చింతలపూడి త్రినాధరావు
చింతలపూడి త్రినాధరావు | |
---|---|
జననం | 1955 |
ఇతర పేర్లు | చింతలపూడి త్రినాధరావు |
వృత్తి | హైదరాబాద్‌లోని ఎస్‌బిహెచ్ ఏజిఎం |
సుపరిచితుడు | సంగీతకారుడు, సాహిత్యాభిమాని |
జీవిత భాగస్వామి | లక్ష్మి |
పిల్లలు | సుప్రియ, దీప్తి, శ్రావణి |
తల్లిదండ్రులు | తాతారావు,సూరమ్మ |
వెబ్‌సైటు | http://www.trinadharao.in/ |
చింతలపూడి త్రినాధరావు సంగీతకారుడు, సాహిత్యాభిమాని. ఆయన వృత్తి రీత్యా బ్యాంక్ ఆఫీసర్. ఆయన ప్రస్తుతం హైదరాబాదులోని ఎస్‌బిహెచ్ ఏజిఎంగా పనిచేస్తూ కళాప్రియుడుగా, నటుడిగా, సుమధుర గాయకుడిగా సంగీతజగత్తులో విహరిస్తూ ఆస్వాధిస్తున్నారు.[1]
జీవిత విశేషాలు[మార్చు]
త్రినాథరావు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో తాతారావు, సూరమ్మ దంపతులకు 1955లో చిన్నకుమారునిగా జన్మించారు. స్థానికంగా డిగ్రీని చేసారు. అనంతరం హైదరాబాదులో పి.జి.చేసారు.1978 లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సాధారణ గుమస్థాగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియాలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన త్రినాధ రావు బ్యాంకులో వివిధ హోదాలలో దేశమంతటా, మారిషస్ లోను సేవలందించి ప్రస్తుతం అదే బ్యాంక్ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా ప్రజా సంబంధాల విభాగంలో హైదరాబాదులో పనిచేస్తున్నారు.
కళాకారుడు, గాయకుడిగా సాంస్కృతిక కార్యక్రమాలతో సహవాసం చేస్తున్నా ఏనాడూ వృత్తిని నిర్లక్ష్యం చేయలేదు. నిబద్దతో పనిచేస్తూ సంగీతంతో సేదతీరుతుంటానని ఆయన చెబుతూవుంటారు. వృత్తిలోని ఆయన అంకితభావానికి మెచ్చి ఎస్‌బిహెచ్ యాజమాన్యం కూడా తమ సంస్థ తరపున ఉగాది పురస్కారంతో సత్కరించింది. ఉద్యోగరీత్యా విజయవాడ, నర్సాపురం, కొణితివాడలతో పాటు మారిషస్‌లో పనిచేసినా అదే సంగీత ప్రభంజనం ఆయనను చుట్టుముడుతుంటాయి.
నటుడిగా[మార్చు]
నటుడిగా హరిగోపాల్ దర్శకత్వం వహించిన యండమూరి వీరేంద్రనాథ్ రచన ‘రుద్రవీణ’ నాటకంలోనూ, ఆదివిష్ణు రాసిన ‘పండగొచ్చింది’ నాటికలో నటుడు కోట శ్రీనివాసరావుతో పోటీపడి నటించారు. ఆయన లోని నటుడుని గమనించిన దర్శకులు కోడి రామకృష్ణ కోరగా "అంకుశం" సినిమాలో ఓ పాత్ర నటించి మెప్పించారు. అనంతరం శ్రీహరి నటించిన "హనుమంతు" చిత్రంలోనే త్రినాథ్ నటించారు. ఆకాశవాణి, దూర దర్శన్‌లలో జరిగే సంగీత కార్యక్రమాలలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంటారు.
సంగీత, నాటక విభాగాలలో దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాలలో ఆడిషన్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసిన త్రినాధ రావు ప్రఖ్యాత సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన దాదాపు 500 కుపైగా సంగీత కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా, అతిథి గాయకునిగా పాల్గొని, అనేక మధుర గీతాలను ఆలపించి ప్రముఖులనెందరినో మెప్పించారు, అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. అక్కినేని నాగేశ్వర రావు, డా. సి.నారాయణ రెడ్డి, జయసుధ, కోడి రామకృష్ణ వంటి ప్రముఖుల చేతులమీదుగా అనేక సన్మానాలను కూడా అందుకున్నారు. 'అంకుశం', 'హనుమంతు' అనే తెలుగు చలన చిత్రాలలో అతిథి పాత్రలలో నటించి, గాయకునిగానే కాకుండా నటునిగా కూడా తన ప్రతిభను నిరుపించుకున్నారు త్రినాధ రావు.
వ్యక్తిగత జీవితం[మార్చు]
త్రినాథ్, లక్ష్మి దంపతులకు సుప్రియ, దీప్తి, శ్రావణి ముగ్గురు కుమార్తెలు. సుప్రియ దంపతులు ఉద్యోగరిత్యా అమెరికాలో స్థిరపడ్డారు. దీప్తి, శ్రీవాణిలు హైదరాబాదులోనే సీఎ, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.
పురస్కారములు[మార్చు]
- విశిష్ట సేవాపురస్కారం-2009, సిరిమువ్వ సంస్థ (తాడేపల్లిగూడెం)
- కళారత్న విశిష్టరత్న, కళాపరిషత్ (వైజాగ్)
- సేవారత్న, మెగాసిటీ నవకళావేదిక (హైదరాబాదు)
- కళాజ్యోతి, ఆరంభం మ్యాగ్‌జైన్ (పాలకొల్లు)
- జీవితకాల పురస్కారం, అభ్యుదయ కళానికేతన్ (అలమలాపురం)
- గానకళాప్రపూర్ణ, ఆత్మీయ, మానసిక వికాస కేంద్రం (హైదరాబాదు)
- ఆంధ్రకళారత్న, మానవత స్వచ్ఛంద సేవాసమితి (అమలాపురం)
- గానభూషణ, కళానిలయం (హైదరాబాదు)
అవార్డులు-రివార్డులు[మార్చు]
- కాకినాడ మ్యూజికల్ గ్రూప్ వారిచే జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి చేతుల మీదుగా 2012 ఆగస్టు 19 న "నట గాన కళా రత్న" బిరుదు ప్రదానం
- అత్యధిక సంగీత ప్రదర్శనలు ఇచ్చినందుకు గాను "ఇండియా బుక్ అఫ్ వండర్ రికార్డు హోల్డర్స్"లో స్థానం.
- భరతముని ఆర్ట్స్ అకాడెమీ, మదనపల్లె వారిచే "భరతముని కళారత్న" అవార్డు
- స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియాలో "ఉత్తమ అసిస్టెంట్ జనరల్ మేనేజర్"గా వరుసగా మూడు సంవత్సరాలు ఎంపిక.
- వెన్నెల కల్చరల్ ఆర్గనైజేషన్, మచిలీపట్టణం వారిచే "గాయక రత్న" బిరుదు ప్రదానం
- సిరిమువ్వ కల్చరల్ ఆర్గనైజేషన్, తాడేపల్లిగూడెం వారిచే 2009 సంవత్సరానికి "విశిష్ట సేవ పురస్కారం" ప్రదానం.
- విశాఖ రత్న కళా పరిషత్, విశాఖపట్నం వారిచే "కళారత్న" పురస్కారం.
- మెగా సిటీ నవ కళా వేదిక, హైదరాబాదు వారిచే "సేవ రత్న" పురస్కారం.
- ఆరంభం డైలీ న్యూస్ పేపర్, పాలకొల్లు వారిచే "కళాజ్యోతి" పురస్కారం.
- స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా వారి "2011 - ఉగాది పురస్కారం"
- అభ్యుదయ కళానికేతన్, అమలాపురం వారి "జీవిత సాఫల్య పురస్కారం"
- ఆత్మీయ కళా సంస్థ, హైదరాబాదు వారిచే "గాన కళా ప్రపూర్ణ" అవార్డు
- మానవతా స్వచ్ఛంద సేవా సమితి, అమలాపురం వారిచే "ఆంధ్ర కళా రత్న" పురస్కారం
- కళానిలయం, హైదరాబాదు వారిచే "గాన భూషణ" అవార్డు
- లలిత కల్చరల్ ఆర్గనైజేషన్ వారిచే "జెమ్ అఫ్ ది నేషన్" (జాతిరత్నం) అవార్డు
- సాకిన ఫౌండేషన్ వారిచే "నోబెల్ డీడ్స్" అవార్డు
- లలిత ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ వారిచే "సంస్కృతిక సౌజన్య మూర్తి" బిరుదు ప్రదానం.
- ఉస్మానియా యూనివర్సిటీ వారిచే "ఉత్తమ సంగీత కళాకారుడు" అవార్డు
- లలిత కళా సుధ కల్చరల్ అసోసియేషన్ వారిచే "స్వర సుధ" అవార్డు.
- పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ అఫ్ ఇండియా వారిచే "ఉత్తమ ప్రజా సంబంధాల అధికారి" అవార్డు
- లలిత కళా సమితి వారిచే డాక్టర్ సి. నారాయణ రెడ్డి చేతుల మీదుగా "కళా సేవారత్న" బిరుదు ప్రదానం
- కమలాకర సేవ ట్రస్ట్ వారిచే "సాంస్కృతిక సేవారత్న" బిరుదు ప్రదానం
- పంచాయతీరాజ్ మంత్రి వర్యులు శ్రీ కె. జానారెడ్డి గారిచే "రాజీవ్ రత్న" బిరుదు ప్రదానం
- దిలీప్ కల్చరల్ అకాడెమీ వారిచే హైకోర్ట్ న్యాయమూర్తి గౌరవనీయులు డాక్టర్ బి. చంద్ర కుమార్ గారి చేతుల మీదుగా "అన్నమయ్య" అవార్డు ప్రదానం
- లలితా కల్చరల్ సొసైటీ వారిచే "ఇందిరా ప్రయదర్శిని ప్రజ్ఞ" అవార్డు ప్రదానం
- "అభినందన - అప్నా ఘర్" సాంఘిక సంస్థ వారిచే మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పి. వి. రాజేశ్వర రావు, శ్రీ ఎల్లూరి శివా రెడ్డి గార్ల చేతులమీదుగా "సాంఘిక సేవ రత్న" బిరుదు ప్రదానం
- విశ్వ సాహితి సంస్థ వారిచే ఘంటసాల జయంతి సందర్భంగా శ్రీ పోతుకూచి సాంబశివరావు, 'రసమయి' రాము గార్ల చేతులమీదుగా "ఘంటసాల సంగీతశాల" బిరుదు ప్రదానం.
- అన్నమయ్య కళాపీతం వారిచే "స్వరగానసుధ" బిరుదు ప్రదానం
- బెంగళూరు ఆంధ్ర మహా సభ వారిచే "ప్రవాస ఆంధ్ర థియేటర్ అకాడమీ (పాట)" అవార్డు
- మానవత స్వచ్ఛంద సేవా సమితి 39వ వార్షికోత్సవం సందర్భంగా జీవిత సాఫల్య పురస్కారం
- చైతన్య కళాభారతి వారిచే నర్తనశాల, లవకుశ స్వర్ణోత్సవాల సందర్భంగా "మథుర గాన రత్న" బిరుదు ప్రదానం
- స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా యువకళావాహిని వారిచే "స్వామి వివేకానంద ఎక్సలెన్సీ" అవార్డు ప్రదానం
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లలిత కల్చరల్ అసోసియేషన్ వారిచే ఆంధ్ర సారస్వత పరిషత్ హాల్ లో శ్రీ ఎన్. తులసి రెడ్డి గారి చేతుల మీదుగా
- "సేవా భారతి" బిరుదు ప్రదానం.
- CITD Global Economic Development Award for outstanding performance of Vandemataram by Central Minister Sri Sarve Satyanarayana
- అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవం సందర్భంగా సేవ్ ఉర్దూ సంస్థ వారిచే సాంఘిక సేవా పురస్కారం ప్రదానం
- లయన్స్ క్లబ్ హైదరాబాదు చాప్టర్ వారి "ఎక్సెలెన్సీ" అవార్డు
- వీరవాసరం కళాపరిషత్ వారిచే 5వ రాష్ట్ర స్థాయి నాటక పోటీల సందర్భంగా "గాయక మౌళి" బిరుదు ప్రదానం
- లలిత కళాపరిషత్ వారి 2014 ఉగాది పురస్కారాలలో భాగంగా "గాన గంధర్వ" బిరుదు ప్రదానం
- కిన్నెర ఆర్ట్ థియేటర్ వారి అధ్వర్యంలో 12 గంటల నిర్విరామ సంగీత విభావరిలో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ గారు, సినీ, సంగీత ప్రముఖులచే "స్వర కిన్నెర" బిరుదు ప్రదానం
మూలాలు[మార్చు]
- ↑ "గానలహరి త్రినానధుడి ఊపిరి". సూర్య పత్రిక. Retrieved 2012-10-12.[permanent dead link]
ఇతర లింకులు[మార్చు]
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- Pages using infobox person with unknown parameters
- Pages using Infobox person with deprecated parameter home town
- Infobox person using religion
- Infobox person using home town
- తెలుగు సినిమా నటులు
- తెలుగువారిలో సంగీతకారులు
- 1955 జననాలు
- పశ్చిమ గోదావరి జిల్లా రంగస్థల నటులు
- పశ్చిమ గోదావరి జిల్లా సినిమా నటులు