Jump to content

జువ్వాడి రమాపతిరావు

వికీపీడియా నుండి
జువ్వాడి రమాపతిరావు
పార్లమెంట్ సభ్యుడు
In office
1962 - 1967, 1967-1971
అంతకు ముందు వారుఎం. శ్రీరంగారావు
తరువాత వారుఎం. సత్యనారాయణరావు
నియోజకవర్గంకరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం
In office
=
వ్యక్తిగత వివరాలు
జననం1916, సెప్టెంబరు 10
సర్వారెడ్డిపల్లి, గంగాధర మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామికౌశల్వ
సంతానంఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు
తల్లిదండ్రులుకొండల్ రావు

జువ్వాడి రమాపతిరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు (1962-1967, 1967-1971) పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

జననం, విద్య

[మార్చు]

రమాపతిరావు 1916, సెప్టెంబరు 10న తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, గంగాధర మండలం, సర్వారెడ్డిపల్లి గ్రామంలో జన్మించాడు. తండ్రిపేరు కొండల్ రావు. రమాపతిరావు హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఏ పూర్తిచేశాడు.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రమాపతిరావుకు కౌశల్వతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 1962-1967 మధ్యకాలంలో 3వ లోక్‌సభకు,[4] 1967-1971 మధ్యకాలంలో 4వ లోక్‌సభకు[5] పార్లమెంట్ సభ్యుడిగా పాత్రినిధ్యం వహించాడు.

నిర్వర్తించిన పదవులు

[మార్చు]

రమాపతిరావు అనేక పదవులు నిర్వర్తించాడు. వాటిలో కొన్ని:[6]

  • 1956-1959: ప్రైవేట్ ఉన్నత పాఠశాల (కరీంనగర్) వ్యవస్థాపకుడు, కార్యదర్శి
  • ఎస్.ఆర్.ఆర్. కళాశాల (కరీంనగర్) పాలకమండలి సభ్యుడు
  • హైదరాబాద్ స్టేట్ కోఆపరేటివ్ అడ్వైజరీ బాడీ సభ్యుడు
  • 1956-1959: కరీంనగర్ జిల్లా ప్రణాళిక అభివృద్ధి కమిటీ సభ్యుడు
  • కరీంనగర్ అద్దె కమిషన్ సభ్యుడు
  • 1949-1954: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు
  • గోవా విమోచన సమితి (కరీంనగర్) కార్యదర్శి
  • కరీంనగర్ కోఆపరేటివ్ హౌసిర్ సొసైటీ కార్యదర్శి
  • 1950: జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి
  • 1958-1959: బ్లాక్ డెవలప్‌మెంట్ కమిటీ (గంగాధర, కరీంనగర్) ఉపాధ్యక్షుడు
  • 1949-1950: తాలూక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
  • 1960-1963: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
  • 1964-1966: కరీంనగర్ జిల్లా పి&టి యూనియన్ అధ్యక్షుడు
  • కరీంనగర్ ఆల్ పార్టీస్ డిఫెన్స్ కమిటీ అధ్యక్షుడు
  • 1965-1966: అంచనాల కమిటీ సభ్యుడు

మూలాలు

[మార్చు]
  1. "Members of Third Lok Sabha". 164.100.47.193. Archived from the original on 2021-11-26. Retrieved 2021-11-26.
  2. "Members of Fourth Lok Sabha". 164.100.47.193. Archived from the original on 2021-11-26. Retrieved 2021-11-26.
  3. "Members Bioprofile". loksabhaph.nic.in. Archived from the original on 2021-11-26. Retrieved 2021-11-26.
  4. "Members : Lok Sabha". loksabha.nic.in. Archived from the original on 2021-11-24. Retrieved 2021-11-26.
  5. "Members : Lok Sabha". loksabha.nic.in. Archived from the original on 2021-11-23. Retrieved 2021-11-26.
  6. "Shri Juvvadi Ramapathy Rao political profile | ENTRANCEINDIA". www.entranceindia.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-11-26. Retrieved 2021-11-26.