వి.వి.లక్ష్మీనారాయణ

వికీపీడియా నుండి
(జె.డి.లక్ష్మీనారాయణ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వాసగిరి లక్ష్మీనారాయణ
వి.వి.లక్ష్మీనారాయణ
జననంవాసగిరి లక్ష్మీనారాయణ
(1965-04-03) 1965 ఏప్రిల్ 3 (వయసు 59)
శ్రీశైలం, కర్నూలు జిల్లా
ఇతర పేర్లుజె.డి.లక్ష్మీనారాయణ
ప్రసిద్ధిమహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి

వాసగిరి లక్ష్మీనారాయణ కర్నూలు జిల్లాకు చెందిన మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి. డీఐజీ హోదాలో ఉన్నప్పుడే కేంద్రానికి డిప్యుటేషన్ పై వెళ్ళి సీబీఐలో బాధ్యతలు చేపట్టాడు. సీబీఐ డీఐజీగా 2006 జూన్‌లో సొంతరాష్ట్రమైన హైదరాబాద్ లో విధుల్లో చేరాడు. ఈయన సంచలనాత్మక కేసుల దర్యాప్తునకు చిరునామాగా మారిన సీబీఐ హైదరాబాద్ విభాగంలో జాయింట్ డైరెక్టర్.

సిబీఐ నుండి స్వచ్ఛంద విరమణ తీసుకున్న తరువాత, రాజకీయాల్లో ప్రవేశించాడు. స్వంతంగా జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

లక్ష్మీనారాయణ 1965 ఏప్రిల్ 3 న కర్నూలు జిల్లా శ్రీశైలంలో జన్మించాడు. వరంగల్ లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ నుండి బాచలర్ ఆఫ్ ఇంజరీరింగ్ చేశాడు. తర్వాత ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఎం.టెక్ చేశాడు. తర్వాత సివిల్ సర్వీసు పరీక్ష ఉత్తీర్ణుడై మహారాష్ట్ర కేడర్ ఐ.పి.ఎస్ అధికారిగా చేరాడు.[1] నాందేడ్ లో ఎస్.పి గా పనిచేశాడు. తర్వాత మహారాష్ట్రలో ఏంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో పనిచేశాడు. 2006 జూన్ 12 నుండి హైదరాబాదు లో డిప్యూటీ ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. 2006 లో లక్ష్మీనారాయణ "ఇండియన్ పోలీస్ మెడల్" పొందాడు.[2]

సంచలనాల కేసుల దర్యాప్తు

[మార్చు]

ఆయన వచ్చిన కొత్తలో తొలుత ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు నమోదైంది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయంలో తలపెట్టిన అవుటర్‌ రింగ్‌రోడ్డులో భూసేకరణ, అందులో జరిగిన అక్రమాలకు సంబంధించి దర్యాప్తు జరిపి న్యాయస్థానానికి నివేదిక సమర్పించాడు. ఇది సద్దుమణిగేలోపే సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం కేసు సీబీఐకి బదిలీ అయింది. రూ.ఏడు వేలకోట్ల కుంభకోణానికి సంబంధించిన ఈ కేసుపై సమర్థంగా దర్యాప్తు జరిపిన లక్ష్మీనారాయణ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఈ కేసు కొలిక్కి వచ్చేలోపే దాదాపు ఒకే సమయంలో ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసు, జగన్‌ అక్రమ ఆస్తుల కేసు, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ ప్రజాప్రతినిధులు తమ అధికారాన్ని అడ్డంపెట్టుకొని భారీగా అక్రమాలకు పాల్పడ్డ కుంభకోణాల కేసులే.

ఓఎంసీ కేసు దర్యాప్తులో భాగంగా కర్ణాటక ఎంపీ గాలి జనార్దనరెడ్డి, ఓఎంసీ ఎండీ శ్రీనివాసరెడ్డిలను అరెస్టు చేయడంతో లక్ష్మీనారాయణ వార్తల్లో వ్యక్తి అయ్యాడు. అది మొదలు ఓఎంసీ కేసులో వరుసగా అరెస్టులు జరిగాయి. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి, మైనింగ్‌ శాఖ ఉన్నతాధికారి రాజ్‌గోపాల్‌ తదితరులను అరెస్టు చేశాడు. దీంతోపాటు ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసులో పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బి.పి.ఆచార్యలను అరెస్టు చేశాడు. ఇదే సమయంలో జగన్‌ అక్రమ ఆస్తుల కేసు దర్యాప్తులో భాగంగా మరో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌, అప్పటి మంత్రి మోపిదేవి వెంకట రమణ తదితరులతోపాటు కడప ఎంపీ జగన్‌ను కూడా అరెస్టు చేశారు. ఈ అరెస్టులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. జగన్‌ అక్రమ ఆస్తుల కేసు విషయంలోనే హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావులు తమ పదవులు పోగొట్టుకున్నారు.[3][4][5][6][7][8][9][10].

ఈ కేసుల దర్యాప్తు జరుగుతుండగానే ఓఎంసీ కేసులో అరెస్టయిన గాలి జనార్దనరెడ్డికి అక్రమ పద్ధతుల్లో బెయిల్‌ ఇప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపైనా సీబీఐ కన్నేసింది. న్యాయమూర్తులకు పెద్దఎత్తున డబ్బు ముట్టజెప్పి బెయిల్‌ ఇప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయి. సీబీఐ ఇచ్చిన సమాచారంతో రాష్ట్ర ఏసీబీ అధికారులు ఇద్దరు జడ్జీలను, ఒక మాజీ న్యాయమూర్తిని అరెస్టు చేశారు. ఇది కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కర్ణాటకలో రాజకీయంగా దుమారం రేపిన గనుల కుంభకోణానికి సంబంధించి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై నమోదయిన కేసు దర్యాప్తు కూడా లక్ష్మీనారాయణే పర్యవేక్షించాడు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ .రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపైనా ఆయన విచారణ జరిపాడు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ ఎన్ కౌంటర్ కేసు కూడా లక్ష్మీనారాయణే దర్యాప్తు జరిపాడు. జగన్ అక్రమ ఆస్తుల కేసు తప్ప మిగతా కేసుల దర్యాప్తు దాదాపు పూర్తి కావొచ్చింది. వీటితోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోహ్రాబుద్దీన్, ఇష్రాత్ జహాన్ ల ఎన్ కౌంటర్ల కేసు దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యత లక్ష్మీనారాయణకు అప్పగించారు.

స్వచ్చంద పదవీ విరమణ

[మార్చు]

వి.వి. లక్ష్మీనారాయణ 2018 మార్చిలో స్వచ్చంద పదవీ విరమణ చేయడానికి నిర్ణయించుకుని, ఆ మేరకు తన శాఖలో పదవీ విరమణ ప్రక్రియ ప్రారంభించారు. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని పత్రికలు, మీడియా వ్యాఖ్యానిచ్చాయి.

రాజకీయాల్లో

[మార్చు]

ఉద్యోగానికి రాజీనామా చేసిన లక్ష్మీనారాయణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. 2018 నవంబరులో లోక్‌సత్తా పార్టీలో చేరమని ఆ పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ ఆహ్వానించగా పరిశీలిస్తానని లక్ష్మీనారాయణ చెప్పాడు.[11] లోక్‌సత్తాలో చేరే ఆలోచన వద్దనుకుని, సొంతంగా ఒక కొత్త పార్టీ పెట్టనున్నాడని ఆ తరువాత పత్రికల్లో ఊహాగానాలు వచ్చాయి. పార్టీ పేరు జనధ్వని అని కూడా అవి రాసాయి.[12] చివరికి 2019 మార్చి 17 న అతడు జనసేన పార్టీలో చేరాడు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుండి జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తరువాత జనసేన పార్టీకి రాజీనామా చేసి రాజకీయాల్లో కొంత నిశ్శబ్దంగా ఉండిపోయాడు. 2023 డిసెంబరులో జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించాడు.[13] 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుండి పోటీ చేయగా[14][15], ఆయనకు కేవలం 5,160 ఓట్లు మాత్రమే వచ్చాయి.[16]

అవార్డులు, గౌరవాలు

[మార్చు]

2017 జనవరి 26న లక్ష్మీనారాయణ విశిష్ట సేవలకు గాను ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ అందుకున్నారు.

నటించిన సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "About CBI Joint Director VV Lakshminarayana". cyberscrap.blogspot.in. April 22, 2011. Archived from the original on 2012-02-04. Retrieved 2013-08-31. "He feels strongly about corruption. His plus point is his handling of legal issues, especially documentation (since in all the cases he has investigated, the documents seized ran into thousands of pages). He does not get bogged down by work pressure.
  2. "VV Lakshminarayana: A silent striker". ibnlive.in.com. August 22, 2011. Archived from the original on 2012-08-27. Retrieved April 2, 2012. He is remembered for his stint as SP of Nanded. He then worked in the Maharashtra Anti-Terrorism Squad.He is a cheater. Keen to work for the CBI, he opted to be deputed to the agency.
  3. "Emaar case: CBI Joint Director briefs Andhra Chief Secretary on probe progress". articles.economictimes.indiatimes.com. January 31, 2012. Archived from the original on 2013-01-03. Retrieved April 2, 2012. CBI Joint Director V V Lakshmi Narayana today met Andhra Pradesh Chief Secretary Pankaj Dwivedi and briefed him about the arrest of Principal Secretary (Home) B P Acharya in the Emaar Properties scandal.
  4. "Satyam case: CBI reduces number of witnesses". rediff.com. June 15, 2011. Retrieved April 1, 2012. Lakshmi Narayana, deputy inspector general of police, CBI said as per the apex court directives, the number of documents supporting the charge sheet which were about 3,067 have also been reduced to a thousand-odd
  5. "Threats against RI atheist teen being investigated". indiatoday.intoday.in. July 29, 2011. Retrieved April 2, 2012. A team of CBI officials, led by joint director V. V. Lakshmi Narayana, has almost completed its investigations into the alleged illegal mining in the controversial Obulapuram mines in collusion with the officials of the state mining and forest departments
  6. "CBI files chargesheet in Emaar Land scam". articles.timesofindia.indiatimes.com. February 1, 2012. Archived from the original on 2013-01-03. Retrieved April 22, 2012. CBI today filed its chargesheet against seven persons including Andhra Pradesh home secretary and senior IAS officer B P Acharya and five companies in the case relating to alleged irregularities in land transfer and sale of villas and apartments in an upscale township in Hyderabad
  7. "AP cops grilled, IPS officers plan anti-CBI protest". sunday-guardian.com. 2012-02-19. Archived from the original on 2014-10-20. Retrieved 2012-03-31. The state IPS officials are worried because the Sohrabuddin case has been entrusted with CBI joint director V.V. Lakshminarayana, the chief of the Hyderabad-Karnataka zone
  8. "Sohrabuddin case handed over to Lakshmi Narayana". siasat.com. February 16, 2012. Retrieved April 2, 2012.
  9. "Naidu case: CBI collects documents". thehindu.com. November 26, 2011. Retrieved April 1, 2012. CBI Joint Director V.V. Lakshmi Narayana collected from the A.P. High Court on Friday the voluminous documents submitted by Y.S. Vijayamma, MLA, in connection with the petition she filed seeking a probe against former Chief Minister N. Chandrababu Naidu and his associates for various irregularities allegedly committed by them
  10. "AP: CBI files FIR against Jagan, Emaar". rediff.com. Retrieved April 1, 2012.
  11. "లక్ష్మీనారాయణ: నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు... ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తా". BBC News|తెలుగు. BBC. 26 Nov 2018. Archived from the original on 21 Mar 2019.
  12. "CBI former joint director to name his party on December 22?". టైమ్స్ ఆఫ్ ఇండియా. బెన్నెట్, కోల్‌మన్ అండ్ కంపెనీ లిమిటెడ్. 13 Dec 2018. Archived from the original on 21 మార్చి 2019. Retrieved 21 మార్చి 2019.
  13. "మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ.. 'జై భారత్‌ నేషనల్‌ పార్టీ'". ఈనాడు. Archived from the original on 2024-01-19. Retrieved 2024-05-08.
  14. Telugu, TV9 (2024-03-16). "జై భారత్ నేషనల్ పార్టీ ఎన్నికల గుర్తును ప్రకటించిన మాజీ సీబీఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ". టీవీ9 తెలుగు. Archived from the original on 2024-03-23. Retrieved 2024-05-08.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  15. "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు - అభ్యర్థులు". ఈనాడు. 2024-05-06. Archived from the original on 2024-05-07. Retrieved 2024-05-07.
  16. BBC Telugu (9 June 2024). "కేఏ పాల్, లక్ష్మీనారాయణలకు ఎన్ని ఓట్లు వచ్చాయి." Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  17. A. B. P. Desam (29 September 2022). "నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు". Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.

ఇతర లింకులు

[మార్చు]