చర్చ:మచిలీపట్నం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


వ్యాసంలో ప్రకటనలు[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ వ్యాసంలో ప్రసాద్ గారు చాలా వ్యాపార ప్రకటనల మాదిరిగా ఫోన్ నంబర్లు చేర్చారు. ఇది వికీ నిబంధనల ప్రకారం సరైనది కాదు. దయచేసి ఆలోచించండి.--Rajasekhar1961 (చర్చ) 14:10, 24 డిసెంబరు 2015 (UTC)

Rajasekhar1961 గారు, ఉన్న సమాచారం మొత్తం తొలగించుట సబబు కాదు. మిగతా అంత సమాచారము ఎందుకు తొలగించవలసి వచ్చింది అంటారు ? రైల్వే సమాచారంలో ఏం లోపం కనపడింది అంటారు ? JVRKPRASAD (చర్చ) 14:16, 24 డిసెంబరు 2015 (UTC)
ట్రావెల్స్ మరియు టూర్స్ గురించి మీరు చేర్చారు. అతను తొలగించాడు. మీకు కోపం వచ్చింది. విషయాన్ని నిజాయితీగా చర్చించండి. నిషేధం చివరిచర్యగానే విధించండి.--Rajasekhar1961 (చర్చ) 14:20, 24 డిసెంబరు 2015 (UTC)
వికీనియమావళి ప్రకారం పోన్ నంబర్లు చేర్చడం సరియైన చర్యకాదు. కనుక తొలగించితిని.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 14:51, 24 డిసెంబరు 2015 (UTC)
@Kvr.lohith: హోటల్స్, ట్రావెల్స్ పేర్లు కూడా అనవసరం. Wikivoyage లో అవి ఉండాలి.--Vin09 (చర్చ) 14:55, 24 డిసెంబరు 2015 (UTC)
Vin09 గారూ, ఫోన్ నంబర్లు మాత్రమే తొలగించాను. హోటళ్ళు, ట్రావెల్స్ వివరాలను తొలగించలేదు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 15:04, 24 డిసెంబరు 2015 (UTC)
@Kvr.lohith: వికీపీడియా:ఏది వికీపీడియా కాదు వికీపీడీయా ప్రచార వాహనం కాదు అని ఉంది. English ప్రకారం Wikipedia:What_Wikipedia_is_not#Wikipedia_is_not_a_directory.--Vin09 (చర్చ) 15:07, 24 డిసెంబరు 2015 (UTC)
Rajasekhar1961 గారు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాకు కోపం ఎందుకు ? అతను రైల్వే సమాచారం కూడా తొలగించడము జరిగింది. నేను ఇప్పుడు చేర్చలేదు. అతను తొలగింపుల గురించి ఎందుకు చర్చించుతున్నట్లు. కేవలం అతనికి అదే పని అంటారా ? అందరం తొలగింపులు కార్యక్రమము పెడదామంటే చెప్పండి. వికీ రూల్స్ నకు వ్యతిరేకముగా ఉన్నవి అన్నీ ఒక పద్దతి ప్రకారము మొత్తం అన్నీ తొలగిద్దాము. నిషేదమునకు నిరోధమునకు తేడా చాలా ఉంది. అతని పనిని కేవలం 2 గంటలు నిరోధించాను, అతన్ని నిషేధించ లేదు. ముందు పని చేయమని చెప్పండి.JVRKPRASAD (చర్చ) 15:08, 24 డిసెంబరు 2015 (UTC)
ఇతను చెప్పే రూల్స్ పాటిస్తే కొన్ని వందలు వ్యాసాలలో సమాచారము మొత్తం తొలగించాలి. చెప్పండి. JVRKPRASAD (చర్చ) 15:12, 24 డిసెంబరు 2015 (UTC)
@JVRKPRASAD: సరేనండి నేను User:Pavan santhosh.s చెప్తే వచ్చా, నేను ఇంగ్లీష్ వికీనే ఎడిట్కి చేస్తా. ధన్యవాదాలు.--Vin09 (చర్చ) 15:17, 24 డిసెంబరు 2015 (UTC)
నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పుడు తొలగించాల్సిన అవసరం ఉంది. వికీనాణ్యత పెంచడానికి కొన్ని వేల గ్రామవ్యాసాలను మీరు సరిదిద్దారు కదా. అదే విధంగా సరైన నియమాలు ఉన్నప్పుడు నియమాలకు విరుద్ధంగా ఉన్న వాక్యాలను కూడా తొలగించి వికీపీడియా నాణ్యత పెంచాల్సిన బాధ్యత మనపై ఉంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 15:23, 24 డిసెంబరు 2015 (UTC)
@Vin09: ఇక్కడకు కాదు వికీలో ఎక్కడకయినా ఎవరైనా ఎప్పుడయినా వస్తూ ఉంటారు. ఎవరి కోసం ఎవరు పని చేయరు. వికీలో ఏదీ ఎవరి సొంతం కాదు. అంటే ఇక్కడ ఉండి అన్నీ తొలగింపులు కార్యక్రమము చేద్దామంటే తప్పకుండా చేద్దాము. ఇప్పుడే మొదలు పెడదాము. మీరు తొలగింపులు తప్ప మరేమీ చేయదలచుకోలేదనే అర్థం అవుతోంది. సరే అదే చేద్దాము. JVRKPRASAD (చర్చ) 15:25, 24 డిసెంబరు 2015 (UTC)
రమణ గారు, పనికి రానివి తొలగించవచ్చు. సమాచారము మొత్తం తొలగించటమే పనిగా పెట్టుకొని పని చేస్తుంటే అలా వదిలేద్దామా ? JVRKPRASAD (చర్చ) 15:27, 24 డిసెంబరు 2015 (UTC)
Vin09 గారూ en:Wikipedia:What Wikipedia is not:what wikipedia is not వ్యాసంలో ఉన్న ఉపవిభాగంలో Travel guides గూర్చి వ్రాయడం జరిగినది. దీని ప్రకారం హోటళ్ళు, ట్రావెల్ గైడ్లు కూడా చేర్చరాదు. హోటళ్ళ గూర్చి పారిస్ వ్యాసంలో HOTELS వలె విభాగంగా వ్రాయవచ్చు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 15:30, 24 డిసెంబరు 2015 (UTC)
  • అందరూ క్షమిస్తే నా ప్రస్తావన వచ్చింది కనుక చిన్న వివరణ. ఇటీవల హైదరాబాద్ తెలుగు-ఆంగ్ల వికీపీడియన్ల సమ్మేళనం జరిగిన విషయం తెలిసిందే. సమావేశానికి ఆంగ్ల వికీపీడియాలో మంచి కృషిచేసిన తెలుగు వారు వచ్చారు. అందులో వినయ్ కూడా ఒకరు. కార్యక్రమంలో నిర్వాహకులు నన్ను ప్రెజంటేషన్ ఇమ్మంటే - తెవికీ గురించి ఓ చిరు ప్రెజంటేషన్ ఇచ్చి వారందరితో మాట్లాడాను. ఆ విషయాన్నే వినయ్ పైన ప్రస్తావిస్తున్నారు. ఉంటాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 03:06, 25 డిసెంబరు 2015 (UTC)
కొత్తవాళ్ళ వివరాలు ఉండవు. వాళ్ళెవరో తెలియదు. పరిచయాలు ఉండవు. ఎకాఎకీన తొలగింపులు, మార్పులు చేస్తున్నారు. మాలాంటి వారికి చాలా ఇబ్బందిగా ఉంటోంది. నిన్న కూడా రైల్వే సమాచారము ఈ వ్యాసములో ఎందుకు తొలగించారో చెప్పరు. సిఐఎస్ ధనం, గుర్తింపు వికీ వాడుకరులకు ఏదో రూపంలో అందజేస్తోంది. సంతోషమే. ఆ ముసుగులో సిఐఎస్ నకు మాత్రమే అవసరమయిన పనులు, కార్యక్రమాలు చేసుకుంటే అసలు వికీ సంస్థ మరుగున పడకుండా కూడా జాగ్రత్తలు వహించాలి. రెండు రాష్ట్రాలుగా తెలుగు వారు విడిపోయారు మరియు అన్ని విషయములలో (ఆలోచనలు, పనులు) చాలా వ్యత్యాసము ఉంటాయి. అన్నీ కేవలం హైదరాబాదులోనే జరుగుతున్నాయి. జరిగినవి వివరంగా తెలియడము లేదు. వ్రాసే పనులు చేసే వారు తగ్గి పెత్తనం లాంటి పనులు చేసే వారే ఎక్కువగా ఉన్నారు అని అనిపిస్తోంది. ఇది వికీ అభివృద్ధికి ఆటంకం అనిపిస్తోంది. JVRKPRASAD (చర్చ) 03:29, 25 డిసెంబరు 2015 (UTC)
Vin09 గారు, నిషేధాలతో, నిరోధాలతో పనిచేయడం మంచి పద్ధతి కాదని మీపైన ప్రసాద్ గారు విధించిన నిరోధాన్ని తొలగించాను. మీరు తెవికీలో పనిచేయడం ప్రారంభించిన తర్వాత తొలగింపులతో కాకుండా కొన్ని మంచి వ్యాసాలు అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించవలసినది. ఇది నా అభ్యర్ధన. ఏ భాషా వికీపీడియాలో నైనా సమాచారం తొలగించడం; దాన్ని చేర్చిన వ్యక్తిని బాధిస్తుంది. ఆంగ్ల వికీ అంత విస్తృతమైన వ్యవస్థ తెవికీలో లేదు. ఇక్కడ ఉన్న కొద్దిమంచి స్నేహపూర్వకంగా పనిచేస్తున్నాము. నిబంధనల ప్రకారం సమాచారాన్ని తొలగించాల్సి వచ్చినప్పుడు. ఆ వ్యాసం చర్చ పేజీలో దీనిని గురించి చర్చించిన బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 05:20, 25 డిసెంబరు 2015 (UTC)
Rajasekhar1961 మీరు చెప్పినట్టే వింటాను ధన్యవాదలు.--Vin09 (చర్చ) 05:38, 25 డిసెంబరు 2015 (UTC)
* జేవీఆర్కే ప్రసాద్ గారూ రెండు రాష్ట్రాలుగా తెలుగు వారు విడిపోయారు మరియు అన్ని విషయములలో (ఆలోచనలు, పనులు) చాలా వ్యత్యాసము ఉంటాయి. అన్నీ కేవలం హైదరాబాదులోనే జరుగుతున్నాయి. జరిగినవి వివరంగా తెలియడము లేదు. అన్నారు. మొదటి రెండు అభ్యర్థనలు హైదరాబాద్ నుంచే రావడంతో మీకు అలా అనిపించి వుండొచ్చు. కానీ ఇందులో సీఐఎస్-ఎ2కె ప్రమేయం ఏమీ లేదు. ఆ కార్యక్రమాలను ప్రణయ్ రాజ్ చొరవ తీసుకుని చేశారు. మీరు కూడా ఐఆర్సీలో ఉన్నారు కదా అక్కడ ఆయన హైదరాబాద్ లో తెవికీ దినోత్సవం చేయాలని వుందని అన్నారుగా - ఆయనే నిర్వాహకులు, సముదాయంలోని సభ్యులైనవారు చేస్తామని ముందుకువస్తే నిర్హేతుకంగా కాదని చెప్పే అధికారం కానీ, అడ్డుకునే హక్కు కానీ సీఐఎస్-ఎ2కెకి లేవు. అందుకే సహకరించాం. హైదరాబాద్ లో జరిగినదాని కన్నా మిన్నగా విజయవాడలో చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నాం. నెలవారీ సమావేశాలు కూడా నిర్వహించుకునేందుకు హైదరాబాద్ లో గోల్డెన్ థ్రెషోల్డ్ లాగానే విజయవాడలోనూ ఓ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నాం. అలానే స్థానికంగా పలు కార్యక్రమాలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిపై సూచనలు, సలహాలు, సంప్రదింపుల కోసం మీతో వ్యక్తిగతంగా మాట్లాడదామని ప్రయత్నిస్తున్నాను. ఇందుకై రేపే విజయవాడ రానున్నాను మీకు అంగీకారమైతే మాట్లాడుకుందాం. ఆ ముసుగులో సిఐఎస్ నకు మాత్రమే అవసరమయిన పనులు, కార్యక్రమాలు చేసుకుంటే అసలు వికీ సంస్థ మరుగున పడకుండా కూడా జాగ్రత్తలు వహించాలి. అన్నారు. తెలుగు వికీపీడియాలో కొత్తవారిని ఆహ్వానించడం వరకే సీఐఎస్-ఎ2కె ఉద్యోగిగా చేసే పని, వారిని తొలగింపులు చేయమని మాత్రం మేమెవరికీ చెప్పింది లేదు. అలాగే వికీపీడియా వాలంటీర్లను దాటుకుని ముందుకూ వెళ్ళలేదు, ఉదాహరణకు ఇటీవల జరిగిన కార్యక్రమం ప్రణయ్ రాజ్ చొరవతో చేసింది. ఆయనకు చెయ్యమని కానీ, ఎలా చెయ్యాలని కానీ సీఐఎస్-ఎ2కె చెప్పలేదు. చేసినప్పుడు ఆయన కోరిక మేరకు మాత్రం సహకారం చేశాం. అలానే వినయ్ కీ ఏం చేయాలో చెప్పలేదు, తెవికీలో పనిచేయవచ్చని మాత్రం చెప్పాం. అలానే తెవికీపీడియన్లుగా మీరు చెప్పేవి చేయడం తప్ప సీఐఎస్-ఎ2కెకి వేరే పని లేదు. అందుకని సీఐఎస్-ఎ2కెకు వేరుగా అవసరమైన పనులు లేవని, సముదాయంగా మీరే పని చేయించదలచుకుంటే అవే మా పనులని మనస్ఫూర్తిగా చెప్పదలచినాను. జరిగినవి వివరంగా తెలియడము లేదు. సార్, ప్రతి కార్యక్రమ నివేదిక - కార్యక్రమంలో ఏం మాట్లాడామన్న అంశం మొదలుపెట్టి, పాల్గొన్నవారి వివరాలు సహా నిర్వాహించినవారు (ఈ కార్యక్రమం విషయంలో ప్రణయ్ గారు) రాశారు. అలానే వాడుకరి పేర్లతో సహా వచ్చినవారి వివరాలు, ఫోటోల సహితంగా అందులో ఉంటున్నాయి. రచ్చబండలో ఫలానా కార్యక్రమపు నివేదిక ఇది అనీ రాస్తున్నారు. మరిన్ని వివరాలు కావలసివస్తే ఎలా కావాలో మీరు దయచేసి సూచించవచ్చు. మరోమారు మీరు చేస్తున్న కృషి పట్ల గౌరవమే తప్ప మరోటి లేదని, అలాగే ఏ వాడుకరికీ ఇలాగే రాయండి అన్న నిర్దేశం సీఐఎస్-ఎ2కె చేయట్లేదని మనవి చేసుకుంటూ, ప్రస్తుతానికి ఉంటాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:08, 25 డిసెంబరు 2015 (UTC)
పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారు, మీరు వ్రాశిన అన్ని విషయములతో పాటుగా మరిన్ని సంగతులు మీరు నాతో ఈ రోజున దాదాపుగా 44 నిమిషములు మాట్లాడినారు. అందువల్ల, ముఖాముఖీ చర్చ అనంతరం ఇంక మీకుగా మీరు ఏమైనా మీ అభిప్రాయములు తదుపరి వ్రాయాలనుకున్న దయచేసి వ్రాయగలరు. JVRKPRASAD (చర్చ) 08:17, 25 డిసెంబరు 2015 (UTC)
Rajasekhar1961 గారూ, సహాయం జరిగినట్లు భావిస్తే సహాయంకావాలి మూసను తొలగించండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 11:42, 25 డిసెంబరు 2015 (UTC)

మండలమా ? ఊరా ?[మార్చు]

అయ్యా ! ఇంతకీ ఈ పేజీ మచిలీపట్నం మండలానికి సంబంధించినదా లేకా కేవలం ఊరునకు మాత్రమే చెందినదా దయచేసి తెలియజేయగలరు. JVRKPRASAD (చర్చ) 14:36, 16 మే 2016 (UTC)

ఇది ఒక నగరం.--Vin09 (చర్చ) 16:36, 16 మే 2016 (UTC)