Jump to content

జనగాం రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
జనగాం రెవెన్యూ డివిజను
జనగాంలోని అంబేద్కర్ కూడలి
జనగాంలోని అంబేద్కర్ కూడలి
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాజనగామ

జనగాం రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, జనగాం జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. జనగామ జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 7 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం జనగాం పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం, జనగాం శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.

వివరాలు

[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]

పరిపాలన

[మార్చు]

జనగాం డివిజనులోని మండలాలు:[4]

క్ర.సం జనగాం రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 జనగాం మండలం 20 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
2 లింగాల ఘన్‌‌పూర్‌ మండలం 14 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
3 బచ్చన్నపేట మండలం 23 రెవెన్యూ గ్రామాలు
4 దేవరుప్పుల మండలం 13 రెవెన్యూ గ్రామాలు
5 నర్మెట్ట మండలం 8 రెవెన్యూ గ్రామాలు
6 తరిగొప్పుల మండలం 8 రెవెన్యూ గ్రామాలు
7 రఘునాథపల్లి మండలం 19 రెవెన్యూ గ్రామాలు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-05-31.
  3. "Revenue Mandals | JANGAON DISTRICT | India". www.jangaon.telangana.gov.in. Archived from the original on 2021-04-19. Retrieved 2022-05-30.
  4. "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2022-05-31.