చర్చ:వైష్ణవ దేవి ఆలయం
స్వరూపం
మెరుగైన పేరు
[మార్చు] సహాయం అందించబడింది
ఆంగ్ల వికీపీడియాలో Vaishno Devi , Vaishno Devi Temple అనే రెండు వ్యాసాలు ఉన్నవి. వైష్ణవ దేవి వ్యాసంలో రెండు వ్యాసాలకు చెందిన సమాచారం ఉంది. తెవికీ వ్యాసం వికీ డేటా లింకు Vaishno Devi Temple అనే ఆంగ్ల వ్యాసానికి కలపబడింది. ఈ వ్యాసానికి చెందిన ఎక్కువ సమాచారం తెవికీ వ్యాసంలో ఉంది.శీర్షిక దేవత కు సంబంధించిన శీర్షికలాగా లేదు.ఒక వ్యక్తి పేరుకు సంబంధించినట్లుగా ఉంది.కావున దీనిని వైష్ణోదేవి ఆలయం (జమ్మూ కాశ్మీరు), లేదా వైష్ణవదేవి ఆలయం (జమ్మూ కాశ్మీరు) అనిగానీ లేదా వైష్ణోదేవి మాతా అలయం అని లేదా ఇంకా మెరుగైన పేరుతో తరలిస్తే బాగుంటుంది.దీనిపై గౌరవ సీనియర్ వికీపీడియన్లు స్పందనలు కోరుచున్నాను. -- 2021-02-04T23:22:45 యర్రా రామారావు
- వాడుకరి:యర్రా రామారావు గారు, ఆంగ్లం వికీలో రెండు వ్యాసాలున్నాయి కావున, తెలుగు వ్యాసాన్ని కూడా రెండుగా విడగొట్టి, అనువాద ఉపకరణంతో మరింత అభివృద్ధి చేయడం మంచిది.
- ఇంకొక మాట, వికీ చర్చలలో పాల్గొనటంపై పరిమితులు సూచించడం వికీస్ఫూర్తికి వ్యతిరేకమని నా అభిప్రాయం. గత మూడు రోజులలో 29 వీక్షణలు వున్నా స్పందనలు లేకపోవటానికి అది కారణం కావొచ్చు. కావున దయచేసి సీనియర్, జూనియర్ మాటలు ఇకముందు వాడకపోతే బాగుంటుంది. స్పందనలు వచ్చిన తరువాత, వాటిని విశ్లేషించి తగిన నిర్ణయం తీసుకొనటం చర్చ ప్రారంభించిన వ్యక్తిగా మీకే వుంటుంది. ఇక దీనిపై స్పందించడానికి తొలిగా ఇష్టపడేవారు, ఈ వ్యాసం విస్తరించడంలో, సవరించడంలో పాల్గొన్నవారే కావున, వారిని ( User:Hnaluru, User:C.Chandra Kanth Rao, User:Dev, User:Pavan santhosh.s ) స్పందించమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 22:54, 7 ఫిబ్రవరి 2021 (UTC)
- అర్జున గారూ మీ సూచనలకు ధన్యవాదాలు. సీనియర్ అనే పదం నేను ఇంతకు ముందు ఎప్పుడు ఉపయోగించలేదనుకుంటున్నాను.గౌరవ అనే పదం మాత్రమే వాడతాను.సీనియర్ అనే పదం నాకు తెలియకుండానే యాదృచ్చికంగా వాడనే తప్ప, తెలిసి కావాలని వాడలేదని నేను తెలియజేస్తున్నాను.ఏది ఎమైనా ఈ కారణానికి నేను క్షమాపణలు చెపుతున్నాను. యర్రా రామారావు (చర్చ) 03:17, 8 ఫిబ్రవరి 2021 (UTC)