చర్చ:వారణాసి భానుమూర్తి రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ పేజీలో చేర్చిన పాఠ్యంలో 90.4% ఒకే ఐపీ అడ్రసు నుండి వచ్చినదే. అసలు పేజీని మొదలు పెట్టింది కూడా అదే ఐపీ అడ్రసు. మరో 5.2% దీనికి దగ్గరగా ఉన్న ఐపీ అడ్రసు నుండి వచ్చినదే. ఎవరో ప్రచారం కోసం సృష్టించారని అనిపిస్తోంది. ఈ వ్యాస విషయ ప్రాముఖ్యత చూద్దామని ప్రయత్నించగా నాకు అలాంటి లింకులేమీ కనిపించలేదు. ఇచ్చిన మూలాలు అందుకు పనికొచ్చేవి కావు. వెంకటరమణ గారు, యర్రా రామారావు గారు, మహేశ్వరరాజు గారు పరిశీలించవలసినది. __చదువరి (చర్చరచనలు) 02:12, 21 ఏప్రిల్ 2020 (UTC)

ఈ వ్యాసం పూర్తిగా ఒక కవిసంగమము అనే పేస్ బుక్ పేజీ నుండి, ప్రతిలిపిలోని వారణాసి భానుమూర్తి రావు వ్యాసం నుండి పూర్తిగా కాపీ,పేస్టు చేయబడిందని గమనించి మూస పెట్టాను.అజ్ఞాత వాడుకరి ఖాతాతో తన వ్యాసం తానే రాసుకున్నట్లుగా క్లియరుగా తెలుస్తుంది.ఇది వికీపీడియా నియమాలకు విరుద్ధం.కావున వెంటనే తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 03:52, 21 ఏప్రిల్ 2020 (UTC)
తన వ్యాసం తానే సృష్టించినట్లు అనిపిస్తుంది. ఇప్పటికీ అజ్ఞాత వాడుకరి ఖాతాతో మార్పులు చేస్తున్నారు.Ch Maheswara Raju (చర్చ) 05:16, 21 ఏప్రిల్ 2020 (UTC)
ఈ కవి గురించి ఎటువంటి విషయాలు లభ్యమగుట లేదు. అంతర్జాలంలో కొన్ని వెబ్‌సైట్‌లలో అతను కవి, రచయిత అనేందుకు ఆధారాలు ఉన్నాయి. కానీ అతని జీవిత విశేషాలు, పురస్కారాలు, ప్రచురణలు అతని బ్లాగు, ఫేస్ బుక్ నుండి తీసుకున్న విషయాలనిపిస్తోంది. ఈ వ్యాసం రచయిత స్వయంగా రాసినదే. ఎందుకంటే బాహ్య లింకులలో "అక్షర యజ్నం నా కవితల బ్లాగు" , "దయచేసి నన్ను ప్రతిలిపిలో అనుసరించండి" అనే వాక్యాలను చెర్చాడు. బాహ్యలింకులను తొలగించాను. వికీ నిబంధనల ప్రకారం ప్రస్తుతం తొలగించాలి. పూర్తి వివరాలు లభ్యమైనప్పుడు వ్యాసం సృష్టించవచ్చు.--కె.వెంకటరమణచర్చ 09:15, 21 ఏప్రిల్ 2020 (UTC)