జెలెప్ లా
జెలెప్ లా | |
---|---|
ప్రదేశం | Sikkim, India – Tibet, China |
జెలెప్ లా సిక్కిం, భారతదేశం, టిబెట్ స్వాధికార ప్రాంతాల మధ్య ఉన్న కనుమ దారి. ఇది సముద్రమట్టం నుండి 4,390 మీటర్ల ఎత్తున ఉంది.[1] లాసాను భారతదేశంతో కలిపే మార్గంలో ఉంది. ఈ కనుమ నాథూ లా కు దక్షిణాన సుమారు 4 కి.మీ. (2.5 మై.) కిమీ (2.5 మైళ్ళు) దూరంలో, దాని కంటే కొంచెం ఎత్తులో ఉంది. బ్రిటిషు రాజ్ సమయంలో టిబెట్, భారతదేశాల మధ్య వాణిజ్యం కోసం దీనిని తరచుగా ఉపయోగించారు, కలింపాంగ్ సంప్రదింపు కేంద్రంగా పనిచేసింది. మెన్మెచో సరస్సు జెలెప్ లా క్రింద ఉంది.
పేరు
[మార్చు]బెంగాల్ డిస్ట్రిక్ట్ గెజిటీర్ ప్రకారం, జెలెప్-లా, ఒక టిబెటన్ పేరు, దీని అర్థం "మనోహరమైన చదునైన కనుమ". ఇది టిబెట్, సిక్కింల మధ్య ఉన్న అన్ని పాస్‌లలో అత్యంత సులభమైన, అత్యంత చదునైనది కాబట్టి దీనిని అలా పిలుస్తారు.[2]
పండితుడు అలెక్స్ మెకే ప్రకారం, దీని టిబెటన్ పేరు వైలీ.[1] అంటే "గొర్రెల కాపరి కంచు కనుమ" అని అర్ధం. [3]
చరిత్ర
[మార్చు]17వ శతాబ్దం
[మార్చు]17వ శతాబ్దంలో, జెలెప్ లా డంసాంగ్ లో ఉన్న తూర్పు సిక్కిమీస్ లెప్చా రాజ్యం నియంత్రణలో ఉండవచ్చు. లెప్చా అధిపతి గ్యాల్పో అజోక్. అజోక్ 5వ దలైలామా ఆధ్వర్యంలో టిబెట్‌తో పొత్తు పెట్టుకుని, భూటాన్‌తో పోటీ పడ్డాడు. 1675-79 సమయంలో భూటాన్‌కు వ్యతిరేకంగా టిబెట్, దంసాంగ్‌లు చేసిన యుద్ధంలో, అజోక్ దలింగ్‌కోట్ వద్ద భూటాన్ అవుట్‌పోస్ట్‌ను స్వాధీనం చేసుకున్నాడు. అయితే, భూటాన్ ఆ పోస్టును తిరిగి స్వాధీనం చేసుకుని అజోక్‌ను ఉరితీసింది.[4]
ఈ సంఘటన తర్వాత, టిబెట్, భూటాన్ల మధ్య ఒక పెద్ద యుద్ధం చెలరేగింది. అయితే భూటాన్ తన పెద్ద శత్రువును తిప్పికొట్టగలిగింది. యుద్ధం తుది ఫలితం పూర్తిగా స్పష్టంగా లేదు గానీ, కాలింపాంగ్ ప్రాంతం భూటాన్ ఆధీనంలోకి వచ్చింది. రెనోక్, జెలెప్ లాల మధ్య ఉన్న ప్రస్తుత తూర్పు సిక్కిం, టిబెట్ నియంత్రణలోకి వచ్చి ఉండవచ్చు.
చైనా-నేపాలీస్ యుద్ధం సమయంలో సిక్కిం, తీస్తా నదికి పశ్చిమాన ఉన్న చాలా భూభాగాన్ని నేపాల్‌కు కోల్పోయింది. టిబెట్ సిక్కింకు ప్రస్తుత తూర్పు సిక్కిం ప్రాంతాన్ని మంజూరు చేసింది. బ్రిటిషువారు తెరపైకి వచ్చే సమయానికి, చో లా-జెలెప్ లా శ్రేణి వరకు ఉన్న ప్రాంతం సిక్కిం ఆధీనంలో ఉండేది. దానికి ఆవల ఉన్న చుంబీ లోయను టిబెట్‌లో భాగంగా పరిగణించేవారు.
బ్రిటిషు రాజ్ కాలం
[మార్చు]భూటాన్ నుండి కలింపాంగ్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత, బ్రిటిషు వారు 1884లో జెలెప్ లాకు బళ్ళబాటను నిర్మించడం ప్రారంభించారు.[5] దీని పట్ల టిబెటన్లు కొంత భయం కలిగింది. 1886 లో ఒక చిన్న టిబెటన్ సైనిక దళం కనుమ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించింది. 1888 మేలో టిబెటన్లు బ్రిటిషు వారిపై దాడి చేశారు. కానీ బ్రిటిషు ఎక్స్‌పెడిషనరీ ఫోర్స్ వారిని ఓడించింది. తర్వాత అదే సంవత్సరం సెప్టెంబరులో బ్రిటిషు వారు కనుమ చుట్టుపక్కల ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
టిబెట్‌లో రష్యన్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, 1904 లో కల్నల్ ఫ్రాన్సిస్ యంగ్‌హస్‌బాండ్ నేతృత్వంలో ఒక బ్రిటిషు దళాన్ని జెలెప్ లా ద్వారా లాసాకు పంపారు. ఈ దళాన్ని ఎదుర్కొన్న శత్రు టిబెటన్ దళాలను బ్రిటిషు వారు ఓడించారు. 13 వ దలైలామా లేకపోవడంతో - అతను మంగోలియాకు పారిపోయాడు - బ్రిటిషువారు టిబెటన్లపై వాణిజ్య ఒప్పందాన్ని రుద్దారు.
1910లో, చైనీస్ దండయాత్ర నుండి తప్పించుకోవడానికి, 13వ దలైలామా "ఆరుగురు మంత్రులు, ఒక చిన్న ఎస్కార్ట్‌తో పాటు" అతని సన్నిహితుడు, దౌత్యవేత్త, సైనికాధికారీ అయిన త్సారోంగ్ డ్జాసాతో సహా, జెలెప్ లా [6] మీదుగా సిక్కిం, అక్కడి నుండి డార్జిలింగ్‌కు పారిపోయాడు. దాదాపు రెండు సంవత్సరాలు ఉన్నాడు. ఈ కాలంలో అతన్ని వైస్రాయ్ లార్డ్ మింటో కలకత్తాకు ఆహ్వానించాడు. ఇది బ్రిటిషు వారితో సంబంధాలను పునరుద్ధరించడానికి సహాయపడింది. [7]
ఆధునిక కాలం
[మార్చు]1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, అప్పటికి రాచరిక పాలన లోనే ఉన్న సిక్కిం ప్రత్యేక రక్షిత హోదాకు అంగీకరించింది. దాని రక్షణ, విదేశీ వ్యవహారాలను భారతదేశం నిర్వహించేది. 1950 లో టిబెట్‌పై చైనా దండయాత్ర, 1959 లో టిబెట్ తిరుగుబాటు అణచివేతల తరువాత, టిబెట్ నుండి వచ్చే శరణార్థులకు ఈ కనుమలు మార్గంగా మారాయి. ఆ తరువాత చైనా సిక్కింలోకి వెళ్లే మార్గాలను మూసేసింది. 1962 చైనా-భారత యుద్ధం సమయంలో, జెలెప్ లా, నాథూ లా కనుమలలోను, చుట్టుపక్కలా భారత, చైనా సాయుధ దళాల మధ్య సరిహద్దు ఘర్షణలు జరిగాయి. ఆ దశలో సిక్కిం ఇప్పటికీ ప్రత్యేక రాజ్యంగా ఉన్నప్పటికీ ఈ ఘర్షణలు జరిగాయి. యుద్ధం తరువాత ఆ రెండు కనుమలను మూసివేసారు.[8][9]
ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత 1975 ప్రారంభంలో సిక్కిం భారతదేశంలో భాగమైంది. భారత, చైనా మధ్య సంబంధాలు మెరుగపోవడంతో, జెలెప్ లాను[10] తిరిగి తెరవడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి.[11]
ఇవి కూడా చూడండి
[మార్చు]గమనికలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 McKay, Alex (2013), Pilgrimage in Tibet, Taylor & Francis, p. 75, ISBN 978-1-136-80716-9
- ↑ O'Malley, L. S. S. (1907). Bengal District Gazetteer : Darjeeling. Concept Publishing Company. p. 215. ISBN 978-81-7268-018-3.
- ↑ THL Tibetan to English Translation Tool: rdzi li la, The Tibetan & Himalayan Library, retrieved 1 August 2021.
- ↑ Mullard, Opening the Hidden Land (2011).
- ↑ Paget, William Henry (1907). Frontier and overseas expeditions from India. Indian Army Intelligence Branch. p. 42.
- ↑ The Thirteenth Dalai Lama, Thupten Gyatso Archived 2012-09-20 at the Wayback Machine, dalailama.com
- ↑ Chapman, F. Spencer (1940), Lhasa – The Holy City, London: Readers Union Ltd.
- ↑ "Business News Today: Read Latest Business news, India Business News Live, Share Market & Economy News".
- ↑ "Will India and China fight a war again?". 26 September 2012.
- ↑ "Documents signed between India and China during Prime Minister Vajpayee's visit to China". www.mea.gov.in (Ministry of External Affairs, Government of India). 23 June 2003. Retrieved 2021-10-29.
- ↑ "Nathula reopens for trade after 44 years". Zee News. 6 July 2006. Archived from the original on 30 September 2007. Retrieved 6 July 2006.