చింతల వెంకట్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చింతల వెంకట్ రెడ్డి
జననండిసెంబరు 22, 1950
జాతీయతభారతీయుడు
వృత్తిసేంద్రీయ వ్యవసాయదారుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నేల సంతానోత్పత్తి,మట్టి మార్పిడి

చింతల వెంకట్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంకు చెందిన వ్యవసాయదారుడు. నాలుగు దశాబ్దాలుగా ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తున్నాడు. ఈయనకు భారత ప్రభుత్వం 2020 పద్మ పురస్కారాలులో పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించింది. మట్టిమార్పిడి, నేల సంతానోత్పత్తిలో సాంకేతికతకు భారతదేశంలో అంతర్జాతీయ పేటెంట్ పొందిన మొట్టమొదటి స్వతంత్ర రైతుగా ఇతను గుర్తింపుపొందాడు. సేంద్రీయ వ్యవసాయం పద్ధతుల్లో తన పేరుకు జాతీయస్థాయిలో పేటెంట్లను కలిగి ఉన్నాడు. రసాయన ఎరువులు, పురుగు మందులు, శిలీంద్ర సంహారిణి లాంటివి ఉపయోగించకుండా ఇతను వ్యవసాయం చేస్తున్నాడు. తన వినూత్న సేంద్రీయ వ్యవసాయం కోసం రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకున్నాడు. మొదటిసారిగా విత్తన రహిత ద్రాక్షను ఇతనే పండించాడు.[1]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

వెంకట్ రెడ్డి 1950, డిసెంబరు 22న ముత్యంరెడ్డి, సత్యమ్మ దంపతులకు మేడ్చల్ జిల్లా, అల్వాల్ లో జన్మించాడు. ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరీమణులలో వెంకట్ రెడ్డి రెండవవాడు. సికింద్రాబాదు ఇంగ్లీష్ మాధ్యమంలో పియుసి (ప్రీ-యూనివర్శిటీ కోర్సు లేదా 12వ తరగతి)లో ఉత్తీర్ణత సాధించి, ఆ తరువాత చదువు ఆపేశాడు.[2]

సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు[మార్చు]

చెట్టు ఆకులను ఎరువుగా ఉపయోగించి వరి, గోధుమ, ద్రాక్ష పంటల దిగుబడి రెట్టింపు చేశాడు. సేంద్రియ విధానాలను పాటించి, అధిక దిగుబడులను సాధించిన వెంకటరెడ్డి, ప్రపంచ మేధోహక్కుల సంస్థ (వైపో)ను మెప్పించి 2008లో 28 ఐరోపా దేశాల్లో పేటెంట్లు పొందాడు. పంజాబ్, హరియాణా రాష్ట్రాలలోని రైతులు ఈ విధానాన్ని పాటించి గోధుమ పంటకు అధిక దిగుబడులను సాధించారు.[3]

గుర్తింపులు[మార్చు]

  1. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్‌ హైదరాబాద్‌ సందర్శనకు వచ్చినప్పుడు వెంకట్ రెడ్డితో మాట్లాడాడు.
  2. వ్యవసాయ శాస్త్ర వేత్తలు నార్మన్ బోర్లాగ్, ఎం.ఎస్.స్వామినాథన్లు వెంకటరెడ్డి వ్యవసాయంలో అనుసరిస్తున్న మెళకువలను అడిగి తెలుసుకున్నారు.
  3. ఆంధ్రపదేశ్‌ ద్రాక్ష రైతు అభివృద్ధి సంఘం అధ్యక్షుడిగా, జాతీయ పరిశోధన సంస్థ పుణే విభాగంలో సభ్యుడిగా ఉన్నాడు.

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. హెచ్ఎంటివి, తెలంగాణ (28 January 2020). "మన తెలంగాణ 'పద్మా'లు". www.hmtvlive.com. Archived from the original on 25 April 2020. Retrieved 25 April 2020.
  2. సాక్షి, తెలంగాణ (27 January 2020). "మట్టి మనిషి.. మహాకృషి". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 25 April 2020.
  3. సాక్షి, ఫ్యామిలీ (28 January 2020). "'మట్టి' పద్మం!". Sakshi. Archived from the original on 25 April 2020. Retrieved 25 April 2020.
  4. సాక్షి, ఎడ్యూకేషన్ (25 January 2020). "పద్మ పురస్కారాలు-2020". Archived from the original on 10 February 2020. Retrieved 10 February 2020.
  5. నమస్తే తెలంగాణ, జాతీయం (25 January 2020). "141 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం". Archived from the original on 10 February 2020. Retrieved 10 February 2020.
  6. హెచ్ఎంటీవి, ఆంధ్రప్రదేశ్ (26 January 2020). "పద్మ అవార్డు గ్రహీతల పూర్తి జాబితా". రాజ్. Archived from the original on 10 February 2020. Retrieved 10 February 2020.