జాతీయ రహదారి 52
National Highway 52 | |
---|---|
మార్గ సమాచారం | |
Part of AH47 | |
పొడవు | 2,317 కి.మీ. (1,440 మై.) |
ముఖ్యమైన కూడళ్ళు | |
నుండి | సంగ్రూర్, పంజాబ్ |
వరకు | అంకోలా, కర్ణాటక |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | పంజాబ్ - హర్యానా - రాజస్థాన్ - మధ్య ప్రదేశ్ - మహారాష్ట్ర - కర్ణాటక |
రహదారి వ్యవస్థ | |
జాతీయ రహదారి 52 ( ఎన్‌హెచ్ 52 ) పంజాబ్ లోని సంగ్రూర్ నుండి కర్ణాటక లోని అంకోలా వరకు నడిచే జాతీయ రహదారి.[1] భారతదేశంలోని అనేక జాతీయ రహదారులను విలీనం చేసి జాతీయ రహదారి 52 ను ఏర్పరచారు. ఎన్‌హెచ్-63 నంబర్ గల పాత రహదారి కర్ణాటక లోని అంకోలా నుండి ఆంధ్రప్రదేశ్ లోని గుత్తి వరకు ఉండేది.[2] హైవే 52 అంకోలా వద్ద జాతీయ రహదారి 66 (పాత నంబర్ ఎన్‌హెచ్-17) జంక్షన్ వద్ద ప్రారంభమై, పశ్చిమ కనుమలలోని ఆరేబైల్ ఘాట్ వరకు, ఆపై ఎల్లపురాకు, హుబ్బల్లి (హుబ్లీ) నగరానికి వెళుతుంది.[3] పాత జాతీయ రహదారి 13 లోని విజయపుర (పాత పేరు బీజాపూర్) - షోలాపూర్ భాగాన్ని ఎన్‌హెచ్-52లో కలిపారు. హుబ్బళ్లి నగరానికి కార్వార్ రేవు, న్యూ మంగళూరు రేవు (NMPT) లకు వచ్చే లారీలు ఈ రహదారిని ఉపయోగిస్తాయి. అంకోలా నుండి ఎల్లపురా వరకు ఉన్న రహదారి భారతదేశంలోని పశ్చిమ కనుమల అడవుల గుండా ఉంది. ఈ రహదారి లోని బియోరా - ధూలే విభాగం, ఆగ్రా - బాంబే రోడ్‌లో భాగం. దీనిని AB రోడ్ అని కూడా అంటారు.
ప్రధాన పట్టణాలు
[మార్చు]పంజాబ్
[మార్చు]- సంగ్రూర్, దిర్బా, పట్రాన్
హర్యానా
[మార్చు]రాజస్థాన్
[మార్చు]- సదుల్పూర్/రాజ్‌గఢ్, చురు, రామ్‌గఢ్, ఫతేపూర్, లక్ష్మణ్‌ఘర్, సికర్, పల్సానా, రింగాస్, చోము, జైపూర్, టోంక్, బుండి, కోట, ఝలావర్, అక్లేరా
మధ్యప్రదేశ్
[మార్చు]మహారాష్ట్ర
[మార్చు]- ధూలే, చాలీస్‌గావ్, కన్నాడ్, ఔరంగాబాద్, జియోరాయ్, బీడ్, చౌసలా, ఉస్మానాబాద్, తులాజాపూర్, షోలాపూర్
కర్ణాటక
[మార్చు]- ధూలాఖేడ్, జల్కీ, హోర్టీ, అగసనల్, బీజాపూర్, కొల్హార్, బిలగి, బాగల్కోట్ , కేరూర్, నరగుండ్, నవల్గుండ్, హుబ్లీ, కలఘటగి, ఎల్లపురా, రామనాగులి, అంకోలా
ఇవి కూడా చూడండి
[మార్చు]- జాతీయ రహదారి 66 (భారతదేశం)
- జాతీయ రహదారి 75 (భారతదేశం)
- ఘాట్ రోడ్లు
మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 31 March 2012. Retrieved 3 April 2012.
- ↑ "National Highway 63". Maps of India. Retrieved 5 November 2019.
- ↑ "Arebail Ghat". The New Indian Express. Retrieved 30 April 2019.