చర్చ:2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అభివందనాలు[మార్చు]

చక్కని వ్యాసం తయారీలో సింహభాగం కృషి చేస్తున్న User:Chaduvari గారికి అభివందనాలు. తోడ్పడుతున్న User:రవిచంద్ర User:Pavan santhosh.s User:K.Venkataramana User:యర్రా రామారావు గార్లకు ధన్యవాదాలు. ఎలెక్షన్ల ప్రచారంలో సంగ్రహమైన సమాచారం అందరికీ విలువైనదిగా ఉపయోగపడుతుందని నా నమ్మకం. దీనికి సంబంధించి ఏదైనా నిర్దిష్టమైన దానికి సహాయం కావాలంటే సముదాయానికి తెలియచేయండి. దీనికి సంబంధించి తెలుగు వికీలోనే సవరణ చేయగల పటము తయారు చేయటానికి ప్రయత్నిస్తాను. --అర్జున (చర్చ) 10:17, 29 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ, నేనే అడుగుదామనుకుంటున్నాను. ఈ మ్యాపు చూడండి. దీనిలో శాసనసభ నియోజక వర్గాలను సూచించారు గానీ, పేర్లు గానీ సంఖ్యలు గానీ లేవు. దీనిలో సంఖ్యలు ఉంటే బాగుంటుంది. ఫలితాలొచ్చాక, ఆయా నియోజకవర్గాలను రంగులతో సూచించడానికి వీలుగా ఉంటుంది. (సంఖ్యలతో వేరే మ్యాపు ఉంది గానీ, అది తక్కువ రిజల్యూషనుతో ఉంది, బాలేదు.) అలాగే ఒక్కో నియోజకవర్గపు మ్యాపును విడిగా తయారు చేస్తే (అందులోని మండలాలను చూపిస్తూ) - మొత్తం 175 శా.స ని.వర్గాలు - సంబంధిత పేజీల్లో పెట్టొచ్చు. ఇదే పద్ధతిలోనే తెలంగాణకు కూడా. పని పెద్దదే.. __చదువరి (చర్చరచనలు) 10:33, 29 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
User:Chaduvari గారికి, ప్రస్తుత తెలుగు వికీపీడియా క్రియాశీలత స్థాయిని బట్టిచూస్తే మరియు మన మార్పులు నాణ్యతతో సుస్థిరంగా వుండాలంటే నా దృష్టిలో మనం జిల్లా స్థాయిలో లేక నియోజకవర్గ స్థాయిలో పనిచేయటం మంచిదని నా నమ్మకం. ప్రస్తుతానికి ఆ స్థాయిలో పటం చేయటానికి ప్రయత్నిస్తాను.--అర్జున (చర్చ) 10:39, 29 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
User:Chaduvari గారికి,వికీపీడియా:వికీప్రాజెక్టు/ఎన్నికలు చూడండి. మీ స్పందన దాని చర్చాపేజీలో తెలియచేయండి.--అర్జున (చర్చ) 06:06, 1 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అభ్యర్ధుల వివరాల పట్టికలో అధికారిక నియోజకవర్గ క్రమ సంఖ్య చేర్చుట[మార్చు]

ఫలితాల విశ్లేషణకు మూల దత్తాంశంగా వాడాలంటే జిల్లా పేరును అధికారిక నియోజకవర్గ క్రమ సంఖ్య చేర్చాలి. పట్టిక వెడల్పు కొద్దిగా పెరుగుతుంది తప్ప ఇంకేమి ఇబ్బంది లేదు. అభ్యంతరాలుంటే స్పందించండి.--అర్జున (చర్చ) 11:07, 3 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మార్పు చేశాను.--అర్జున (చర్చ) 06:30, 7 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

నియోజకవర్గం వారీగా పోలింగు[మార్చు]

"నియోజకవర్గం వారీగా పోలింగు" విభాగంలోని సమాచారాన్ని కొన్నాళ్ళ తరువాత ఫలితాల పేజీలోకి తరలిద్దాం. అప్పటి వరకూ ఇక్కడే ఉంచుదాం. __చదువరి (చర్చరచనలు) 05:37, 13 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@చదువరిగారికి, నేను ఆ విభాగం వ్యాసం పరిమాణాన్ని విపరీతంగా పెంచుతుందేమో అనుకున్నాను. ప్రస్తుతానికి మీ సలహా పాటిద్దాము. అన్నట్లు పోలింగ్ శాతం వివరాలు వికీలో చేర్చడానికి మీకు కష్టపడాల్సివచ్చిందనుకుంటాను. ఎపీ సిఈఒ వెబ్సైట్ లో ఈ దత్తాంశం కనబడలేదు. --అర్జున (చర్చ) 10:18, 13 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, ఈ డేటాను ఆ మూలం లోని .jpg నుండి ఓసీయార్ ద్వారా చేసాను. ఏవో చిన్న చితకా ఓసీయార్ తప్పులను సరిదిద్దడం తప్ప, పెద్దగా కష్టపడలేదు. __చదువరి (చర్చరచనలు) 10:57, 13 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

<nowiki/> చేరుతోంది[మార్చు]

User:Chaduvari గారు, మీ విజువల్ ఎడిటర్ మార్పులలో <nowiki/> చేరుతున్నట్లు గమనించాను (ఉదాహరణ1, ఉదాహరణ2). ఇది పరిష్కరించబడినది అనుకున్నాను. ఇది ఏమైనా Visual Editor వాడుకరి అనుభవం సరిగాలేకపోవటంవలన కలిగే దోషమా?--అర్జున (చర్చ) 03:50, 15 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ, న్యూలైన్ క్యారెక్టరును తీసేసినపుడు అలా వస్తుందని గతంలో నేను గమనించాను. దాని వలన ఇబ్బంది ఏమైనా ఉన్నట్టు నేను గమనించలేదు. మీరు చెప్పేది కూడా అలానే వచ్చిందేమో తెలియదు. మీరేమైనా ఇబ్బంది గమనించారా?__చదువరి (చర్చరచనలు) 04:39, 15 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]
సోర్స్ ఎడిటర్ వాడేవారికి ఇది అనవసర స్పామ్. సరియైన <nowiki> ఎక్కడుందో అనుమానం రావచ్చు. గతంలో గుళ్లపల్లిగారు బొద్దు లింకులు చేసినప్పుడల్లా ఇది వచ్చిందని గమనించి CIS-A2K వారికి నివేదించాను. దానికేమైందో తెలియదు. మీరు ఖచ్చితపరచుకుని, మీడియవీకీలో బగ్ నివేదిస్తే మంచిది. --అర్జున (చర్చ) 04:52, 15 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]