Jump to content

సిక్కింపై బ్రిటిషు వారి దండయాత్ర

వికీపీడియా నుండి
సిక్కింపై బ్రిటిషు వారి దండయాత్ర
అవమానాల శతాబ్దిలో భాగము

సిక్కింలో యుద్ధ క్షేత్రం
తేదీ1888 మార్చి 15  – సెప్టెంబరు 27
ప్రదేశంసిక్కిం: జులుక్ (చైనీస్: 扎鲁),
లుంగ్‌తుంగ్ (చైనీస్: 隆吐山),
నాథోంగ్ (చైనీస్: 纳塘),
చుంబి లోయ (చైనీస్: 春丕河谷)
ఫలితంబ్రిటిషు వారి విజయం
ప్రత్యర్థులు
మూస:Country data Qing dynasty క్వింగ్ చైనా
  • టిబెట్
United Kingdom of Great Britain and Ireland యునైటెడ్ కింగ్‌డమ్
  • మూస:Country data బ్రిటిషు భారతదేశం
  • సేనాపతులు, నాయకులు
    మూస:Country data Qing dynasty Wen Shuo
    మూస:Country data Qing dynasty Lhalu Yeshe Norbu Wangchug
    British Empire Thomas Graham

    1888 లో సిక్కిం రాజ్యం నుండి టిబెట్ దళాలను తరిమేయడానికి బ్రిటిషు భారత ప్రభుత్వం సిక్కింపై దండయాత్ర చేసింది. సిక్కింపై ఆధిపత్యం కోసం బ్రిటిష్-టిబెట్ దేశాల మధ్య జరిగిన పోటీలో ఈ దండయాత్రకు మూలాలు ఉన్నాయి.

    కారణాలు

    [మార్చు]

    సిక్కింకు టిబెట్‌తో సుదీర్ఘ కాలంగా సంబంధాలున్నాయి. బౌద్ధమతం దేశ అధికారిక మతం. పాలకులైన చోగ్యాల్‌లు, భూటాన్‌ను ఏకం చేసిన టిబెటన్ సన్యాసి శబ్దుంగ్ న్గావాంగ్ నామ్‌గ్యాల్ వంశీకులు. 19వ శతాబ్దపు ప్రథమార్ధంలో, బ్రిటిషు వారు హిమాలయాల వరకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. 1861 లో సిక్కిం బ్రిటిషు వారితో తుమ్లాంగ్ ఒప్పందంపై సంతకం చేసింది. బ్రిటిషు వారు నేపాల్, సిక్కిం, భూటాన్‌లతో సంబంధాలు ఏర్పరచుకోవడంతో, టిబెట్ ప్రభావం క్షీణించింది. బ్రిటిషు వారిని ఎదిరించకుండా వదిలేస్తే, వాళ్ళు సిక్కిం ద్వారా టిబెట్‌లోకి చొరబడతారని లాసా, పెకింగ్‌లలో టిబెట్, చైనా పాలకులు భయపడ్డారు.

    డార్జిలింగ్‌లో తుటోబ్ నామ్‌గ్యాల్‌తో లామాస్, 1900 ప్రాంతంలో

    సిక్కిం 9వ చోగ్యాల్ అయిన థుటోబ్ నామ్‌గ్యాల్, దలైలామా నుండి ఆధ్యాత్మిక నాయకత్వం ఆశించాడు. అతని పాలనలో టిబెట్ ప్రభుత్వం తిరిగి సిక్కిం మీద రాజకీయ ప్రభావాన్ని కలిగించడం మొదలైంది. 1861 ఒప్పందం ప్రకారం, చోగ్యాల్ ఏడాదిలో మూడు నెలల కంటే ఎక్కువ కాలం టిబెట్‌లో గడపకూడదు. అయితే అతను తరచూ ఈ నిబంధనను అతిక్రమించేవాడు. 1887 లో టిబెట్‌లో దాదాపు రెండు సంవత్సరాలు నివసించిన తర్వాత అతను, డార్జిలింగ్‌ వెళ్ళి లెఫ్టినెంట్-గవర్నర్‌ను కలవడానికి నిరాకరించాడు. లాసాలోని అంబన్ తనను అలా కలవవద్దని చెప్పాడని అతను అన్నాడు.[1] మరోవైపు అతను, సేకరించిన ఆదాయాన్ని చుంబికి పంపాలని ఆదేశించాడు. ఇక సిక్కింకు తిరిగి రాకూడదనే అతని ఉద్దేశ్యానికి ఇది స్పష్టమైన సంకేతం.[1]

    1884లో భారత ప్రభుత్వం టిబెట్, భారత ప్రభుత్వాల ప్రభావ రంగాలను నిర్వచించడానికి టిబెట్ రాజధాని లాసాకు దౌత్యం నెరపడానికి సిద్ధమైంది. కాల్‌మన్ మెకాలే ఆ చర్చలకు బాధ్యత వహించాల్సి ఉంది. అయితే టిబెట్ ప్రభుత్వం 300 మంది సైనికులతో దండయాత్రను పంపింది. ఆ సైన్యం, జెలెప్ లా పాస్‌ను దాటి, సిక్కిం లోకి వెళ్ళి 13 మైళ్లు (21 కి.మీ.) దూరంలో ఉన్న లింగ్టును ఆక్రమించింది.

    బ్రిటిషు వారు మెకాలే దౌత్యాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. అసలు ఆ దౌత్యం ఉనికే తమపై ఆక్రమణకు గుర్తు అని టిబెటన్ల వాదన. అయితే టిబెటన్లు, తిరోగమనానికి బదులుగా అక్కడే ఉండడానికి మొగ్గు చూపించారు. వారు డార్జిలింగ్ నుండి లింగ్టు మీదుగా టిబెట్‌లోకి వచ్చే రహదారిపై ఒక ద్వారాన్ని నిర్మించారు. దాని రక్షణ కోసం ఒక కోటను కూడా నిర్మించారు. చైనీయులతో చర్చలు నిలిచిపోయిన తర్వాత, ఈ రహదారిపై భారత నియంత్రణను తిరిగి నెలకొల్పడానికి లింగ్టుకు సైనికదళాన్ని పంపాలని బ్రిటిషు భారత ప్రభుత్వం ఆదేశించింది.

    దళాన్ని పంపడం

    [మార్చు]
    బ్రిటిషు దళంలో కల్నల్ థామస్ గ్రాహం, తదితర అధికారులు.

    1888 నుండి, ఓపక్క చర్చలు జరుగుతూండగానే, బ్రిటిషు వారు సైనిక పరిష్కారానికి సిద్ధమయ్యారు. జనవరిలో వారు రోంగ్లీ వంతెనకీ, రహదారికీ మరమ్మత్తులు చేయడానికి ప్రధాన కార్యాలయాన్నీ, 32వ పయనీర్‌ల కు చెందిన ఒక విభాగాన్నీ సరిహద్దుకు పంపారు. టెరాయ్‌లోని సెవోక్, రియాంగ్ ల వద్ద దళానికి విశ్రాంతి స్థలాలను సిద్ధం చేశారు.[1] మార్చి 15 లోగా తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని బ్రిటిషు ప్రభుత్వం పంపిన అల్టిమేటం టిబెట్ ప్రభుత్వానికి అందింది.[1]

    ఫిబ్రవరి 25 న బ్రిగేడియర్-జనరల్ థామస్ గ్రాహం, ముందుకు సాగమని దళాన్ని ఆదేశించాడు. అతని బలగాలు 2వ బెటాలియన్ షేర్‌వుడ్ ఫారెస్టర్స్ (నాటింగ్‌హామ్‌షైర్ డెర్బీషైర్ రెజిమెంట్), హెచ్‌క్యూ వింగ్ 13వ బెంగాల్ పదాతిదళం, 9-1వ నార్తర్న్ డివిజన్ రాయల్ ఆర్టిలరీ నుండి నాలుగు ఫీల్డు తుపాకులు 32 వ పయనీర్‌లను సమీకరించాయి.[1] లింగ్టు నుండి టిబెటన్లను పారదోలడం, జెలెప్ లా వరకు రహదారిపై మళ్ళీ భారతీయ నియంత్రణను స్థాపించడం అతనికి ఇచ్చిన ఆదేశాలు. అదే సమయంలో గాంటోక్, తుమ్లాంగ్‌లలో ప్రతీకార చర్యలు జరగకుండా రక్షించాలి. టిబెట్‌లోకి వెళ్లమని అతనికి ఆదేశాలివ్వలేదు గానీ, నిర్ణయాన్ని అతని విచక్షణకు వదిలివేసారు.

    డోలెప్‌చెన్‌లో ముందస్తు డిపోను స్థాపించి, మార్చి 14 నాటికి మొత్తం దళాన్ని పాడోంగ్‌లో సమీకరించారు. సైన్యాన్ని, గ్రాహం నేతృత్వంలో లింగ్టు, లెఫ్టినెంట్ కల్నల్ మిచెల్ కింద ఇన్చి అనే రెండు భాగాలుగా విభజించారు.

    జెలుక్, లింగ్టు

    [మార్చు]
    సెడాంగ్‌చెన్‌కు మార్గం

    మిచెల్ పాడోంగ్‌లో ఉండి, 200 మంది సైనికులను పాక్యోంగ్‌కు పంపాడు. [1] గ్రాహం 19 వ తేదీన లింగ్టు నుండి 7 మైళ్ల దూరంలో ఉన్న సెడాంగ్‌చెన్‌కు చేరుకున్నాడు. మరుసటి రోజు అతను జెలుక్ వద్ద టిబెటన్ల స్థావరంపై దాడి చేశాడు.[1] టిబెటన్లు రహదారిపై అడ్డుకట్టలు వేసి, రహదారి పక్కనే ఉన్న కొండపై ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముందు ఉన్న మార్గదర్శకులు వెదురుగడలను, ఆకులనూ తప్పించి మార్గం చేస్తూ ఉండగా గ్రాహం, డెర్బీషైర్‌కు చెందిన వంద మంది సైనికులు, రెండు ఫిరంగులతో సహా ముందుకు సాగాడు.[1] కష్టతరమైన భూభాగం కారణంగా నడక నెమ్మదిగా సాగింది. కానీ వారు స్థావరాన్ని చేరుకోగానే, స్వల్ప పోరాటం తర్వాత టిబెటన్లు వెనక్కి తగ్గారు. స్థావరం వద్ద బలమైన రక్షణ గోడలు ఉన్నప్పటికీ, రక్షకుల బాణాలను, ఆయుధాలనూ బ్రిటిషు వారి ఆధునిక తుపాకులు, ఫిరంగిదళాలు తేలిగ్గా అణచివేసాయి. స్థావరాన్ని ఆక్రమించిన తరువాత, బ్రిటిషు వారు టిబెటన్లను తరిమికొట్టారు. పారిపోతున్న టిబెటన్లను బ్రిటిషు వారు తరమడం ఆవేసారు.[1]

    జెలుక్ యుద్ధం తరువాత, గ్రాహం తన మనుషులను మళ్ళీ సమీకరించి, లింగ్టు కోట నుండి గార్నీ వరకు ఉన్న రహదారిపై ఒక మైలు దూరం ముందుకు సాగి, ఆ రాత్రి అక్కడ విడిది చేశాడు.[1] మరుసటి రోజు ఉదయం దళం, మంచులో టిబెటన్ నెమ్మదిగా స్థానాల వైపు ముందుకు సాగి, సుమారు 11 గంటలకు కోట గేటును ఆక్రమించారు. అక్కడ 30 మంది టిబెటన్ సైనికులు మాత్రమే కాపలాగా ఉన్నారు.[1]

    నాథోంగ్

    [మార్చు]
    నాథోంగ్‌లోని స్టాక్‌కేడ్

    లింగ్టు నుండి తప్పించుకున్న టిబెటన్లు, సరిహద్దు దాటి చుంబీ లోయలో కలిసారు. వాళ్ళు ఓడిపోయారు కానీ సమసిపోలేదు. వాస్తవానికి వారు కొత్త బలగాలను చేర్చుకున్నారు. లింగ్టుకు ఉత్తరాన మూడు నాలుగు మైళ్ల దూరంలో ఉన్న నాథోంగ్‌లో బ్రిటిషు వారు తమ రక్షణను సిద్ధం చేసుకున్నారు.[1] 21 న బెంగాల్ లెఫ్టినెంట్-గవర్నర్ నాథోంగ్‌కు వచ్చాడు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు టిబెటన్లు 3,000 మందితో బ్రిటిషు రక్షణపై దాడి చేశారు (అని బ్రిటిషు వారు చెబుతారు).[1] ఉదయం 10 గంటల వరకు పోరాటం సాగిన తరువాత, టిబెటన్లు తిరుగుముఖం పట్టారు. తమ సైనికులు ముగ్గురు మరణించారని, ఎనిమిది మంది గాయపడ్డారని బ్రిటిషు వారు అంగీకరిస్తూ, తాము వంద మంది టిబెటన్లను చంపినట్లు చెప్పారు.[1] టిబెటన్లు జెలప్ లా మీదుగా వెనుతిరిగారు. ఇక పోరాటాలేమీ జరగలేదు. అంచేత జూన్‌లో బ్రిటిషు వారు కొంత సైన్యాన్ని డార్జిలింగ్‌కు తిరిగి పంపడం ప్రారంభించారు.[1]

    పునరుద్ధరించిన కార్యకలాపాలు

    [మార్చు]

    జూలై చివరి నాటికి, బ్రిటిషు ఉపసంహరణ కొనసాగుతుండగా, సరిహద్దుకు అవతలి వైపున టిబెటన్లు మళ్ళీ కార్యకలాపాలు మొదలుపెట్టారు.[1] టిబెటన్లు చుంబీ లోయ పైన ఉన్న పర్వత మార్గాలను బలపరిచారు. కల్నల్ గ్రాహం వద్ద కేవలం 500 మంది సైనికులు, నాథోంగ్ వద్ద ఒక దండు మాత్రమే ఉన్నారు. అయితే బెంగాల్ ప్రభుత్వం రిన్చింగాంగ్, కోఫు మధ్య టిబెటన్ సైనికులు 7,000 మంది దాకా ఉన్నట్లు అంచనా వేసింది. లింగమతంగ్ వద్ద మరో 1,000 మంది సైనికులు రిజర్వులో ఉన్నారు.[1] బెంగాల్ అధికారులు త్వరగా బలగాలను పంపారు. ఆగస్టు చివరి నాటికి, నాథోంగ్ వద్ద గ్రాహం దళంలో 1,691 మంది సైనికులు, నాలుగు తుపాకులు ఉన్నాయి.[1]

    కొన్ని ఘర్షణల తరువాత, టిబెటన్లు నాథోంగ్ నుండి రెండు మైళ్ల దూరంలో ఉన్న టుకో లా పాస్‌ను దాటారు. త్వరత్వరగా వారు కనుమ శిఖరంపై మూడు, నాలుగు అడుగుల ఎత్తు, దాదాపు నాలుగు మైళ్ల వెడల్పుతో గోడను నిర్మించడం ప్రారంభించారు.[1] కల్నల్ గ్రాహం ఉదయం 8 గంటల ప్రాంతంలో మూడు వరుసలతో టిబెటన్ స్థానాలపై దాడి చేశాడు. అతను ఎడమ వరుసకు నాయకత్వం వహించాడు, ఇది టుకో లా పాస్‌కు రక్షణగా ఉన్న బ్లాక్‌హౌస్‌పై దాడి చేసింది. లెఫ్టినెంట్-కల్నల్ బ్రోమ్‌హెడ్ టుకో లాకు ప్రధాన రహదారిపైకి వెళ్లే మధ్య వరుసకు నాయకత్వం వహించాడు. మేజర్ క్రేగీ-హాల్కెట్ నేతృత్వంలోని కుడి వరుస, వుడ్‌కాక్ కొండకు ఈశాన్యంగా ఉన్న జీను-వెనుక భాగాన్ని ఆక్రమించి, టిబెటన్ల ఎడమవైపు పట్టుకోవాలి. [1] ఉదయం 9:30 గంటలకు బ్రిటిషు కుడి ఫిరంగిదళం టిబెటన్ ఎడమ పార్శ్వంపై బాంబులతో దాడి చేయడం ప్రారంభించింది. 10:30 కి మిగతా రెండు బ్రిటిషు వరుసలు టిబెటన్‌లతో తలపడ్డాయి. బ్రిటిషు వారు చొచ్చుకుపోయి టుకో లా పాస్‌ను స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత టిబెటన్లు నిమ్ లా పాస్ ద్వారా వెనక్కి తగ్గారు.[1] తన పార్శ్వాలను భద్రపరిచిన తర్వాత, కల్నల్ గ్రాహం జెలెప్ లా పాస్ వద్ద టిబెటన్లపై దాడి చేసి, స్వాధీనం చేసుకున్నాడు.[1] మరుసటి రోజు వెంబడించడం మళ్ళీ మొదలుపెట్టి, సాయంత్రం 4:00 గంటలకు బ్రిటిషు వారు రిన్చింగాంగ్‌ను ఆక్రమించారు.[1]

    చుంబి వ్యాలీ, గాంగ్టక్

    [మార్చు]
    చుంబీ లోయ

    మరుసటి రోజు, సెప్టెంబరు 26 న, బ్రిటిషు వారు అమ్మో చు వెంట 3 మైళ్లు (4.8 కి.మీ.) వెళ్ళి, మయాటాంగ్ (యాతుంగ్) వద్ద రాత్రికి తాత్కాలికంగా విడిది చేసారు.[1] టిబెటన్లు చెల్లాచెదురై, శత్రువు పురోగతిని అడ్డుకోలేదు.

    ఇంతలో గ్రాహం, సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌కు వెళ్లాల్సిన అవసరం ఉందని భావించాడు, అక్కడ టిబెట్-అనుకూల పార్టీ, భారతదేశానికి అనుకూలంగా ఉండే ప్రత్యర్థులను అడ్డు తొలగించుకుంది. కల్నల్ మిచెల్, 13వ బెంగాల్ పదాతిదళానికి చెందిన 150 మందితో సెప్టెంబరు 23న నగరానికి చేరుకున్నాడు.[1]

    కలకత్తా సమావేశం

    [మార్చు]

    చుంబి, గ్యాంగ్‌టక్‌లలో పురోగతి తరువాత, సైనిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. డిసెంబరు 21 న  లాసాలోని చైనీస్ రెసిడెంటు నాథోంగ్‌కు చేరుకున్నాడు. చర్చలు జరిగాయి గానీ, ఎటువంటి ఒప్పందం కుదరలేదు. అంబన్ రిన్‌చింగాంగ్‌కు తిరిగి వచ్చాడు, అక్కడ చైనీస్ ఇంపీరియల్ కస్టమ్స్ సర్వీస్‌కు చెందిన TH హార్ట్ కోసం వేచి ఉండమని ఆదేశాలు అందుకున్నాడు, అతను చివరకు 22 మార్చి 1889 న నాథోంగ్‌ చేరుకున్నాడు. [1] చివరికి కలకత్తా ఆంగ్లో చైనీస్ ఒప్పందంపై 1890 మార్చి 17 న సంతకాలు చేసారు. దాంతో టిబెట్ సిక్కిం మీద ఆధిపత్యాన్ని కోల్పోయింది. టిబెట్, సిక్కింల మధ్య సరిహద్దుపై స్పష్టత ఏర్పడింది.[1]

    ఇవి కూడా చూడండి

    [మార్చు]
    • టిబెట్‌పై బ్రిటిషు దండయాత్ర

    మూలాలు

    [మార్చు]
    1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 1.11 1.12 1.13 1.14 1.15 1.16 1.17 1.18 1.19 1.20 1.21 1.22 1.23 1.24 1.25 1.26 Paget, Frontier and Overseas Expeditions (1907).