చాలకూడి ఎన్.ఎస్.నారాయణస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చాలకూడి ఎన్.ఎస్.నారాయణస్వామి
వ్యక్తిగత సమాచారం
జననం1925
చాలకూడి, కేరళ
మరణం2003(2003-00-00) (వయసు 77–78)
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తివాయులీన విద్వాంసుడు
వాయిద్యాలువయోలిన్

చాలకూడి ఎన్.ఎస్.నారాయణస్వామి (1925-2003) కర్ణాటక సంగీత వాయులీన విద్వాంసుడు.

విశేషాలు

[మార్చు]

ఇతడు 1925వ సంవత్సరంలో కేరళ రాష్ట్రం చాలకూడిలో జన్మించాడు.[1] ఇతడు గాత్ర సంగీతాన్ని, వయోలిన్‌ను మొదట తన మామ ఎన్.కె.అఖిలేశ్వర భాగవతార్ వద్ద అభ్యసించాడు. తరువాత ఇతడు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వద్ద శిష్యరికం చేశాడు. ఇతడు ఆకాశవాణి త్రివేండ్రం కేంద్రం ప్రారంభమైనప్పటి నుండి 1956 వరకు నిలయ వాయులీన కళాకారుడిగా పనిచేశాడు. త్రివేండ్రంలోని స్వాతి తిరునాళ్ సంగీత కళాశాలలో వయోలిన్ ప్రొఫెసర్‌గా, ప్రిన్సిపాల్‌గా 1956 నుండి 1981 వరకు సేవలను అందించాడు. 1981లో అమెరికాలోని అరిజోనా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా సంపాదించాడు. ఇతడు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, చెంబై వైద్యనాథ భాగవతార్, ఎం.డి.రామనాథన్, కె.వి.నారాయణస్వామి, ఎస్.సోమసుందరం, కె.ఎస్.గోపాలకృష్ణన్, ఎన్.రమణి, టి.ఎన్.శేషగోపాలన్, టి.ఆర్.సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి వంటి అగ్రశ్రేణి సంగీత విద్వాంసుల కచేరీలలో వాద్య సహకారం అందించాడు. సోలో ప్రదర్శనలు కూడా దేశమంతట ఇచ్చాడు. ఇతడు కాలికట్ విశ్వవిద్యాలయం, కేరళ విశ్వవిద్యాలయం, మైసూరు విశ్వవిద్యాలయాల బోర్డు సభ్యుడిగా ఉన్నాడు.

1977లో ఇతడికి కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. 1987లో కేరళ సంగీత నాటక అకాడమీ విశిష్ట ఫెలోషిప్‌ను అందించింది. 1988లో సంగీత నాటక అకాడమీ అవార్డును స్వీకరించాడు.

ఇతడు 2003 ఫిబ్రవరి 24వ తేదీన తిరువనంతపురంలోని తన నివాసంలో 78 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. web master. "Chalakudy N. S. Narayanaswamy". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 30 March 2021.[permanent dead link]