చర్చ:శాసనోల్లంఘన ఉద్యమం
Jump to navigation
Jump to search
ప్రతేకంగా పేజీ ఎందుకంటే
[మార్చు]శాసనోల్లంఘన ఉద్యమం అనేది నాలుగేళ్ళ పాటు భారత స్వాతంత్ర్యోద్యమాన్ని ప్రభావితం చేసిన ఉద్యమం. ఉప్పు సత్యాగ్రహం అందులో ప్రధానమైన భాగమే.. కానీ దాని తరవాత శాసనోల్లంఘన ఉద్యమం చాలానే జరిగింది. వికీలో దీనికి ప్రత్యేకంగా పేజీ లేకపోవడం ఆశ్చర్యమే. ఎన్వికీలో కూడా పేజీ లేదు. సివిల్ డిసొబీడియెన్‌స్ మూవ్‌మెంటనే పేజీని దండి మార్చ్ అనే పేజీకి దారిమార్పు చేసారు. తెవికీలో ప్రత్యేకంగా పేజీ ఉండాలని ఈ పేజిని సృష్తించాను. వీలైనంత వివరంగా రాసే ప్రయత్నం చేసాను. వాడుకరులు పరిశీలించి తగు మార్పుచేర్పులు చెయ్యవలసినదిగా కోరుతున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 08:32, 2 నవంబరు 2021 (UTC)
- @రవిచంద్ర గారూ, @K.Venkataramana గారూ, పరిశీలించండి. మూలాలు ఇంకా ఎక్కడైనా అవసరమా, మరింత సమాచారం ఏదైనా చేర్చాలా, భాషా దోషలేమైనా ఉన్నాయా.. వగైరా విషయాలను పరిశీలించి తగు మార్పులు చెయ్యవలసినది. "ఫలితాలు, పర్యవసానాలు" విభాగాన్ని మరింత నిశితంగా చూడవలసినది. ప్రవేశికలో కావాలనే మూలాలివ్వలేదు - ఎందుకంటే ప్రవేశికలో ఉన్న ప్రతీ అంశమూ వ్యాస ప్రధానాంగంలో వచ్చింది, అక్కడ మూలాలనిచ్చాను. __ చదువరి (చర్చ • రచనలు) 08:37, 2 నవంబరు 2021 (UTC)
- తెలుగు వికీలో శాసనోల్లంఘన అనే వ్యాసం ఉంది.కానీ ఇది ప్రపంచ సంబంధమైన శీర్షిక.ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి శాసనోల్లంఘన ఉద్యమాలు జరగవచ్చు.అందువలన ఇది దానికి వర్తించింది.అయితే ఇప్పుడు చదువరి గారు ఆంగ్లవికీలో లేనివ్యాసం పేజీని గమనించి, తెలుగు వికీలో తగిన మూలాలతో పూర్తి విస్తరణతో పేజీని సృష్టించిన వ్యాసం భారత స్వాతంత్ర్యఉద్యమంలో భాగంగా జరిగిన శాసనోల్లంఘన ఉద్యమం. అయితే ఈ రెండు వ్యాసాలు చదివితే తేడా అర్థమవుతుంది.చదవకుండా శీర్షికలు చూసినవారికి ఒకే విషయానికి చెందిన రెండు వ్యాసాలు ఉన్నవి అనుకోవటానికి అవకాశం ఉంది.కావున చదువరి గారు ఈ వ్యాస శీర్షికను భారత శాసనోల్లంఘన ఉద్యమం గా తరలింపు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.దీనిమీద పరిశీలించగలరు.ఆంగ్లంలో లేని వ్యాసం పేజీని తెలుగు వికీపీడియాలో సృష్టించినందుకు చదువరి గార్కి ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 08:57, 2 నవంబరు 2021 (UTC)
- @యర్రా రామారావు గారూ, ఈ సమస్యను చూపినందుకు ధన్యవాదాలు. ఆ పేజీ వలన పాఠకుడికి తికమక కలుగుతుందన్నది వాస్తవం. ఆ పేజికి వచ్చిన వ్యూలను చూస్తే ఆ సంగతి అర్థమౌతోంది.భారత శాసనోల్లంఘన గురించి తెలుసుకుందామని వచ్చే వళ్ళు ఉంటారుగానీ శాసనోఈల్లంఘన భావన గురించి తెలుసుకుందామని వచ్చేవారు పెద్దగా ఉండరు. అక్కడ ఉన్న 192 పేజీ వ్యూల్లో చాలా ఎక్కువ శాతం భారత ఉద్యమం కోసమే వచ్చి ఉంటారు. అంచేతనే ఆ పేజీని శాసనోల్లంఘన భావన అనే పేజీకి దారిమార్పు లేకుండా తరలించి, "శాసనోల్లంఘన" పేజీని ఈ పేజీకి దారిమార్పు చేసాను. దీనివలన మీరు చెప్పిన సమస్య పరిష్కారమైందని భావిస్తాను. పరిశీలించండి. __ చదువరి (చర్చ • రచనలు) 09:42, 2 నవంబరు 2021 (UTC)
- మంచిగా పరిష్కరించారు. యర్రా రామారావు (చర్చ) 09:46, 2 నవంబరు 2021 (UTC)