జాగ్వార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిఖిల్ కుమార్ (నిఖిల్ కుమారస్వామి)

జాగ్వార్ 2016 లో విడుదలైన కన్నడ డబ్బింగ్ సినిమా. కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్. డి. కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ ఈ చిత్రంలో హీరో

కథ[మార్చు]

ఎస్‌.ఎస్‌.టీవీ చానెల్‌లో జడ్జి(రవి కాలే) హత్య లైవ్‌ టెలికాస్ట్‌ కావడంతో ప్రజలందరితో పాటు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అటెన్షన్‌కు గురవుతుంది. చానెల్ టి.ఆర్.పి రేటింగ్ పెరుగుతుంది. పోలీసులు హంతుకుడిని పట్టుకోవాలని ప్రయత్నించినా అతను తప్పించుకుని పారిపోతాడు. హత్య కేసును స్పెషల్ కేసుగా భావించి, డీల్‌ చేయమని సిబిఐ ఆఫీసర్‌(జగపతిబాబు)కు అప్పగిస్తారు. జగపతిబాబు కేసుకు, హంతకుడికి జాగ్వార్‌ అని పేరు పెట్టి దర్యాప్తు ప్రారంభిస్తాడు. కథ ఇలా సాగుతుండగా, సిటీలోనే పెద్ద కార్పొరేట్‌ హాస్పిటల్‌ శాంతి మెడికల్‌ కాలేజ్‌కు ఛైర్మన్‌(ఆదిత్య మీనన్‌)గా ఉంటాడు. ఇతనితో పాటు ఎస్‌.ఎస్‌ చానెల్‌ అధినేత శౌర్య ప్రసాద్‌ కూడా శాంతి మెడికల్‌ కాలేజ్‌లో పార్ట్‌‌నర్‌గా ఉంటాడు. శాంతి మెడికల్‌ కాలేజ్‌లో ఎస్‌.ఎస్‌.కృష్ణ(నిఖిల్‌కుమార్‌) ఎం.బి.బి.ఎస్‌ మొదటి సంవత్సరంలో జాయిన్‌ అవుతాడు. ఆ కాలేజ్‌లో యువకులందరికీ లీడర్‌గా ఉన్న ఆర్య(ఆదర్శ్‌) చెల్లెలు ప్రియా(దీప్తి సేథీ)ని నిఖిల్‌ ప్రేమిస్తాడు. ప్రియా కూడా నిఖిల్‌ను ప్రేమిస్తుంది. హాస్పిటల్‌లోని డబ్బుకోసం జరుగుతున్న అన్యాయాలను చూసిన ఆర్య మేనేజ్‌‌మెంట్‌కు ఎదురుతిరిగి ధర్నా చేస్తాడు. ధర్నాను ఆపడానికి వచ్చిన ఎన్‌కౌంటర్‌ శంకర్‌(సుప్రీత్‌)ను జాగ్వార్‌ చంపేస్తాడు. హత్యా స్థలానికి చేరుకున్న సిబిఐ ఆఫీసర్‌ ఫోన్‌కు ఓ మెసేజ్ వస్తుంది. చేసిన హత్యలతో పాటు కృష్ణ, ఎస్‌.ఎస్‌. చానెల్‌ అధినేత, శాంతి మెడికల్‌కాలేజ్‌ ఛైర్మన్‌, అతని కొడుకు అజయ్‌ను కూడా చంపేస్తానని ఆర్య ఫోన్‌ నుండి అందరికీ ఎం.ఎం.ఎస్‌ వస్తుంది. దాంతో అందరూ ఆర్యనే జాగ్వార్‌గా అందరినీ చంపుతున్నాడని అనుకుంటారు. కానీ కథ మలుపు తిరుగుతుంది. కృష్ణను, ఆర్య ఎందుకు చంపాలనుకుంటాడు? అసలు రామచంద్రయ్య ఎవరు? రామచంద్రయ్య, ఆర్య, కృష్ణ మధ్య రిలేషన్‌ ఏంటి? అసలు జాగ్వార్‌ హత్యలెందుకు చేస్తున్నాడు? అనే విషయాలు మిగిలిన కథ.[1]

నటులు[మార్చు]

పాటలు[మార్చు]

  • నమ్మావే బుజ్జి తల్లి, రాహుల్ నంబియార్
  • గెట్ సెట్ గో రెడీ , రంజిత్
  • అందానికి సెల్ఫివే , మిఖసింఘ్ , కనికాకపూర్
  • మా మా మామా సీత , కార్తీక్ , మేఘ
  • మందార తైలం , దీపక్ సంజన

సాంకేతికవర్గం[మార్చు]

  • నిర్మాణ సంస్థ: చన్నాంభిక ఫిలింస్
  • సమర్పణ: హెచ్‌.డి. కుమారస్వామి
  • కథ: విజయేంద్ర ప్రసాద్‌
  • చాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస
  • సంగీతం: యస్‌.యస్‌. తమన్‌
  • కూర్పు: రూబిన్
  • ఆర్ట్‌: నారాయణరెడ్డి
  • సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
  • పోరాటాలు‌: రవివర్మ, రామ్‌-లక్ష్మణ్‌, కలోయాన్‌ (బల్గేరియా), సెల్వ
  • నిర్మాత: శ్రీమతి అనితా కుమారస్వామి
  • స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: ఎ. మహదేవ్‌.

మూలాలు[మార్చు]

లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జాగ్వార్&oldid=4005045" నుండి వెలికితీశారు