జీడిపల్లి విఠల్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీడిపల్లి విఠల్ రెడ్డి
జననంజీడిపల్లి విఠల్ రెడ్డి
1922
India ఫరీదుపేట, మాచారెడ్డి, కామారెడ్డి
మరణంఆగస్టు 3, 2017
నివాస ప్రాంతంకామారెడ్డి, తెలంగాణ
వృత్తిస్వాతంత్ర సమరయోధుడు , రాజకీయ నాయకుడు, లాయర్.

జీడిపల్లి విఠల్ రెడ్డి ( 1922 - 2017 ) స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు, లాయర్ . కామారెడ్డి నియోజక వర్గానికి తొలి ఏమ్మెల్యే. ప్రచార ఆర్భాటాలు లేని, మచ్చ లేని రాజకీయాలకు ప్రతినిధి. ఆయన జీవితం తొలి తరం నేతలకు ప్రతీక. రాజకీయాలంటే నిస్వార్ధంగ్గా చేసే ప్రజాసేవ మాత్రమేనని నమ్మే విఠల్ రెడ్డి. ఒకానొక సమయంలో తానెంచుకున్న సిద్ధాంతాల కోసం రాజకీయాలను సైతం వదులుకున్న నిజాయితీపరుడు.[1]

బాల్యం[మార్చు]

ప్రస్తుత కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఫరీదుపేటలో జానకమ్మ - పాపిరెడ్డి దంపతులకు 1922లో జన్మించారు. వృత్తిరీత్యా వ్యవసాయం.

జీవిత విశేషాలు[మార్చు]

ఆగస్టు 14, 1947న స్వాతంత్ర్యం వచ్చిన నిజాం ప్రభుత్వం నుండి విముక్తి దొరకకపోవడంతో రైతులందరితో కలిసి ఉద్యమం కొనసాగించారు. అదే విదంగా అక్రమంగా నిల్వ ఉంచిన నిజాం గోదాంలపై రైతు లందరితో కలిసి వాటి ఫై దాడి చేసారు.ఈ దాడిలో నిజామాబాద్ జైల్లో శిక్ష కూడా అనుభవించారు. కానీ ఆయన ముక్కుసూటి తత్వంతో జైల్లో నిరాహార దీక్ష కొనసాగించారు. అది తీవ్రమవుతున్న సందర్భంలో ఇతన్ని ఔరంగబాద్ జైల్లోకి తరలించారు. భారత ప్రభుత్వం చేపట్టిన పోలీస్ చర్యతో 1947, సెప్టెంబర్ 17 హైదరాబాద్కి విముక్తి కలిగి భారత యూనియన్ లో విలీనం అయిపోయింది. ఇది జరిగిన పది రోజులకు జైల్ నుండి విడుదలయ్యారు.

రాజకీయ జీవితం[మార్చు]

1952 తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి ఘనవిజయం సాధించి 30 ఏళ్ళకే అసెంబ్లీ లో అడుగుపెట్టారు. ఎమ్మెల్యే అయిన చదువుకోవాలని జిజ్ఞాసతో ఉస్మానియా లో బి ఏ కోర్సులో చేరారు. ఉదయం అసెంబ్లీకి, సాయంత్రం డిగ్రీ తరగతులకు హాజరు అయ్యేవారు. 1957 ఎన్నికల్లో పోటీ చేయనని బహిరంగగా ప్రకటించాడు. కానీ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా వెంకట్రామిరెడ్డి పేరును సూచించి, ఆయనను గెలిపించారు. ఆయనను ఆన్ క్రౌన్ డ్ కింగ్ అని పిలిచేవారు. 1967 నుంచి క్రమంగా రాజకీయాలకు దూరం అయ్యారు. భార్య భూపుత్రమ్మ పేరు మీద ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించేవారు.

మరణం[మార్చు]

ఇతను తన 95 వ ఏటలో ఆగస్టు 3, 2017 న మరణించారు.[2]

మూలం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ 04 ఆగస్టు 2017
  2. జీడిపల్లి, జీడిపల్లి విఠల్ రెడ్డి. "నమస్తే తెలంగాణ". నమస్తే తెలంగాణ. Retrieved 11 August 2017.[permanent dead link]