చార్లెస్ III

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Military career
చార్లెస్ III
కామన్వెల్త్ రాజ్యాలు రాజు
యునైటెడ్ కింగ్‌డమ్ రాజు
Reign8 సెప్టెంబర్ 2022 - ప్రస్తుతం
Predecessorఎలిజబెత్ II
హెయిర్ అప్పరెంట్విలియం, ప్రిన్స్ ఆఫ్ వేల్స్
జననంప్రిన్స్ చార్లెస్ అఫ్ ఎడిన్బర్గ్
(1948-11-14) 1948 నవంబరు 14 (వయసు 75)
బకింగ్‌హామ్ ప్యాలెస్‌, లండన్, ఇంగ్లాండు
Issue
  • విలియం, ప్రిన్స్ ఆఫ్ వేల్స్
  • ప్రిన్స్ హరీ, డ్యూక్ అఫ్ సస్సెక్స్
Names
చార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్[1]
Houseవిండ్సర్
తండ్రిప్రిన్స్ ఫిలిప్ డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్
తల్లిఎలిజబెత్ II
మతంప్రొటెస్టెంట్[2]
విద్యగోర్డాన్‌స్టన్
విద్యాసంస్థకేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
రాజభక్తియునైటెడ్ కింగ్‌డమ్
సేవలు/శాఖ
  • రాయల్ నేవీ
  • రాయల్ ఎయిర్ ఫోర్స్
సేవా కాలం1971–1976

చార్లెస్ III (చార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్; జననం 14 నవంబర్ 1948) యునైటెడ్ కింగ్‌డమ్ & 14 కామన్‌వెల్త్ రాజ్యాలకు రాజు. ఆయనను క్వీన్ ఎలిజబెత్‌-2 మరణాంతరం ఆమె పెద్ద కుమారుడు, వేల్స్‌ మాజీ యువరాజు ఛార్లెస్‌ (73)ను బ్రిటన్ నూతన రాజుగా 2022 సెప్టెంబర్ 10న అధికారికంగా ప్రకటించగా, ఆయన లండన్‌లోని చారిత్రక సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో భాద్యతలు చేపట్టాడు.[3]

జననం, విద్యాభాస్యం[మార్చు]

చార్లెస్ తన తాత కింగ్ జార్జ్ VI బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో 14 నవంబర్ 1948న జన్మించాడు. అతని తల్లి ఎలిజబెత్‌-2 1952లో సింహాసనాన్ని అధిరోహించినప్పుడు అతనికి మూడు సంవత్సరాల వయస్సు. చార్లెస్ చీమ్, గోర్డాన్‌స్టన్ పాఠశాలల్లో విద్య పూర్తి చేసి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని (ఆర్కియాలజీ, ఆంత్రోపాలజీ, హిస్టరీ) సాధించి 1971 నుండి 1976 వరకు ఎయిర్ ఫోర్స్ & నేవీలో పని చేశాడు.

వివాహం[మార్చు]

చార్లెస్ III 1981లో లేడీ డయానా స్పెన్సర్‌ను వివాహమాడి, 1996 జులైలో చార్లెస్, డయానా విడాకులు తీసుకున్నారు. వారికీ ఇద్దరు కుమారులు విలియం, హ్యారీ ఉన్నారు. ప్యారిస్ లో 1997లో జరిగిన కారు ప్రమాదంలో డయానా మరణించిన తర్వాత ఆయన 2005లో తన కామిలా పార్కర్ బౌల్స్‌ను రెండో వివాహం చేసుకున్నాడు.[4]

బ్రిటన్ రాజు[మార్చు]

క్వీన్ ఎలిజబెత్‌-2 ఏడు దశాబ్దాలకుపైగా సుదీర్ఘ కాలంపాటు బ్రిటన్‌ను పాలించిన అనంతరం ఆమె మరణాంతరం ఆమె పెద్ద కుమారుడు, వేల్స్‌ మాజీ యువరాజు ఛార్లెస్‌ను నూతన రాజుగా 8 సెప్టెంబర్ 2022న లండన్ లోని చారిత్రక సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ఛార్లెస్‌ సతీమణి క్వీన్‌ కాన్సర్ట్‌ కెమిల్లా కుమారుడు ప్రిన్స్ విలియమ్‌ సహా అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో రాజుగా ఛార్లెస్‌ పేరును అధికారికంగా ప్రకటించారు. ఛార్లెస్‌-3ను రాజుగా ప్ర‌క‌టించిన త‌ర్వాత ఆయ‌న స‌ద‌రు డాక్యుమెంట్‌పై సంత‌కం చేయగా సంబంధిత పత్రంపై బ్రిటన్‌ ప్రధాని, కాంటర్‌బరీ ఆర్చిబిషప్‌, లార్డ్ ఛాన్స్‌లర్, పలువురు సీనియర్లు సంతకాలు చేశారు.

ఛార్లెస్​ను ఇకపై కింగ్​ ఛార్లెస్​-3గా పిలుస్తారు. ఆయన భార్య కామిలాను క్వీన్ కాన్సర్ట్‌ పేరుతో వ్యవహరిస్తారు. దాదాపు 240 కోట్ల జనాభా కలిగిన 56 స్వతంత్ర దేశాల కామన్‌వెల్త్ కూటమికి ఛార్లెస్ నాయకుడు అవుతారు. వీటిలో 14 దేశాలకు (ఆస్ట్రేలియా, ఆంటిగ్వా, బార్బుడా, బహమాస్, కెనడా, గ్రెనడా, జమైకా, పపువా న్యూ గినియా, సెయింట్ క్రిస్టఫర్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, న్యూజీలాండ్, సాల్మన్ ఐలాండ్స్, తువాలూ), బ్రిటన్‌కు ఛార్లెస్ అధినేతగా ఉంటారు.[5]

మూలాలు[మార్చు]

  1. "The Royal Family name". Official website of the British monarchy. Archived from the original on 15 February 2009. Retrieved 3 February 2009.
  2. "King Charles vows to protect the security of the Church of Scotland" (Press release) (in ఇంగ్లీష్). The Church of Scotland. 10 September 2022. Retrieved 14 September 2022.
  3. "బ్రిటన్‌ కొత్త రాజుగా చార్లెస్‌-3 ప్రమాణం" (in ఇంగ్లీష్). 11 September 2022. Archived from the original on 25 October 2022. Retrieved 25 October 2022.
  4. "బ్రిటన్‌ రాజుకు గల అసాధారణ ప్రత్యేకతలు ఇవే". 9 September 2022. Archived from the original on 25 October 2022. Retrieved 25 October 2022.
  5. BBC News తెలుగు (9 September 2022). "రాణి ఎలిజబెత్ అనంతరం బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్". Archived from the original on 25 October 2022. Retrieved 25 October 2022.