చౌటుప్పల్ రెవెన్యూ డివిజను
చౌటుప్పల్ రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | యాదాద్రి భువనగిరి |
చౌటుప్పల్ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. యాదాద్రి భువనగిరి జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజన్ పరిపాలనలో 5 మండలాలు ఉన్నాయి. ఈ డివిజన్ ప్రధాన కార్యాలయం చౌటుప్పల్ పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా ఈ రెవెన్యూ డివిజను ఏర్పాటయింది.[1] ఈ రెవెన్యూ డివిజను భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం, మునుగోడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉంది.
జిల్లా వివరాలు
[మార్చు]జిల్లాలో మొత్తం 17 మండలాలు ఉండగా, అందులో 12 మండలాలు భువనగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో, 5 మండలాలు చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నాయి. జిల్లా జనాభా 7,70,833 కాగా భౌగోళికంగా 3,795 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 17 మండలాలు, 321 రెవెన్యూ గ్రామాలు, 421 గ్రామపంచాయతీలు, ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి.[2]
పరిపాలన
[మార్చు]చౌటుప్పల్ డివిజను లోని మండలాలు:
క్ర.సం | చౌటుప్పల్ రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | భూదాన్ పోచంపల్లి మండలం | 23 రెవెన్యూ గ్రామాలు |
2 | రామన్నపేట మండలం | 21 రెవెన్యూ గ్రామాలు |
3 | వలిగొండ మండలం | 35 రెవెన్యూ గ్రామాలు (ఒకటి నిర్జన గ్రామం) |
4 | చౌటుప్పల్ మండలం | 17 రెవెన్యూ గ్రామాలు |
5 | నారాయణపూర్ మండలం | 14 రెవెన్యూ గ్రామాలు |
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 27 January 2022.
- ↑ "కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఆలేరు!". andhrajyothy. Archived from the original on 2022-01-28. Retrieved 27 January 2022.