జుంపా లహరి
జుంపా లహరి | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | నిలంజన సుధేష్ణా లహరి[1] 1967 జూలై 11 లండన్, యు.కె |
వృత్తి | రచయిత్రి |
జాతీయత | అమెరికన్ |
పూర్వవిద్యార్థి | బార్నాడ్ కళాశాల బోస్టన్న్ విశ్వవిద్యాలయం |
రచనా రంగం | నవల, లఘుకథ, వలసవాదం |
గుర్తింపునిచ్చిన రచనలు | ఇంటర్‌ప్రెటెర్ ఆఫ్ మలాడీస్ (1999)ద నేమ్‌సేక్ (2003)అన్‌అక్యుస్టొమెడ్ ఎర్త్ (2008) ద లో లాండ్ (2013) |
పురస్కారాలు | 1999 ఓ.హెన్రీ పురస్కారం 2000 పులిజెర్ ప్రైజ్ ఫర్ పిక్షన్ |
నిలంజన సుధేష్ణ "జుంపా" లహరి (Bengali: ঝুম্পা লাহিড়ী; జ.1967, జూలై 11) భారతీయ సంతతికి చెందిన అమెరికా రచయిత్రి. 1999 లో ఈమె రచించిన సంక్షిప్త కథల సంపుటి "ఇంటర్ ప్రిటర్ ఆఫ్ మలాడీస్" 2000 సంవత్సరానికి గాను ప్రఖ్యాత పులిట్జర్ అవార్డు అందుకుంది.[2] ఆమె మొదటి నవల ది నేమ్‌సేక్ (2003) ప్రసిద్ధ సినిమాగా అదే పేరుతో తీయబడింది. [3] ఆమె బాల్యనామం "నిలంజన సుధేష్ణ". కానీ ఆమె "జుంపా" అనే కలం పేరుతో రచనలు చేస్తుంది. [1] ఆమె "ప్రెసిడెంట్స్ కమిటీ ఆన్ ద ఆర్ట్స్ అండ్ హుమానిటీస్"లో సభ్యురాలిగా అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు బరాక్ ఒబామా చే నియమింపబడింది. [4] (ఆమె ఆగస్టు 2017 లో ఆ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేసి అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు "మీ ద్వేషపూరిత వాక్చాతుర్యం గల మీ పదాలు, చర్యల నుండి దూరంగా ఉండేందుకు గాను నేను రాజీనామా చేస్తున్నాను" అనే సూచనను అందించింది.[5] ఆమె రాసిన పుస్తకం "ద లోలాండ్" 2013లో ప్రచురితమయింది. ఈ పుస్తకం మ్యాన్ బుకర్ ప్రైజ్, నేషనల్ బుక్ అవార్డ్ ఫిక్షన్ లకు నామినేట్ చేయబడింది. ఆమె ప్రస్తుతం "ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం"లో సృజనాత్మక రచనల యొక్క విభాగంలో ప్రొఫెసర్ గా ఉంది. [6]
వ్యక్తిగత జీవితం
[మార్చు]జుంపా 1967 జూలై 11న లండన్లో జన్మించింది. ఆమె భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ నుండి అమెరికా వలసదారులైన బెంగాలీ కుటుంబానికి చెందినది. ఆమె కుటుంబం తన రెండవ యేట అమెరికాకు వెళ్ళింది. [7] ఆమె రోడే ద్వీపంలోని కింగ్‌స్టన్ లో పెరిగింది. అక్కడ ఆమె తండ్రి అమర్ లహరి యూనివర్శిటీ ఆఫ్ రోడే ఐలాండ్ వద్ద లైబ్రేరియన్ గా పనిచేసేవాడు. [7] అతడు "ద థర్డ్ అండ్ ఫైనల్ కాంటినెంట్" పుస్తకంలో ప్రధాన పాత్ర. [8] ఆమె తల్లి తన పిల్లలను బెంగాలీ సంస్కృతిలో పెంచాలని కోరుకునేది. ఆమె కుటుంబ సభ్యులు తరచుగా కలకత్తా (ప్రస్తుతంకోల్‌కతా) లో గల తమ బంధువులను సందర్శిస్తూ ఉండేవారు.[9]
ఆమె రోడ్ ఐలాండ్ లోని కింగ్‌స్టన్ వద్ద కిండర్ గార్టెన్ విద్యను ప్రారంభించినపుడు ఆమె ఉపాధ్యాయిని ఆమెను "జుంపా" అనే పేరుతో పిలవాలని నిశ్చయించుకుంది. ఆమె "అసలు పేరు" కంటే సులువుగా ఉచ్ఛరించగలిగినందున ఈ పేరుతో పిలిచేది. [7] ఆమె గుర్తింపుపై గల సందిగ్ధత యొక్క అనిశ్చితత్వం, ఆమె రాసిన ది నేమ్‌సేక్లో ప్రధాన పాత్ర "గొగోల్" ద్వారా చూపడానికి ప్రేరేపించబడింది. [7] ఆమె సౌత్ కింగ్ స్టౌన్ హైస్కూలులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె 1989 లో బెర్నార్డ్ కళాశాల నుండి ఆంగ్ల సాహిత్యంలో బి.ఎ డిగ్రీని పొందింది. [10] ఆమె బోస్టన్ విశ్వవిద్యాలయం నుండి అనేక డిగ్రీలను చేసింది. వాటిలో ఆంగ్ల భాషాలో ఎం.ఎ, సృజనాత్మక రచనలలో ఎం.ఫ్.ఎ, కంపేరటివ్ లిటరేచర్ లో ఎం.ఎ, పునరుజ్జివన శాస్త్రంలో పి.హెచ్.డిలు ఉన్నాయి. ఆమె 1997–199 కాలంలో ఫైన్‌ఆర్ట్స్ వర్క్ సెంటర్ లో ఫెలోషిప్ పొందింది. ఆమె బోస్టన్ విశ్వవిద్యాలయం మైర్యు రోడే ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిసెన్ లలో క్రియేటివ్ రైటింగ్ గూర్చి బోధించింది.
2001లో ఆమె అప్పట్లో "టైమ్" లాటిన్ అమెరికాలో డిప్యూటీ ఎడిటర్, జర్నలిస్టు అయిన అల్బెర్టో వోర్వోలియస్ బుష్ ను వివాహమాడింది. అతడు ప్రస్తుతం ఆ పత్రికకు సీనియర్ ఎడిటర్ గా ఉన్నాడు. ఆమె ప్రస్తుతం తన భర్త, ఇద్దరు పిల్లలు ఆక్టావియో (జ.2002), నూర్ (జ.2005) లతో కలసి రోమ్‌లో నివసిస్తుంది. [11] ఆమె 2015, జూలై 1 న పిన్సిటన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేరి సృజనాత్మక రచనల గూర్చి బోధిస్తోంది. [12]
సాహితీ జీవితం
[మార్చు]ఆమె సాహితీ ప్రస్థానంలో మొదట రాసిన లఘు కథలను ప్రచురణ కర్తలు తిరస్కరించేవారు. [13] ఆమె రాసిన లఘుకథల సమాహారం "ఇంటర్‌ప్రెటర్ ఆఫ్ మెలడీస్" చివరికి 1999 లో విడుదల అయినది. ఈ కథలలో భారతీయ వలసదారుల జీవితాలలోని సున్నితమైన అంశాలు ఉండేవి. వాటిలో వివాహ సమస్యలు, భ్రూణ హత్యలు, యునైటెడ్ స్టేట్స్ వెళ్ళే వలస దారులలో మొదటి, రెండవ తరాల మధ్య పొందిక లేకపోవడం గూర్చి రాసేది. ఈ కథా సంకలనం అమెరికన్ విమర్శకుల నుండి అభినందనలు పొందింది కానీ భారతదేశంలో మిశ్రమ సమీక్షలను పొందింది. [14] ఇంటర్‌ప్రెటెర్ ఆఫ్ మెలోడీస్ 600000 కాపీలు అమ్ముడయ్యాయి. ఆ కథా సంకలనానికి 2000 పులిట్జర్ ప్రైజ్ ఆఫ్ ఫిక్షన్ పురస్కారం లభించింది.[15][16]
2003 లో ఆమె ది నేమ్‌సేక్ అనే నవలను రాసింది. [14] గంగూలీ కుటుంబానికి చెందిన జీవితంలో ఈ కథ 30 సంవత్సరాలలో విస్తరించబడి ఉంది. కలకత్తాలో పుట్టిన కుటుంబపు పిల్లలు గోగోల్, సోనియాలతోపాటు అమెరికాకు వెళతారు. పిల్లలు అమెరికాలో పెరుగుతూన్న క్రమంలో సాంస్కృతిక అంతరాన్ని ఎదుర్కొంటారు. ఈ నవల పేరుతో ది నేమ్‌సేక్" అనే చిత్రం రూపొంది మార్చి 2007 లో విడుదలయింది. ఈ చిత్రానికి మీరానాయర్ దర్శకత్వం వహించింది. ఈ చిత్రంలో కాల్ పెన్న్ గొగోల్ పాత్రలో, టాబూ, ఇర్ఫాన్ ఖాన్ లు వారి తల్లిదంద్రుల పాత్రలలో నటించారు. ఆ చిత్రంలో లహరి అతిథి పాత్రలో "ఆంట్ జుంపా"గా నటించింది.
ఆమె రెండవ కథా సంకలనం "అనక్యూస్టోమెడ్ ఎర్త్" 2008, ఏప్రిల్ 1 న విడుదలయింది. ఈ పుస్తకం ద న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. [17]
"న్యూయార్కెర్" పత్రికలో ఆమె రాసిన అనేక కథలు, ఫిక్షన్, నాన్ ఫిక్షన్ కథలు, ఆమె తన తల్లితో గల సంబంధంలో ఆహారం యొక్క ఆవశ్యకతను తెలియజేసే కథ "కుకింగ్ లెసన్స్" వంటివి ప్రచురితమయ్యాయి.
2005 నుండి రచయితలకు మేధావుల సహకారం, స్నేహం అందిచేందుకు నెలకొల్పిన సంస్థ "పెన్ అమెరికన్ సెంటర్"కు ఉపాధ్యక్షురాలిగా ఉంది.
2010 ఫిబ్రవరిలో "కమిటీ ఆన్ ద ఆర్ట్స్ అండ్ హుమానిటీస్"కు ఐదుగురు సభ్యులలో ఒకతెగా నియమిపబడింది.[18]
2013 సెప్టెంబరులో ఆమె రాసిన "ద లోలాండ్" నవల మ్యాన్ బుకర్ ప్రైజ్ జాబితాలో స్థానం పొందింది.[19][20] తరువాత నెలలో అది నేషనల్ బుక్ అవార్డ్ ఫర్ ఫిక్షన్ జాబితాలో స్థానం పొందినది. 2013 అక్టోబరు 16 న ఫైనలిస్టుగా ఎంపిక కాబడింది.[21] అయినప్పటికీ 2013 నవంబరు 20 న జేమ్స్ మెక్ బ్రైడ్ రాసిన "ద గుడ్ లార్డ్ బర్డ్" పురస్కారానికి ఎంపిక కాబడింది. [21]
ఆమె రాసిన నాన్-ఫిక్షన్ వ్యాసాల సమాహారం "టీచ్ యువర్‌సెల్ఫ్ ఇటాలియన్ " 'ద న్యూ యార్కెర్" పత్రికలో ప్రచురితమయింది.
టెలివిజన్
[మార్చు]ఆమె హెచ్.బి.ఒ టెలివిజన్ లోని "ఇన్ ట్రీట్‌మెంట్" కార్యక్రమంలో మూడవ సీజన్ లో పనిచేసింది. ఆ సీజన్ లో సునీల్ పాత్రధారి, వితంతువులు భారతదేశం నుండి యునైటెడ్ స్టేట్స్ కు వలస వెళ్ళి సాంస్కృతిక సమస్యలను ఎదుర్కొంటారు.[22]
పురస్కారాలు
[మార్చు]- 1993 – ట్రాన్స్ అట్లాంటిక్ అవార్డ్, హెన్‌ఫీల్డ్ ఫౌండేషన్
- 1999 – ఓ.హెన్రీ పురస్కారం - "ఇంటర్‌ప్రెటర్ ఆఫ్ మెలడీస్" కథా సంకలనానికి.
- 1999 – పెన్/హెమింగ్వే పురస్కారం - "ఇంటర్‌ప్రెటర్ ఆఫ్ మెలడీస్" కథా సంకలనానికి.
- 1999 – "ఇంటర్‌ప్రెటర్ ఆఫ్ మెలడీస్" కథా సంకలనం అమెరికన్ లఘు కథలలో ఉత్తమ సంకలంగా ఎంపిక.
- 2000 – ఆల్డిసన్ మెట్‌కాఫ్ పురస్కారం - అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్.
- 2000 – "ద థర్డ్ అండ్ ఫైనల్ కాంటినెంట్ " -అమెరికన్ లఘు కథలలో ఉత్తమ సంకలంగా ఎంపిక.
- 2000 – ఫుల్టిజెర్ ప్రైజ్ ఫర్ పిక్షన్ - "ఇంటర్‌ప్రెటర్ ఆఫ్ మెలడీస్" కథా సంకలనానికి.
- 2002 – గుగ్గెన్‌హెల్ం ఫెలోషిప్.
- 2002 – "నోబడీస్ బిజినెస్" కథా సంకలనం అమెరికన్ లఘు కథలలో ఉత్తమ సంకలంగా ఎంపిక.
- 2008 – ఫ్రాంక్ ఓ కోన్నెర్ ఇంటర్నేషనల్ షార్ట్ స్టోరీ పురస్కారం - "అనక్యుస్టొమెడ్ ఎర్త్" పుస్తకానికి.
- 2009 – ఆసియన్ అమెరికన్ లిటరరీ పురస్కారం - "అనక్యుస్టొమెడ్ ఎర్త్" పుస్తకానికి.
- 2014 – డి.ఎస్.సి ప్రైజ్ ఫర్ సౌత్ ఆసియన్ లిటరేచర్ - న్యూలాండ్ పుస్తకానికి. [23]
- 2014 – నేషనల్ హుమానిటీస్ మెడల్ [24]
నవలలు
[మార్చు]- ది నేమ్‌సేక్ (2003)
- ద లోలాండ్ (2013)
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Minzesheimer, Bob. "For Pulitzer winner Lahiri, a novel approach", USA Today, 2003-08-19. Retrieved on 2008-04-13.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-06-04. Retrieved 2018-05-07.
- ↑ Chotiner, Isaac. "Interviews: Jhumpa Lahiri", The Atlantic, 2008-03-18. Retrieved on 2008-04-12.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;ArtsCom
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Todo un comité de Trump renuncia por su "retórica de odio" tras disturbios en Charlottesville". Retrieved 8 Aug 2017.
- ↑ "Jhumpa Lahiri, Professor of Creative Writing". Lewis Center for the Arts, Princeton University. Retrieved May 15, 2017.
- ↑ 7.0 7.1 7.2 7.3 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;usa2
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Flynn, Gillian. "Passage To India: First-time author Jhumpa Lahiri nabs a Pulitzer," Archived 2008-12-31 at the Wayback Machine Entertainment Weekly, 2000-04-28. Retrieved on 2008-04-13.
- ↑ Aguiar, Arun. "One on One With Jhumpa Lahiri", Pifmagazine.com, 1999-07-28. Retrieved on 2008-04-13.
- ↑ "Pulitzer Prize awarded to Barnard alumna Jhumpa Lahiri ’89; Katherine Boo ’88 cited in public service award to The Washington Post" Archived ఫిబ్రవరి 24, 2004 at the Wayback Machine, Barnard Campus News, 2000-04-11. Retrieved on 2008-04-13.
- ↑ Anastas, Benjamin. "Books: Inspiring Adaptation" Archived జూన్ 22, 2008 at the Wayback Machine, Men's Vogue, March 2007. Retrieved on 2008-04-13.
- ↑ Saxon, Jamie (September 4, 2015). "Author Jhumpa Lahiri awarded National Humanities Medal". Research at Princeton, Princeton University. Archived from the original on 2018-06-15. Retrieved May 15, 2017.
- ↑ Arun Aguiar (1 August 1999). "Interview with Jhumpa Lahiri". Pif Magazine/ Retrieved 4 September 2015.
- ↑ 14.0 14.1 Wiltz, Teresa. "The Writer Who Began With a Hyphen: Jhumpa Lahiri, Between Two Cultures" Archived 2020-06-12 at the Wayback Machine, The Washington Post, 2003-10-08. Retrieved on 2008-04-15.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;usa3
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Farnsworth, Elizabeth. "Pulitzer Prize Winner-Fiction" Archived 2014-01-01 at the Wayback Machine, PBS NewsHour, 2000-04-12. Retrieved on 2008-04-15.
- ↑ Garner, Dwight. "Jhumpa Lahiri, With a Bullet" The New York Times Paper Cuts blog, 2008-04-10. Retrieved on 2008-04-12.
- ↑ "Barack Obama appoints Jhumpa Lahiri to arts committee", The Times of India, 7 February 2010
- ↑ Masters, Tim (2013-07-23). "Man Booker judges reveal 'most diverse' longlist". BBC. Retrieved 2013-07-23.
- ↑ "BBC News - Man Booker Prize 2013: Toibin and Crace lead shortlist". BBC News. 10 September 2013. Retrieved 11 September 2013.
- ↑ 21.0 21.1 "2013 National Book Awards". National Book Foundation. Retrieved 4 September 2015.
- ↑ Shattuck, Kathryn (11 November 2010). "Therapy? Not His Cup of Tea". The New York Times.
- ↑ Claire Armitstead (22 January 2015). "Jhumpa Lahiri wins $50,000 DSC prize for south Asian literature". The Guardian. Retrieved January 22, 2015.
- ↑ "President Obama to Award 2014 National Humanities Medal". National Endowment for the Humanities. 3 September 2015. Retrieved 4 September 2015.
ఇతర పఠనాలు
[మార్చు]- Leyda, Julia (January 2011). "An interview with Jhumpa Lahiri". Contemporary Women's Writing. 5 (1). Oxford Journals: 66–83. doi:10.1093/cwwrit/vpq006.
{{cite journal}}
: CS1 maint: postscript (link) - Bilbro, Jeffrey. "Lahiri's Hawthornian Roots: Art and Tradition in "Hema and Kaushik"". Critique: Studies in Contemporary Fiction. 54 (4): 380–394. doi:10.1080/00111619.2011.594461.
{{cite journal}}
: CS1 maint: postscript (link) - Majithia, Sheetal (Fall/Winter 2001). "Of Foreigners and Fetishes: A Reading of Recent South Asian American Fiction." Samar 14: 52–53 The South Asian American Generation.
- Roy, Pinaki. “Postmodern Diasporic Sensibility: Rereading Jhumpa Lahiri’s Oeuvre”. Indian English Fiction: Postmodern Literary Sensibility. Ed. Bite, V. New Delhi: Authors Press, 2012 (ISBN 978-81-7273-677-4). pp. 90–109.
- Roy, Pinaki. "Reading The Lowland: Its Highs and its Lows". Labyrinth (ISSN 0976-0814) 5 (3), July 2014: 153–62.
- Reichardt, Dagmar. "Radicata a Roma: la svolta transculturale nella scrittura italofona nomade di Jhumpa Lahiri", in: I l pensiero letterario come fondamento di una testa ben fatta, edited by Marina Geat, Rome, Roma TRE Press, 2017 (ISBN 978-88-94885-05-7), pp. 219–247. [1]
- Reichardt, Dagmar. "Migrazione, discorsi minoritari, transculturalità: il caso di Jhumpa Lahiri", in: Scrivere tra le lingue. Migrazione, bilinguismo, plurilinguismo e poetiche della frontiera nell'Italia contemporanea (1980-2015) Archived 2022-10-16 at the Wayback Machine, edited by Daniele Comberiati and Flaviano Pisanelli, Rome, Aracne, 2017 (ISBN 978-88-255-0287-9), pp. 77–92.
- Das, Subrata Kumar. "Bengali Diasporic Culture: A Study of the Film Adaptation of Jhumpa Lahiri’s The Namesake". The Criterion: An International Journal in English (ISSN 0976-8165) 4 (II), April 2013: np.
బయటి లంకెలు
[మార్చు]Writer Jhumpa Lahiri, Fresh Air, September 04, 2003 |
- అధికారిక వెబ్సైటు
- Jhumpa Lahiri: A Bibliography, First Editions
- మూలాల లోపాలున్న పేజీలు
- Articles containing Bengali-language text
- Commons category link is on Wikidata
- AC with 14 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- అమెరికన్ రచయిత్రులు
- 1967 జననాలు
- జీవిస్తున్న ప్రజలు