చేదు నారింజ
Citrus aurantium | |
---|---|
![]() | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | C. × aurantium
|
Binomial name | |
Citrus × aurantium L., 1753
|
చేదు నారింజను ఆంగ్లంలో బిట్టర్ ఆరెంజ్ అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం సిట్రస్ ఔరంటియుమ్. ఇది నిమ్మజాతి వృక్షం. ఈ చెట్టు ఫలం చూడటానికి కమలాపండు వలె ఉంటుంది. ఈ చెట్టు పండు కమలాపండు వలె పుల్లగా, తీయగా ఉండక చేదుగా ఉంటుంది. అందువలనే ఈ నిమ్మను చేదు ఆరెంజ్ లేక చేదు నారింజ అంటారు. ఇది సిట్రస్ మాక్సిమా, సిట్రస్ రెటికులాటా నిమ్మజాతుల యొక్క సంకరజాతి. చేదు ఆరెంజ్ యొక్క అనేక రకాలను ఎస్సేన్షియాల్ ఆయిల్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ ముఖ్యమైన నూనెను పరిమళ ద్రవ్యాలలోను, రుచుల కొరకు కలిపే ద్రావకాలలోను ఉపయోగిస్తారు. సెవిల్లె అనే చేదు నారింజను మార్మాలాడే ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. చేదు నారింజను మూలికావైద్యంలో ఉపయోగిస్తారు. బాగా ఆకలి అవడానికి, ఉత్తేజంగా ఉండటానికి వంటి అనేక పనుల కొరకు దీనిని ఉపయోగిస్తారు. ఎక్కువ బరువు ఉన్నవారు దీనిని ఉపయోగించి బరువు తగ్గడానికి దీని ఔషధాలను ఉపయోగిస్తున్నారని ఈ ఔషధాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆకలి మందగిస్తుందని అందువలన ఈ చేదు నారింజతో తయారయ్యే ఔషధాల వాడకాన్ని తగ్గించాలని కొందరు వాదిస్తారు.