చిలుముల విఠల్ రెడ్డి
చిలుముల విఠల్ రెడ్డి (1914 - 2012) కమ్యూనిస్టు నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభ్యుడు. సిపిఐ శాసనసభా పక్ష నాయకుడిగా ఆయన కూడా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. విఠల్ రెడ్డిని అప్పట్లో ఎన్టీఆర్ బావగా అభివర్ణించేవారు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]విఠల్ రెడ్డి స్వగ్రామం కౌడిపల్లి. 6వ తరగతి వరకు చదువుకున్న విఠల్ రెడ్డిది వేల ఎకరాల భూస్వామ్య కుటుంబం. అయితే కమ్యూనిజం పట్ల ఆకర్షితుడై 1954లో సీపీఐలో చేరి నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారు. 1957లో మొదటిసారి నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1956-62 వరకు కౌడిపల్లి సర్పంచ్‌గా కొనసాగారు.[2]
1962లో మొదటిసారి సీపీఐ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1966లో విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకై ఉద్యమించి శాసనసభకు రాజీనామా చేసిన 67 మంది శాసనసభ్యులలో ఈయనా ఒకడు.[3]
ఆ తర్వాత 1978లో, 1985, 89, 94ల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999 ఓటమి తరువాత వయోభారం, అనారోగ్య కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
ఆయన అక్టోబరు 19 2012 న మెదక్ జిల్లా నర్సాపూర్‌లో తుదిశ్వాస విడిచారు.
మూలాలు
[మార్చు]- ↑ ఎన్టీఆర్‌తో బావ అని పిలింపిచుకున్న విఠల్ రెడ్డి కన్నుమూత
- ↑ ఎన్టీఆర్‌తో బావ అని పిలింపిచుకున్న విఠల్ రెడ్డి లేరు
- ↑ Nagaraju, Jinka (16 February 2021). "When 67 MLAs in 1966 resigned from Assembly for Vizag Steel". India: News Meter. Retrieved 24 July 2024.