇది ఎప్పుడో బ్రహ్మంగారు చెప్పారు అని చెప్పడం రివాజు. అంత ప్రాముఖ్యత కలిగిన కాలజ్ఞానం తెలుగు వీకీపీడియాలో చోటు చేసుకోవడం సముచితం. అంతర్జాతీయ ప్రఖ్యాతి కలిగిన నాస్ట్రోడామస్‌లాంటి భవిష్యత్ జ్ఞాని ఆంధ్రదేశంలో జన్మించిన బ్రహ్మంగారు. బహుశా దేశంలో అలాంటి భవిషత్ జ్ఞాని మరొకరు లేరేమో. --t.sujatha 06:27, 24 నవంబర్ 2008 (UTC)
సుజాతగారూ, మీరు చక్కటి వ్యాసాన్ని వ్రాస్తున్నారు, అభినందనలు, ఖండితాలు, మూలాలు ఆధారాలు కోరడం సహజమే, అలాంటివి వ్యాసరచనలకు అడ్డంకులు కావని ఆశిస్తున్నాను. నోస్ట్రడామస్ చెప్పింది కొంచమే కాని దానికి లభించిన ప్రాపగండా ఊహించినదానికన్నా ఎక్కువ. మనవాళ్ళు (బ్రహ్మంగారు లాంటివారు) చెప్పింది ఎక్కువ కాని ప్రచారం జరిగింది మాత్రం బహు తక్కువ. మన వాళ్ళను మనం గుర్తించడంలో ఎప్పుడూ ఫెయిలవ్వుతూనే వున్నాం. మీరు చక్కగా వ్రాయండి, మార్పులు కూర్పులు వాటంతట అవే సరిదిద్దుకుంటూ పోతాయి. కాలజ్ఞానం అనునది, సమకాలీన మార్పులను దృష్టిలో వుంచుకొని, తర్కాన్ని హేతువులనూ చేర్చి, రాబోయే కాలం గురించి చెప్పడమే. ఇందులో గొప్పతనం ఏమీ లేదని కొందరు బుకాయించ వచ్చు. కానీ... ఆపని వారెందుకు చెయ్యలేదు? అనే ప్రశ్న ఉత్పన్నం చేసుకుని, సరైనది గ్రహించి, వాటిని ఈ తరానికి మరియు రాబోయే తరానికి అందించవలసిన బాధ్యత మనది. మరీ ముఖ్యంగా మనవారి గురించి మనం చెప్పుకోవడానికి జంకరాదు. హేట్సాఫ్, కీప్ ఇట్ అప్. నిసార్ అహ్మద్ 07:58, 24 నవంబర్ 2008 (UTC)
ఇదంతా 17 వ శతాబ్దంలోనే జరిగింది కాబట్టి కాలజ్ఞాన గ్రంధం ,దూదేకుల సిద్దయ్య వివరాలు, నవాబుల పేర్లు, చారిత్రక ఆధారాలు కూడా చేరిస్తే వ్యాసం సమగ్రంగా ఉంటుంది.--Nrahamthulla 15:14, 24 నవంబర్ 2008 (UTC)
ప్రయత్నిస్తే అధారాలు దొరకవచ్చు కానీ కొంత సమయం పడుతుంది. నా చిన్నవయసులో పుస్తకరూపంలో చదివాను.పుస్తకం మరింత ఆసక్తి దాయకంగా ఉంటుంది.--t.sujatha 16:25, 24 నవంబర్ 2008 (UTC)
బ్రహ్మంగారి గురించి వ్రాసిన సాంప్రదాయక జీవితచరిత్రలలో కడప నవాబు, బనగానపల్లె నవాబు అని చెప్పుకుపోయారే ఏ నవాబు అని ఖచ్చితంగా చెప్పలేదు. అంత శాస్త్రీయంగా మనవాళ్ళు చరిత్రను రికార్డు చేసి ఉంటే బాగుండేది. ఏవైనా బ్రహ్మంగారి జీవితవిశేషాలపై శాస్త్రీయ పరిశోధనలేమైనా దొరుకుతాయామో ప్రయత్నించాలి. నాకు తెలిసింతమటుకు ఆ కడప నవాబు మయానా వంశానికి చెందిన నవాబు అయ్యిండాలి --వైజాసత్య 05:32, 25 నవంబర్ 2008 (UTC)

వ్యాసం అమరిక

[మార్చు]

సుజాతగారికి సూచన: బ్రహ్మంగారి గురించి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వ్యాసంలో చేర్చి; కాలజ్ఞానానికి సంబంధించిన విషయాలు ఈ పేజీలో ఉంచితే సమంజసం మీరు కొంచెం ఆలోచించండి.Rajasekhar1961 06:41, 24 నవంబర్ 2008 (UTC)

బ్రహ్మంగారు కాలజ్ఞానంనేకసందర్భాలలో చెప్పారు కనుక అది అర్ధం కావడానికి కొంత ఉపోద్ఘాతం కావాలి కనుక ఆయా సందర్భాలు ఇక్కడ పొందు పరుస్తున్నాను.ఆయన 8 సంవత్సరాల వయసులో తల్లికి జ్ఞానోపదేశం చేసి సమాధి లోకి వెళ్ళే వరకూ జ్ఞానబోధ చేసాడు. కనుక వివరణ వ్యాసంలో అవసరం. వ్యాసం పూర్తి చేసిన తరవాత ఆలోచించి మార్పులు తీసుకు రావచ్చు.పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వ్యాసంలో మఠం వివరాలు చేరిస్తే బాగుంటుంది. మఠాన్ని గురించి అనేక ఆసక్తి కరమైన అంశాలున్నాయి మనకు లభ్యం అయినప్పుడు అభివృద్ధి చేస్తాం.--t.sujatha 07:47, 24 నవంబర్ 2008 (UTC)
ఈ వ్యాసం గురించి విశేష చర్చ రావడం ఒక విశేషం. బహుశా విషయం అలాంటిది కావచ్చు.వ్యాస రచనలో అంశాలు బ్రహ్మంగారి అభిప్రాయాలు మాత్రమే కానీ ప్రామాణికాలు కాదు. వ్యాసంలోని కొన్ని విషయాలు చర్చనీయాంశలే అయినా వ్యాసం ఉద్దేశ్యం మాత్రం కాలజ్ఞాన విశేషాలు వికీపీడియాలో భద్రపరచడం మాత్రమే. అన్ని విషయాలు స్పృజించకపోతే వ్యాసంలోని సమగ్రత లోపిస్తుంది.ఇది సోదర సభ్యులు సహృదయయంతో అర్ధం చేసుకుంటారని అనుకుంటాను.--t.sujatha 07:04, 25 నవంబర్ 2008 (UTC)

బొమ్మలు

[మార్చు]

వ్యాసాన్ని చక్కగా అభివృద్ధి చేస్తున్న సజాత గారికి, పరిశీలిస్తున్న సభ్యులకు అభినందనలు. అందుబాటులో ఉన్న సభ్యులు అక్కడి చిత్రాలను ఫొటోలు తీసి ఎక్కించమని కోరుతున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:42, 25 నవంబర్ 2008 (UTC)

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఈ వ్యాసంలో బొమ్మలు చూడండి. Chavakiran 16:14, 29 డిసెంబర్ 2008 (UTC)
ఈ వ్యాసానికి ప్రోత్సాహం ఇచ్చి సహకరించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు.--t.sujatha 04:59, 21 డిసెంబర్ 2008 (UTC)
సుజాత గారు, వ్యాసము చాల బాగున్నది. అయితే ఇంకా పరిష్కరించడానికి అవకాశమున్నది. ప్రయత్నించండి.Kumarrao 16:00, 29 డిసెంబర్ 2008 (UTC)
Kumarrao గారు మీ అభినందనకు ధన్యవాదాలు.దయచేసి పరిస్కరించవలసిన విషయాలు సూచించండి.పరిస్కరించాడానికి ప్రయత్నిస్తాను.--t.sujatha 14:26, 15 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఆధారాలు కావాలి

[మార్చు]

ఈ వ్యాసంలోని చాలా వాక్యాలకు ఆధారాలు కావాలి. ఉదాహరణకు ఆంగ్ల వికీ లో జననం 1610 en:Sri Potuluri Virabrahmendra Swamiఅని రాసి ఉంది. ఆటా వారి [1] వెబ్సైట్లో 1693 లో జీవ సమాధి చెందారని ఉంది. అలా అయితే 83 ఏళ్ళ వయసులో జీవసమాధి చెంది ఉండాలి. కానీ 175 వ ఏట జీవ సమాధి చెందారని రాశారు. ఆధారము ఇవ్వలేదు. అలాగే చాలా వాక్యాలు ఉన్నాయి, నేను అంతర్జాలాన్ని శోధించి కొన్ని లంకెలు మూలాలలో చేర్చాను, తెలిసినవాళ్ళు ఈ విషయాలను సవరించగలరు. ఈ విషయాల మీద ఒక కనీస ఆధారాలను సూచించి వ్యాసాన్ని మెరుగు పరచే వరకూ ఈ వారపు వ్యాసంలో పరిగణించరాదని నా అభిప్రాయం. TeluguPadam 20:54, 16 నవంబర్ 2009 (UTC)

వ్యాసం పేరు

[మార్చు]

బ్రహ్మం గారు రచించిన కాలజ్ఞానం తాళపత్రాలపై వ్రాసిన దానికి కాలజ్ఞాన తత్త్వాలు అన్నది అసలైన పేరు. వ్యాసానికి ఆ పేరుపెట్టి, ఇందులోని జీవితచరిత్రకు సంబంధించిన సమాచారం వీరబ్రహ్మం వ్యాసంలో కూడా చేర్చితే బాగుంటుంది --వైజాసత్య 05:12, 18 నవంబర్ 2009 (UTC)

వైజా సత్యగారి సూచన సమంజసం " కాల జ్ఞాన తత్వాలు " అని పేరు మార్చితే బాగుంటుంది. మిగిలిన మార్పులు చేస్తే సరిగానే ఉంటుంది.--t.sujatha 09:15, 22 నవంబర్ 2009 (UTC)
మార్పు చేశాను. 2012 రెండవవారం వ్యాసంగా ప్రదర్శించుటకు పరిగణించడమైనది.--అర్జున 05:29, 7 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
కాలజ్ఞానతత్వాలు అనేది మౌఖికంగా ప్రచారంలో వున్న గేయరూపకమైనవి అని కన్నెగంటి రాజమల్లాచారి (1998-03-01). పోతులూరి వీరబ్రహ్మం గారి జీవితం, రచనలు పరిశీలన (డాక్టరేట్ డిగ్రీ పొందిన గ్రంథం). సరోజ పబ్లికేషన్స్. p. 133. లో వున్నందున వీరబ్రహ్మంగారి కాలజ్ఞానం అనే పేరే వ్యాసానికి సరియైనది కావున వ్యాసం తరలించుతన్నాను. --అర్జున (చర్చ) 04:52, 29 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]