జాతీయ న్యాయ పాఠశాలలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు లేదా జాతీయ న్యాయపాఠశాలలు భారతదేశంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అభీష్టం మేరకు న్యాయవిద్యపై వచ్చిన సంస్కరణల మూలంగా ఏర్పాటయిన విద్యా సంస్థలు. భారత ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ఈ విద్యాసంస్థలను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్ర న్యాయవ్యవహారాల మంత్రిత్వశాఖ నియంత్రిస్తున్నాయి. మొదటి జాతీయ న్యాయ విశ్వవిద్యాయం బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ 1988లో ప్రారంభమయ్యింది. అప్పటి నుండి ప్రతి రాష్ట్రంలోను ఒక జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. ఈ విద్యాసంస్థలు ఉన్నత ప్రమాణాలతో నడుస్తున్నాయి.

చారిత్రక నేపథ్యం

[మార్చు]

మనదేశంలో 20వ శతాబ్దపు చివరి దశకం వరకూ న్యాయవిద్యను సాంప్రదాయబద్ధమైన విశ్వవిద్యాలయాలలో ఇతర డిగ్రీ కోర్సులవలె నేర్పించేవారు. ఈ విశ్వవిద్యాలయాలు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచించిన పాఠ్యాంశాలను బోధించేవారు కానీ ఈ కోర్సులపై అజమాయిషీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్‌కు ఉండేది. దానితో బార్ కౌన్సిల్‌కు న్యాయవిద్యపై సంస్కరణలు తీసుకురావడానికి అవకాశం ఉండేది కాదు. 1984లో బార్ కౌన్సిల్ న్యాయవిద్యను నవీకరించడానికి "న్యాయ విద్యా కమిటీ"ని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫారసుల్లో ముఖ్యమైనది న్యాయ సంబంధ విద్యకోసం ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయటం. న్యాయవాద వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడం, వైద్య, ఇంజనీరింగు విద్యలవలే ఆకర్షణీయమైన విద్యగా న్యాయవిద్యను రూపొందించడం వంటివి ఆ కమిటీ సిఫారసు చేసింది.

జాతీయ న్యాయపాఠశాలల నిర్మాణక్రమం

[మార్చు]

అంతవరకు ఉన్న న్యాయవిద్యకు భిన్నంగా స్వయంప్రతిపత్తి కలిగిన న్యాయపాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయబడ్డాయి. ఐదు సంవత్సరాల డిగ్రీ కోర్సు, న్యాయవిద్యతో పాటు బి.ఎ., బి.ఎస్.సి, బి.కామ్‌, బి.బి.ఎ. వంటి వాటిని కలిపి ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ కోర్సు వంటివి ప్రవేశపెట్టారు. న్యాయకళాశాలలకు జాతీయ హోదా కల్పించారు. ఈ విద్యాసంస్థలలో భారత ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తులు వంటి వారిని విజిటింగ్ ప్రొఫెసర్లుగా, కొన్ని సందర్భాలలో ఉపకులపతులుగా సమాయత్త పరిచి ఈ విద్యాసంస్థల స్థాయిని పెంచారు.

జాతీయ న్యాయపాఠశాలల జాబితా

[మార్చు]
  1. భారత జాతీయ న్యాయ విద్యాలయం, బెంగళూరు
  2. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్
  3. జాతీయ న్యాయ సంస్ధ విశ్వవిద్యాలయం, భోపాల్
  4. పశ్చిమ బెంగాల్ న్యాయశాస్త్రాల జాతీయ విశ్వవిద్యాలయం, కోల్‌కాతా
  5. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, జోధ్‌పూర్
  6. హిదయతుల్లా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, రాయ్‌పూర్
  7. గుజరాత్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, గాంధీనగర్
  8. డా. రామ్ మనోహర్ లోహియా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, లక్నో
  9. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్‌స్డ్ లీగల్ స్టడీస్, కొచ్చి
  10. రాజీవ్ గాంధీ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, పాటియాలా
  11. చాణుక్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, పాట్నా
  12. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, న్యూ ఢిల్లీ
  13. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, ఒడిషా కటక్
  14. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
  15. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ లా, రాంచీ
  16. జాతీయ న్యాయ పాఠశాల & జుడీషియల్ అకాడమీ, అస్సాం గౌహతి
  17. తమిళనాడు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, తిరుచ్చి
  18. మహారాష్ట్ర జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, ముంబై
  19. మహారాష్ట్ర జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, నాగపూర్
  20. మహారాష్ట్ర జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, ఔరంగాబాద్
  21. హిమాచల్ ప్రదేశ్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, సిమ్లా
  22. ధర్మశాస్త్ర జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, మధ్యప్రదేశ్, జబల్‌పూర్
  23. డా.బి.ఆర్.అంబేద్కర్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, హర్యానా, సోనిపట్

వనరులు

[మార్చు]

http://te.pragatipedia.in/e-governance/online-legal-services/national-law-schools[permanent dead link]