చైనాలో హిందూమతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చైనీస్ భాషలో "ఓం" చిహ్నం [a]

హిందూమతాన్ని (ప్రత్యేకంగా యోగ విభాగం) ప్రస్తుతం చైనాలో కొద్దిమంది ఆచరిస్తున్నారు. ఆధునిక చైనా ప్రధాన భూభాగంలో ఈ మతానికి చాలా పరిమితమైన ఉనికి ఉంది. అయితే మధ్యయుగం నాటి చైనాలోని వివిధ ప్రావిన్సులలో హిందూమతం గణనీయంగా ఉండేదని పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి. [1] హిందూ ప్రభావాలు బౌద్ధమతంలో కూడా కలిసిపోయాయి. అది చైనీస్ పురాణాలతో మిళితమై పోయింది. [2] యోగాభ్యాసం, ధ్యానం వంటి ప్రాచీన భారతదేశపు వైదిక సంప్రదాయంలో ఉద్భవించిన అభ్యాసాలు చైనాలో కూడా ప్రాచుర్యం పొందాయి. చైనాలో కొంతమంది శివుడు, విష్ణువు, గణేశుడు, కాళి వంటి హిందూ దేవుళ్లను పూజిస్తారు.

అయ్యవోలే, మణిగ్రామం వంటి తమిళ వ్యాపార సంఘాల ద్వారా హిందూ సమాజాలు మధ్యయుగ దక్షిణ చైనాలో ఒకప్పుడు అభివృద్ధి చెందాయి. [3] [4] ఆగ్నేయ చైనాలో, ఫుజియాన్‌లోని క్వాన్‌జోలో ఉన్న కైయువాన్ దేవాలయం వంటి శివ రూపాలు, దేవాలయాల సాక్ష్యాలు ఇప్పటికీ వెలుగు చూస్తూనే ఉన్నాయి. [5] ప్రస్తుతం హాంకాంగ్‌లో తమిళ వలస కార్మికుల చిన్న సంఘం ఒకటి ఉంది.

చరిత్ర

[మార్చు]
చైనాలోని జెజియాంగ్‌లోని పుటుయోషాన్ గ్వాన్యిన్ ధర్మ రాజ్యంలోని చైనీస్ బౌద్ధ దేవాలయంలో డాజిజాటియాన్ (శివ) విగ్రహం

చైనాలో హిందూమతాన్ని పెద్దగా ఆచరించనప్పటికీ, బౌద్ధ విశ్వాసాలు, పద్ధతులు, సంప్రదాయాల ద్వారా (దీనికి హిందూమతానికి ధార్మిక మూలం ఒక్కటే) చైనా సంస్కృతిని ప్రభావితం చేయడంలో దీనికి ముఖ్యమైన పాత్ర -కాకపోతే పరోక్ష పాత్ర - ఉంది. ఇది సా.శ. 1 - 2 శతాబ్దాల్లో భారతదేశం నుండి చైనాకు వ్యాపించింది. [6] ఈ ప్రభావాల సమయంలో, ఆలోచనల సంయోజన సమయంలో వచ్చిన కొన్ని కొత్త పదాలను అప్పటికే ఉన్న భావనలతో ముడిపెట్టారు. ఉదాహరణకు, రాక్షసులను లౌచా తో, పీశకాలను పిషెజువో తో అలా ముడిపెట్టారు. తత్ఫలితంగా, చైనీస్ బౌద్ధమతంలో చైనీస్ సంస్కృతిపై హిందూమత ప్రభావపు జాడలు కనుగొనవచ్చు. ఇది అనేక హిందూ దేవతలను దాని పౌరాణిక ప్రపంచంలో సమకాలీకరించింది. బౌద్ధమతం లోని ధర్మపాలకుల సమూహమైన ఇరవై నాలుగు దేవతలపై చైనా బౌద్ధ విశ్వాసం దీనికొక ఉదాహరణ. ఈ ధర్మపాలకుల సమూహం లోని దేవతలలో ఇరవై-ఒక్క మంది హిందూమతం నుండి తెచ్చుకున్నవారే. డాజీజైటియాన్ (శివ), డిషిటియాన్ (ఇంద్రుడు), డఫంటియాన్ (బ్రహ్మ), జిషియాంగ్ టియాన్ను (లక్ష్మి), బియన్‌చైటియాన్ (సరస్వతి), యన్‌మోలువోవాంగ్ (యముడు) ఈ దేవతల్లో ఉన్నారు. ఇరవై నాలుగు దేవతల విగ్రహాలు అనేక చైనీస్ బౌద్ధ దేవాలయాల్లో, మఠాలలో సాధారణంగా మహావీర హాలులో ప్రతిష్టించబడ్డాయి. [7] [8] మరోప్రక్క దేవుళ్ళే కాకుండా, హిందూమతం లోని ఇతర పాత్రలు కూడా చైనీస్ బౌద్ధ విశ్వాసంలో చోటుచేసుకున్నాయి. దేవుళ్ళు, నాగాల ఎనిమిది సైన్యాలు దీనికొక ఉదాహరణ. అసురులు, మహోరగాలు, కిన్నెరలు ఇందులో భాగాలే. హిందూమతం లోని యక్షులు, చైనా బౌద్ధమతంలోని దెయ్యాలు లేదా రాక్షసుల తరగతికి చెందినవారు. యక్షులపై విశ్వాసం చైనా లోకి లోటస్ సూత్రం ద్వారా చేరింది. దీనిని ధర్మరక్ష సా.శ. 290 లో చైనీస్‌లోకి అనువదించాడు. సా.శ. 406 లో కుమారరాజీవ వీటిని మళ్ళీ అనువదించాడు. విష్ణు వాహనమైన గరుడుడు జియాలోలో అనే పేరుతో చైనాలో ప్రసిద్ధం. గోల్డెన్ వింగ్డ్ గ్రేట్ పెంగ్ అని దీని అర్థం. రాక్షసులు అంటే మనుషులను తినే పిశాచాలు, దెయ్యాలు అని చైనా సమాజంలో భావిస్తారు. ఉదాహరణకు, 16వ శతాబ్దపు ప్రసిద్ధ నవల జర్నీ టు ది వెస్ట్ లో ఉన్న ప్రిన్సెస్ ఐరన్ ఫ్యాన్ను రాక్షసిగా చిత్రించారు. [9] చైనా, తైవాన్, ఇతర చైనీస్ కమ్యూనిటీలలో నలుగురు స్వర్గ పాలకుల రూపాన్ని తీసుకున్న లోకపాలులు మరొక ఉదాహరణ. వివిధ బోధిసత్వులు కూడా హిందూ దేవతల రూపంలో వ్యక్తమవుతున్నట్లు వివరించబడ్డాయి. ఉదాహరణకు, మాటౌ గువాన్యిన్ అనేది హయగ్రీవుని రూపం (గుర్రం తల గల దేవుడు). [10] గువాన్యిన్ యొక్క మరొక అభివ్యక్తి, ఝుంటి గువాన్యిన్ కూడా చండీ మాత రూపంగా పరిగణిస్తారు. [10] మరొక ఉదాహరణలో, దేవుడు లేదా మోలిఝీటియాన్ బోధిసత్వుడు మహేశ్వరి అవతారంగా భావిస్తారు. అందుచేతనే దీనికి మాతృక అనే పేరు కూడా ఉంది. [10] చైనీస్ జానపద మతంలోని అనేక ఇతిహాసాలు, కథలు, నెజా వంటివి, హిందూ పురాణాలలోనివే నని 10వ శతాబ్దపు టియాన్సిజాయి అనువాదాల ద్వారా గుర్తించారు. [11] చైనీస్ పౌరాణిక పాత్ర సన్ వుకాంగ్‌కు మూలం హనుమంతుడు అని కొంతమంది పండితులు భావిస్తారు.

దస్త్రం:Hayagriva statue at Baipu Temple in Beijing, China.jpg
చైనాలోని బీజింగ్‌లోని బైపు ఆలయం వద్ద ఆలయం ముందు హయగ్రీవ విగ్రహం

ఆర్థర్ వాలీ (1889-1996) టావో టె చింగ్ (మార్గం, దాని శక్తి) అనువదిస్తూ ఇలా వ్యాఖ్యానించాడు[12]

"లీహ్ త్జు వర్ణించిన 'పవిత్ర పర్వత పురుషులు' (షెంగ్-హ్సీన్) భారతీయ ఋషులే అనడాన్ని సందేహించేందుకు ఎటువంటి కారణమూ కనిపించడం లేదు; హిందూ యోగాసనాలను చాలా దగ్గరగా పోలి ఉండే కదలికలను కొంతమంది టావోయిస్ట్‌లు సాధన చేసారని చువాంగ్ త్జులో చదివినప్పుడు., ఈ ఋషులు ఉపయోగించిన యోగా జ్ఞానం కూడా చైనాలోకి వెళ్లే అవకాశం ఉంది."

పురాతన చైనీస్ మతంపై హిందూమత ప్రభావానికి కొన్ని ఉదాహరణలు "ఆరు పాఠశాలలు" లేదా "ఆరు సిద్ధాంతాలు". అలాగే యోగా, స్థూపాలు (తూర్పు ఆసియాలో పగోడాగా మారాయి) పై నమ్మకం. అయితే చైనాలో బౌద్ధమతం, కన్ఫ్యూషియనిజం లు పొందినట్లుగా హిందూమతం ఎన్నడూ పెద్దగా ప్రజాదరణ పొందలేదు. టిబెట్‌లోని కొన్ని ప్రాంతాలలో దీనికి మినహాయింపులు ఉన్నాయి. [13]

చైనాలో ఒక చిన్న హిందూ సమాజం ఉంది, ఎక్కువగా ఆగ్నేయ చైనాలో ఉంది. పదమూడవ శతాబ్దానికి చెందిన ద్విభాషా తమిళం, చైనీస్ భాషల శాసనం ఒకదానికి, క్వాన్‌జౌలోని శివాలయ అవశేషాలతో సంబంధం ఉన్నట్లు కనుగొన్నారు. ఇది బహుశా దక్షిణ భారత-శైలిలో నిర్మించిన రెండు హిందూ దేవాలయాలలో ఒకటి అయి ఉంటుంది. ఇది పాత ఓడరేవు యొక్క ఆగ్నేయ భాగంలో నిర్మించబడి ఉండాలి. గతంలో ఇక్కడే విదేశీ వ్యాపారుల ఎన్‌క్లేవ్ ఉండేది. [14]

2 నుండి 12వ శతాబ్దాల వరకు ఉన్న చైనీస్ గ్రంథాలు దాదాపు 150 మంది పండితులు వివిధ హిందూ సంస్కృత గ్రంథాలను చైనీస్‌లోకి అనువదించడంపై దృష్టి సారించినట్లు సూచిస్తున్నాయి. [15] వేదాలను మింగ్-లూన్ (జ్ఞాన శాస్త్రం) లేదా ఝి-లున్ (మేధో శాస్త్రం) అని పిలుస్తారు. ప్రాచీన చైనీస్ పండితులు అనేక ఇతర సంహితలు, శాస్త్రాలను కూడా అనువదించారు. [16] [17] భారతదేశంలోనే లభించని కొన్ని ఒరిజినల్ గ్రంథాలు, అనువాదాలు చైనాలో ఉన్నాయి - ఉదాహరణకు, జిన్ క్వి షి లున్ అనేది సాంఖ్య -కారిక యొక్క అనువాదం. ప్రభావవంతమైన అనువాదాలకు మరొక ఉదాహరణ సా.శ. 1 నుండి 3వ శతాబ్దం వరకు హరివంశం నుండి శ్లోకాలను యిజింగ్ చేసిన అనువాదం. యిజింగ్ హరివంశంలోని దుర్గా దేవి శ్లోకాలను అనువదించాడు. కానీ వాటిని సరస్వతి దేవికి వర్తించాడు. విజ్ఞానం, సంగీతం, కళలు, అంతర్గత శక్తికీ దేవత అయిన సరస్వతి, రుద్ర శక్తి కలిగిన దేవతతో కలిసిపోయింది. ఇది ఆధునిక చైనీస్ బౌద్ధ దేవాలయాలలో ఇప్పటికీ ప్రతిష్టించబడిన ఇరవై-నాలుగు దేవతలలో ఒకటైన చైనీస్ బియాన్‌కాటియాన్ అని పిలువబడింది. [18]

చైనాలో బౌద్ధమతాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగించని భాష ఐన సంస్కృతంలో ఉన్న ప్రాచీన హిందూ శాసనాలను కూడా యున్నాన్ ప్రావిన్స్‌లో కనుగొన్నారు. ఈ శాసనాలు కనీసం మధ్యయుగ కాలం నాటివి; అయితే, అవి చైనాకు ఎలా వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి అనేది అస్పష్టంగానే ఉంది. [19]

సాంస్కృతిక విప్లవం లోను, ఆ తరువాతా హిందూత్వం

[మార్చు]
హిందూ రిలీఫ్, క్వాన్జౌ మ్యూజియం

చైనాలో కమ్యూనిజం పెరుగుదల సమయంలో చైనాలోని హిందూమతం మరిన్ని అడ్డంకులను ఎదుర్కొంది, చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏ మతాచరణనైనా సరే నిరుత్సాహపరిచింది. దాన్ని సోషలిస్టు వ్యతిరేకమైనదిగా పరిగణించింది. అలాగే భూస్వామ్య, విదేశీ వలసవాదానికి చిహ్నంగా పరిగణించింది. 1966 నుండి 1977 వరకు జరిగిన కమ్యూనిస్ట్ సాంస్కృతిక విప్లవం సమయంలో, అన్ని మతాలకు చెందిన ప్రజలూ హింసకు గురయ్యారు. ఈ సమయంలో, అనేక మతపరమైన భవనాలను, సేవలనూ మూసివేసారు. ఆ భవనాలను భౌతిక సేవల కోసం తిరిగి ఉపయోగించారు. అయితే, 1977 నుండి, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా రాజ్యాంగంపై సంతకం చేయడంతో ప్రభుత్వం మతంపై నున్న ఆంక్షలను కొంత సడలించింది. చైనీయులు తమ మతపరమైన, వ్యక్తిగత విశ్వాసాలను పాటించేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయినప్పటికీ, ప్రభుత్వం ఇప్పటికీ ఇతర మతపరమైన కార్యకలాపాలపై చాలా అనుమానాస్పదంగా ఉంటుంది -ప్రత్యేకించి అందులో విదేశాల ప్రమేయం ఉంటే.

చాలా మంది చైనీస్ పర్యాటకులు తమ మొక్కులు తీర్చుకునేందుకు థాయ్‌లాండ్‌లోని ఫ్రా ఫ్రోమ్‌ని సందర్శిస్తారు.

చైనాలో హిందూమత ఆచరణ

[మార్చు]

అధికారికంగా గుర్తించబడిన ఐదు మతాలలో (బౌద్ధం, టావోయిజం, కాథలిక్ క్రిస్టియానిటీ, ప్రొటెస్టంట్ క్రిస్టియానిటీ, ఇస్లాం) హిందూయిజం ఒకటి కానప్పటికీ, చైనా అధికారికంగా లౌకిక రాజ్యమైనప్పటికీ, చైనాలో హిందూమత ఆచరణకు అనుమతి ఉంది. అయితే చలా పరిమిత స్థాయిలోనే ఉంది. హిందూమతం భారతీయ సంస్కృతిలో ఉద్భవించినప్పటికీ, చైనా సంస్కృతిపై వైదిక సంప్రదాయ ప్రభావం ఉంది.

చైనా ప్రధాన భూభాగం

[మార్చు]

అనేక మంది హిందూ ప్రవాసులు చైనాలో నివసిస్తున్నారు. మూల వాసులైన చైనీస్ జనాభాలో కూడా హిందూ కుటుంబాలు ఉన్నాయి. వారి సంఖ్య సాపేక్షంగా తక్కువ. అందువల్ల చైనాలో అధికారికంగా గుర్తింపు పొందిన ఐదు మత సంస్థలలో హిందూమతం లేదు. వారు స్థానిక చైనీస్ అధికారులతో బాగా సహకరించే శాంతియుత ప్రజలు. చైనా ప్రధాన భూభాగంలో కూడా దేశవ్యాప్తంగా తమ మతాన్ని సురక్షితంగా ఆచరించడానికి వారికి అనుమతి ఉంది.

న్యూఢిల్లీ, గాంధీనగర్‌లోని అక్షరధామ్ దేవాలయాలను పోలిన ఆలయాన్ని చైనా ప్రధాన భూభాగంలో నిర్మించాలని చైనా ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వామినారాయణ్ ట్రస్ట్ (BAPS)ను ఆహ్వానించింది. 2007లో ఫోషాన్‌లో విశాలమైన భూమిని కేటాయించారు. దీన్ని ఆలయంగా మాత్రమే కాకుండా భారతీయ సాంస్కృతిక కేంద్రానికి నిలయంగా ఉండేందుకు కూడా ఉద్దేశించారు. [20] [21] చైనాలో బాలినీస్ హిందూ దేవాలయాన్ని కూడా నిర్మించాలని ప్లాన్ చేశారు. [22]


అంతర్జాతీయ కృషచౌతన్య సంఘం (ఇస్కాన్) చైనా ప్రధాన భూభాగంలో కలిగి ఉంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో భక్తుల చిన్న సమూహాలు ఉన్నాయి. ISKCON చైనాలో యోగా, ధ్యానాలను బోధిస్తుంది. గ్వాంగ్‌డాంగ్ టెలివిజన్‌లో సంస్థ గురించిన కార్యక్రమాన్ని ప్రసారం చేసారు. [23] [24]

హాంకాంగ్‌లో హిందూమతం

[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా ప్రధాన గౌడియ వైష్ణవ సంస్థ అయిన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) హాంకాంగ్‌లో 1981లో ఒక కేంద్రాన్ని స్థాపించింది. [25] 2016 నాటికి, హాంకాంగ్ నివాసితులలో దాదాపు 1.4% మంది హిందూమతాన్ని ఆచరిస్తున్నారు; వీరిలో ప్రవాసులు, జీవితకాల అభ్యాస పౌరులు, ఇతరులూ ఉన్నారు.

క్వాన్‌జౌలో హిందూ వారసత్వం

[మార్చు]
క్వాన్‌జౌ హిందూ దేవాలయంలో శివుని చెక్కడం
మధ్యయుగ చైనాలో హిందూమతం ఉనికికి పురావస్తు ఆధారాలు లభించే చైనా ప్రాంతం.

చైనాలోని హిందూమతానికి సంబంధించిన ఆధారాలు ఫుజియాన్ ప్రావిన్స్‌లోని క్వాన్‌జౌలో లభించాయి. [26] మధ్యయుగ చైనాలో హిందూ సమాజం, మరీ ముఖ్యంగా, తమిళ హిందూ వ్యాపారులు ఉండేవారని ఈ ఆధారాలు సూచిస్తున్నాయి. [27] ఈ ఆధారాల్లో సా.శ. 1281 ఏప్రిల్ నాటి తమిళ-చైనీస్ ద్విభాషా శాసనం ఒకటి. ఇది శివునికి అంకితం చేయబడింది. అలాగే 1933 నుండి ఫుజియాన్ ప్రావిన్స్‌లో కనుగొనబడిన 300 కంటే ఎక్కువ కళాఖండాలు, విగ్రహాలు, చోళ-శైలి ఆలయ నిర్మాణాలు కూడా ఈ ఆధారాల్లో భాగమే.[28] పురావస్తు అధ్యయనాల్లో హిందూమతం లోని వైష్ణవ, శైవమత శాఖలు చైనాకు వచ్చాయని తెలుస్తోంది. [29]

ప్రస్తుతం క్వాన్‌జౌలో హిందువులు లేరు. అయితే, 13వ శతాబ్దం చివరలో, కైయువాన్ శివాలయాన్ని నిర్మించిన తమిళ హిందూ సమాజం గతంలో నగరంలో ఉండేది. [30] ఈ ఆలయం ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. అయితే 300 కంటే ఎక్కువ శిల్పాలు ఇప్పటికీ నగరంలో ఉన్నాయి. [31] చాలా వరకు ప్రస్తుతం క్వాన్‌జౌ మ్యూజియంలో ప్రదర్శనలో ఉన్నాయి. కొన్ని కైయువాన్ బౌద్ధ దేవాలయంలో భాగమై పోయాయి. [30] దాని ప్రధాన హాలు "మహావీర హాల్" వెనుక, కొన్ని హిందూమత శిల్పాలతో అలంకరించబడిన కొన్ని నిలువు వరుసలు ఉన్నాయి. ఈ శిల్పాలు క్వాన్‌జౌ లోని, దాని పొరుగు ప్రాంతాలలోని ఐదు ప్రాథమిక ప్రదేశాలలో ఉన్నాయి. [30] అవి దక్షిణ భారత శైలిలో తయారు చేయబడ్డాయి. తమిళనాడులోని కావేరీ డెల్టా ప్రాంతంలో నిర్మించిన 13వ శతాబ్దపు ఆలయాలతో వాటికి దగ్గరి పోలికలున్నాయి. [30] దాదాపు అన్ని చెక్కడాలు ఆకుపచ్చ-బూడిద గ్రానైట్‌ రాతిలోనే చెక్కారు. ఇది సమీపంలోని కొండలలో విస్తృతంగా దొరుకుతుంది. ఈ ప్రాంతం నిర్మాణాల్లో ఉపయోగించబడ్డాయి. [30] క్వాన్‌జౌ ఆలయంలో చిత్రీకరించబడిన శైవ శిల్పాలలో గజారణ్య క్షేత్రం కథ, లింగానికి అభిషేకం చేస్తున్న ఆవు ద్వారా చిత్రీకరించబడిన శైవ సన్యాసి తిరుమూలర్ కథ, ఆంధ్రకు చెందిన రెండు హిందూ మల్లయోధుల కథలూ ఉన్నాయి.[32]

శివునితో పాటు, నంజియాచాంగ్ ప్రాంతంలో విష్ణు శిల్పాన్ని కూడా కనుగొన్నారు. కైయువాన్ ఆలయంపై ఉన్న రెండు స్తంభాలలో విష్ణుమూర్తికి చెందినవి ఏడు చిత్రాలు ఉన్నాయి: గరుడుడు, నరసింహ అవతారం, గజేంద్ర మోక్ష పురాణాన్ని వర్ణించేది, లక్ష్మి, కృష్ణుడు గోపికల దుస్తులను అపహరించడం, కాళియమర్దన ఘట్టం, మహాభారతంలో కృష్ణుడు -ఈ చిత్రాలు. [33][34]

నోట్స్

[మార్చు]
  1. (U+5535)

మూలాలు

[మార్చు]
  1. Huang Xinchuan (1986), Hinduism and China, in Freedom, Progress, and Society (Editors: Balasubramanian et al.), ISBN 81-208-0262-4, pp. 125-138
  2. John Kieschnick and Meir Shahar (2013), India in the Chinese Imagination - Myth, Religion and Thought, ISBN 978-0812245608, University of Pennsylvania Press
  3. W.W. Rockhill (1914), Notes on the relations and trade of China with the Eastern Archipelago and the coasts of Indian Ocean during the 14th century", T'oung-Pao, 16:2
  4. T.N. Subramaniam (1978), A Tamil Colony in Medieval China, South Indian Studies, Society for Archaeological, Historical and Epigraphical Research, pp 5-9
  5. John Guy (2001), The Emporium of the World: Maritime Quanzhou 1000-1400 (Editor: Angela Schottenhammer), ISBN 978-9004117730, Brill Academic, pp. 294-308
  6. Fan, Ye (2009). Through the jade gate to Rome : a study of the silk routes during the Later Han Dynasty 1st to 2nd centuries CE : an annotated translation of the chronicle on the 'Western Regions' in the Hou Hanshu. John E. Hill. Charleston, South Carolina: BookSurge Publishing. ISBN 978-1-4392-2134-1. OCLC 489476373.
  7. "佛教二十四诸天". 中国佛教文化网. 2010-09-01. Archived from the original on 2016-03-04. Retrieved 2013-11-27.
  8. "详解佛教中的二十四诸天". 腾讯. 2013-08-21. Archived from the original on 2018-11-07. Retrieved 2013-11-27.
  9. Wu, Cheng'en, approximatelyapproximately 1582 (2012). The journey to the West. Anthony C. Yu (Revised ed.). Chicago. ISBN 978-0-226-97131-5. OCLC 774147887.{{cite book}}: CS1 maint: location missing publisher (link) CS1 maint: multiple names: authors list (link) CS1 maint: numeric names: authors list (link)
  10. 10.0 10.1 10.2 A dictionary of Chinese Buddhist terms : with Sanskrit and English equivalents and a Sanskrit-Pali index. Lewis Hodous, William Edward Soothill. London: RoutledgeCurzon. 2004. ISBN 0-203-64186-8. OCLC 275253538.{{cite book}}: CS1 maint: others (link)
  11. Chinese Nezha has been traced to Hinduism's Nalakubara
  12. "Hindu Wisdom - India and China". Surya's Tapestry. Archived from the original on 2020-02-17. Retrieved 2021-11-26.
  13. Sherring and Longstaff (1936), Western Tibet and the British borderland - The Sacred Country of Hindus and Buddhists Edward Arnold, London
  14. [1]
  15. Huang Xinchuan (1986), Hinduism and China, in Freedom, Progress, and Society (Editors: Balasubramanian et al.), ISBN 81-208-0262-4, pp. 125-138
  16. Huang Xinchuan (1986), Hinduism and China, in Freedom, Progress, and Society (Editors: Balasubramanian et al.), ISBN 81-208-0262-4, pp. 125-138
  17. Hajime Nakamura (1989), A History of Early Vedānta Philosophy, p. 142, గూగుల్ బుక్స్ వద్ద, ISBN 978-8120806511, pp. 142
  18. Catherine Ludvik, A Harivaṃśa Hymn in Yijing's Chinese Translation of the Sutra of Golden Light, Journal of the American Oriental Society, Vol. 124, No. 4 (Oct. - Dec., 2004), pp. 707-734
  19. Walter Liebenthal (1947), SANSKRIT INSCRIPTIONS FROM YUNNAN I: (AND THE DATES OF FOUNDATION OF THE MAIN PAGODAS IN THAT PROVINCE), Monumenta Serica, Vol. 12, (1947), pp. 1-40
  20. Ved P. Chaudhary, Ph.D. "First Hindu Temple to be Built in China". ISKCON News. Archived from the original on 2010-11-27.
  21. NDTV. "Swaminarayan Trust Invited to Build Akshardham in China". Hinduism Today. Archived from the original on 2016-10-24. Retrieved 2021-11-26.
  22. "China working with Balinese Hindus to build temple in Middle Kingdom | Coconuts Bali". 20 July 2018.
  23. ISKCON Narasimha Giridhari Mandir. "ISKCON Features on China National Television". Archived from the original on 2018-09-23. Retrieved 2021-11-26.
  24. Guangdong Television. "2013品质生活瑜伽" (in చైనీస్). Archived from the original on 2015-07-12. Retrieved 2021-11-26.
  25. ISKCON Hong Kong. "ISKCON Hong Kong". Archived from the original on July 13, 2015. Retrieved July 11, 2015.
  26. Richard Pearson, Li Min and Li Guo (2002), Quanzhou Archaeology: A Brief Review, International Journal of Historical Archaeology, Vol. 6, No. 1, pp. 23-34
  27. H. Ray (1989), Indian Settlements in Medieval China - A Preliminary Study, The Indian Journal of Asian Studies, 1:1, pp. 68-82
  28. John Guy, “The Lost Temples of Nagapattinam and Quanzhou: A Study in Sino- Indian Relations”, Silk Road Art and Archaeology, Vol. 3 (1993/1994)
  29. John Guy (2001), The Emporium of the World: Maritime Quanzhou 1000-1400 (Editor: Angela Schottenhammer), ISBN 978-9004117730, Brill Academic, pp. 294-308
  30. 30.0 30.1 30.2 30.3 30.4 Nagapattinam to Suvarnadwipa: reflections on Chola naval expeditions to Southeast Asia (2009), Hermann Kulke, K. Kesavapany, Vijay Sakhuja, Institute of Southeast Asian Studies, p. 240
  31. Nagapattinam to Suvarnadwipa: reflections on Chola naval expeditions to Southeast Asia (2009), Hermann Kulke, K. Kesavapany, Vijay Sakhuja, Institute of Southeast Asian Studies, p. 240
  32. John Guy (2001), The Emporium of the World: Maritime Quanzhou 1000-1400 (Editor: Angela Schottenhammer), ISBN 978-9004117730, Brill Academic, pp. 294-308
  33. John Guy (2001), The Emporium of the World: Maritime Quanzhou 1000-1400 (Editor: Angela Schottenhammer), ISBN 978-9004117730, Brill Academic, pp. 294-308
  34. John Guy, “The Lost Temples of Nagapattinam and Quanzhou: A Study in Sino- Indian Relations”, Silk Road Art and Archaeology, Vol. 3 (1993/1994)