జస్పాల్ రాణా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు వారి పురస్కారాన్ని అందుకుంటూ జస్పాల్ రాణా

1976, జూన్ 28న జన్మించిన జస్పాల్ రాణా (Jaspal Rana) భారతదేశానికి చెందిన ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు . ఇతడు ముఖ్యంగా 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ విభాగంలో ప్రసిద్ధుడు. 1994 ఆసియా క్రీడలలో, 2006 కామన్వెల్త్ క్రీడలలో, 2006 ఆసియా క్రీడలలో షూటింగ్‌లో స్వర్ణపతకాలను సాధించాడు. ప్రస్తుతం డెహ్రాడూన్ లో జస్పాల్ రాణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ టెక్నాలజీలో శిక్షకుడిగా వ్యహరిస్తున్నాడు.

క్రీడాజీవితం[మార్చు]

జస్పాల్ రాణా ముఖ్యంగా సెంటర్ పిస్టల్ విభాగంలో ప్రధాన విజయాలను సాధించిననూ ఎయిర్ పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్, ఫ్రీ పిస్టల్, ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ వుభాగాలలోనే రాణించాడు. అన్ని విభాగాలను కలిపి రాణా 600కు పైగా జాతీయ, అంతర్జాతీయ పతకాలను సాధించాడు.

1994లో జపాన్ లోని హీరోషిమాలో జరిగిన ఆసియా క్రీడలలో రాణా స్వర్ణపతకాన్ని ఎగరేసుకొచ్చాడు. 2006 కామన్వెల్త్ క్రీడలలో సమరేశ్ జంగ్ తో కలిసి 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ (పెయిర్స్) విభాగంలో స్వర్ణపతకాన్ని సాధించగా, అదే ఏడాది దోహలో జరిగిన ఆసియా క్రీడలలో 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ విభాగంలో 590 పాయింట్లను నమోదుచేసి బంగారు పతకాన్ని సాధించడమే కాకుండా ప్రపంచ రికార్డును కూడా సమం చేశాడు. 1995లో కోయంబత్తూరులోనూ, 1997లో బెంగుళూరు జాతీయ క్రీడలలోనూ అతడు ఇదే స్కోరును సాధించాడు. 2006 ఆసియా క్రీడలలో 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ విభాగంలో మళ్ళీ స్వర్ణాన్ని సాధించాడు.

అవార్డులు, గుర్తింపులు[మార్చు]

రాజకీయాలు[మార్చు]

2006 ఆసియా క్రీడల అనంతరం జస్పాల్ రాణా రాజకీయాలలో చేరాడు. ప్రస్తుతం అతడు భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]