జాతీయ రహదారి 46
National Highway 46 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
Part of AH47 | ||||
పొడవు | 634 కి.మీ. (394 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
ఉత్తర చివర | గ్వాలియర్ | |||
దక్షిణ చివర | బేతుల్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | మధ్య ప్రదేశ్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 46 (ఎన్‌హెచ్ 46) భారతదేశంలో ఒక ప్రాథమిక జాతీయ రహదారి. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో గ్వాలియర్ నుండి బేతుల్ వరకు నడుస్తుంది.[1] ఈ జాతీయ రహదారి పొడవు 634 కి.మీ. (394 మై.).[2] జాతీయ రహదారుల సంఖ్యలను మార్చడానికి ముందు, ఎన్‌హెచ్-46 పాత జాతీయ రహదారులు 3, 12 & 69 గా ఉండేది.[3] ఈ రహదారిలోని గ్వాలియర్ - బియోరా విభాగం, ఆగ్రా - బాంబే రోడ్‌లో భాగం, దీనిని AB రోడ్ అని కూడా అంటారు.
మార్గం
[మార్చు]ఎన్‌హెచ్46 గ్వాలియర్, శివపురి, గుణ, బియోరా, భోపాల్, ఒబేదుల్లగంజ్, హోషంగాబాద్‌లను కలుపుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ వద్ద ముగుస్తుంది. [4]
- ఎన్‌హెచ్ 44 గ్వాలియర్ వద్ద ముగింపు.
- ఎన్‌హెచ్ 27 శివ్‌పురి వద్ద
- ఎన్‌హెచ్ 752B గుణ వద్ద
- ఎన్‌హెచ్ 52 గుణ వద్ద
- ఎన్‌హెచ్ 346 ఝార్ఖేడా వద్ద
- ఎన్‌హెచ్ 86 భోపాల్ వద్ద
- ఎన్‌హెచ్ 146 భోపాల్ వద్ద
- ఎన్‌హెచ్ 45 ఒబేదుల్లాగంజ్ వద్ద
- ఎన్‌హెచ్ 146B బుధ్‌నీ వద్ద
- ఎన్‌హెచ్ 47 బేతుల్ వద్ద ముగింపు
ఆసియా రహదారులు
[మార్చు]జాతీయ రహదారి 46 లో గ్వాలియర్ నుండి బియోరా వరకు ఉన్న భాగం, ఆసియా రహదారి 47 లో భాగం. AH47 బియోరా నుండి ఎన్‌హెచ్52 వెంట సాగుతుంది. [5]
మరింత విస్తరణ
[మార్చు]2025 నాటికి, ఎన్‌హెచ్46 ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా వరకు విస్తరించడానికి ప్రణాళిక వేసారు. ఈ ప్రాజెక్టు కోసం గ్వాలియర్ నుండి భింద్ మీదుగా ఎటావా వరకు నడుస్తున్న ఎన్‌హెచ్719 4 వరుసల హైవేగా ఉన్నతీకరించి, ఎన్‌హెచ్46 తో విలీనం చేస్తారు. ఈ పని పూర్తయిన తర్వాత ఎన్‌హెచ్46 పొడవు 750 కిలోమీటర్లు (470 మై.) అవుతుంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 31 March 2012. Retrieved 3 April 2012.
- ↑ "The List of National Highways in India" (PDF). Ministry of Road Transport and Highways. Retrieved 4 January 2020.
- ↑ "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 4 January 2020.
- ↑ "State-wise length of National Highways (NH) in India as on 30.11.2018". Ministry of Road Transport and Highways. Archived from the original on 4 June 2019. Retrieved 4 January 2020.
{{cite web}}
: Unknown parameter|country=
ignored (help) - ↑ "Asian Highway Database - Country wise". UNESCAP. Retrieved 4 January 2020.