Jump to content

జయసూర్య (సినిమా)

వికీపీడియా నుండి
జయసూర్య
దర్శకత్వంసుశీంద్రన్‌
స్క్రీన్ ప్లే
  • సుశీంద్రన్‌
  • అరుణ్ బాలాజీ
కథసుశీంద్రన్‌
నిర్మాతజి. నాగేశ్వరరెడ్డి, ఎస్‌. నరసింహప్రసాద్‌
తారాగణంవిశాల్, కాజల్ అగర్వాల్, సముద్రఖని, నిఖిత
ఛాయాగ్రహణంవేల్‌ రాజ్‌
కూర్పుఆంటోనీ
సంగీతండి. ఇమ్మాన్
నిర్మాణ
సంస్థ
శర్వాంత్ రామ్ క్రియేషన్స్
విడుదల తేదీ
4 సెప్టెంబరు 2015 (2015-09-04)
సినిమా నిడివి
135 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

జయసూర్య 2015లో తెలుగులో విడుదలైన పొలిటికల్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమా. ఈ సినిమా తమిళంలో పాయుం పులి పేరుతో విడుదలైంది. శర్వాంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై జి.నాగేశ్వర్ రెడ్డి, ఎస్.నరసింహ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు సుశీంద్రన్ దర్శకత్వం వహించాడు. విశాల్, కాజల్ అగర్వాల్, సముద్రఖని, నిఖిత, సూరి, రాజసింహన్, ఐశ్వర్య దత్త ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 4 సెప్టెంబర్ 2015న విడుదలైంది.[1]

గుంటూరులో భవాని అనే ఓ రౌడీ గ్యాంగ్ ధనవంతులైన వ్యాపారవేత్తలను డబ్బు కోసం వేధిస్తూ హత్యలు చేస్తుంటాడు. ఈ ముఠాని పట్టుకోవాలని ట్రై చేసిన ఎస్‌ఐ ఆల్బర్ట్ (హరీష్) ని చంపేస్తారు. దాంతో ఆ భవాని గ్యాంగ్ ని ఫినిష్ చేయాలనీ సీక్రెట్ మిషన్ పై వైజాగ్ నుంచి అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ అయిన జయసూర్య(విశాల్) రంగంలోకి దిగుతాడు. అండర్‌ కవర్‌లో వచ్చిన జయసూర్య (విశాల్‌) ఆ ముఠాని మొత్తం ఏరి పారేస్తాడు. కానీ హత్యలు ఆగవు. అప్పుడే కథలోకి శ్రీను (సముద్రఖని) వస్తాడు. అసలు ఈ శ్రీను ఎవరు ? ఈ కథకి, జయసూర్యకి శ్రీనుకి ఉన్న సంబంధం ఏమిటి ? అనేదే మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (4 September 2015). "Jayasurya Movie: Showtimes". Archived from the original on 30 August 2021. Retrieved 30 August 2021.
  2. 123 TElugu (5 September 2015). "Jayasurya Telugu Movie Review". Archived from the original on 30 August 2021. Retrieved 30 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. CineJosh (5 September 2015). "సినీజోష్‌ రివ్యూ: జయసూర్య". Archived from the original on 30 August 2021. Retrieved 30 August 2021.