Jump to content

జ్యోతి యర్రాజీ

వికీపీడియా నుండి
(జ్యోతీ యర్రాజీ నుండి దారిమార్పు చెందింది)
జ్యోతి యర్రాజి
వ్యక్తిగత సమాచారం
పూర్తిపేరుజ్యోతి యర్రాజి
జాతీయత భారతదేశం
జననం (1999-08-28) 1999 ఆగస్టు 28 (వయసు 25)
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
క్రీడ
దేశంభారతీయురాలు
క్రీడపరుగు (రన్నింగ్)
పోటీ(లు)100 మీటర్ల హర్డిల్స్

జ్యోతి యర్రాజి (జననం 1999 ఆగస్టు 28) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్.[1] ఆమె 100 మీటర్ల హర్డిల్స్‌లో నైపుణ్యం కలిగి భారత జాతీయ రికార్డును సాధించింది. ఆమె 2022 మే 10న 13:23 సెకన్లలో అనురాధ బిస్వాల్ చేసిన దీర్ఘకాల రికార్డును బద్దలు కొట్టింది.[2][3][4]

అనురాధ బిస్వాల్ ఒడిషాకు చెందిన భారతీయ మాజీ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్. ఢిల్లీలోని నెహ్రూ స్టేడియంలో జరిగిన డిడిఎ-రాజా భలేంద్ర సింగ్ నేషనల్ సర్క్యూట్ మీట్‌లో 2002 ఆగస్టు 26న 100 మీటర్ల హర్డిల్స్ లో ఆమె జాతీయ రికార్డు నెలకొల్పింది.[5] 2000 జూలై 30న జకార్తాలో జరిగిన ఆసియన్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆమె తన సొంత రికార్డును 13.40 సెకన్లలో అధిగమించింది.[6] అయితే, జ్యోతి యర్రాజీ 13.23 సెకన్లలో పరిగెత్తి ఆ రికార్డును తిరగరాసింది.[7]

ఆమె 2022 భారత జాతీయ క్రీడలలో నూరు మీటర్ల హర్దిల్స్ లోనే కాక నూరు మీటర్ల పరుగు పందెంలోనూ స్వర్ణ పతకాలను సాధించింది.[8]

ఇక అప్పటి నుంచి జ్యోతి యర్రాజీ పలుమార్లు రికార్డులను అధిగమిస్తూ వస్తోంది.[9][10][11] 2022 అక్టోబరు 17 నాడు ఆమె 13 సెకన్లకన్నా తక్కువ సమయంలో నూరు మీటర్ల హర్దిల్స్ సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది.[12]

భారత స్ర్పింట్‌ స్టార్‌ గా గుర్తింపుతెచ్చుకున్న జ్యోతి యర్రాజీ తన జాతీయ రికార్డును తానే మరోసారి తిరగ రాసింది. 2024 ఫిబ్రవరి 17న ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప 60 మీటర్ల హర్డిల్స్‌లో ఆమె 8.12 సెకన్లలో గమ్యం చేరి స్వర్ణ పతకం కొల్లగొట్టింది.[13]

ఫిబ్రవరి 2024లో ప్రముఖ పత్రిక ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 జాబితాలోకి ఆమె పేరు చేరింది.[14]

ప్రారంభ జీవితం

[మార్చు]

జ్యోతి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం. ఆమె తండ్రి సూర్యనారాయణ సెక్యూరిటీ గార్డు కాగా తల్లి గృహిణి.[15] విశాఖపట్నం పాతబస్తీలోని పోర్ట్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాలలో ఆమె డిగ్రీ పూర్తిచేసింది. తరువాత, ఆమె హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్‌లో చేరింది. కోచ్ ఒలింపియన్ నాగపురి రమేష్ వద్ద రెండు సంవత్సరాలు శిక్షణ పొందింది, అతను 2016లో ద్రోణాచార్య అవార్డు గ్రహీత.[16] తరువాత, ఆమె సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేరడానికి గుంటూరు వెళ్ళింది. 2019 నుండి, ఆమె భువనేశ్వర్‌లోని రిలయన్స్ అథ్లెటిక్స్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో బ్రిటిష్ కోచ్ జేమ్స్ హిల్లియర్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతోంది.

కెరీర్

[మార్చు]

2022లో చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో 100 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకాన్ని గెలుచుకోవడం జ్యోతి కెరీర్‌లో హైలైట్‌గా నిలిచింది.[17] ప్రారంభంలో ఆమె ఒక చైనీస్ అథ్లెట్‌తో పాటు తప్పుడు ప్రారంభానికి అనర్హులుగా ప్రకటించబడింది, కానీ తరువాత ప్రారంభానికి అనుమతించబడింది. చివరికి, సమీక్ష తర్వాత, చైనీస్ అథ్లెట్ అనర్హత వేటుపడి భారతదేశానికి రజత వరించింది.[18] 2023 ప్రారంభంలో, ఆస్టనైన్ కజకిస్తాన్‌లో జరిగిన 2023 ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలవడమే కాకుండా, ఇండోర్ 60 మీటర్ల హర్డిల్స్‌లో ఆమె జాతీయ రికార్డును ఐదుసార్లు బద్దలుకొట్టింది.[19]

కోవిడ్ 19 మహమ్మారి, వెన్ను గాయం కారణంగా ఆమె 2021లో ఎటువంటి ఈవెంట్‌లలో పాల్గొనలేదు, కానీ 2022లో ఆమె బలంగా తిరిగి వచ్చింది. ఆమె 100 మీటర్ల హర్డిల్స్‌లో 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. భారతీయ మహిళల 4 X 100 మీటర్ల రిలే జట్టులో భాగమైంది. ఫైనల్స్‌లో 5వ స్థానంలో నిలిచింది. 2022 భారత జాతీయ క్రీడల ఎడిషన్‌లో, ఆమె 100 మీటర్లు, 100 మీటర్ల హర్డిల్స్ రెండింటిలోనూ స్వర్ణాన్ని గెలుచుకుంది.[20] 2022 అక్టోబరు 17న, 100 మీటర్ల మహిళల హర్డిల్స్‌లో 13 సెకన్ల కంటే తక్కువ సమయంలో చేదించిన మొదటి భారతీయ మహిళా హర్డిలర్‌గా ఆవిర్భవించింది, ఆ సంవత్సరంలో 100 మీటర్ల మహిళల హర్డిల్స్‌లో రెండవ అత్యుత్తమ ఆసియా క్రీడాకారిణి, 11వ అత్యుత్తమ ఆసియా క్రీడాకారిణి.[21] 2022 ఇండియన్ ఓపెన్ నేషనల్స్‌లో, ఆమె మహిళల్లో అత్యుత్తమ అథ్లెట్‌గా ఎంపికైంది.[22]

2024 ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకం గెలుచుకుంది. మహిళల 60 మీటర్ల హర్డిల్స్‌ను 8.12 సెకన్లలో పూర్తి చేసి ఆమె మొదటి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో గత ఏడాది తానే నెలకొల్పిన 8.13 సెకన్ల జాతీయ రికార్డును తానే బద్దలు కొట్టడం విశేషం. ఈ ఈవెంట్‌ హీట్స్‌ను 8.22 సెకన్లతో అగ్రస్థానంతో ముగించిన జ్యోతి ఫైనల్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అసుకా టెరెడా (జపాన్‌ – 8.21సె.), లుయి లై యు (హాంకాంగ్‌ – 8.21 సె.) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "Jyothi YARRAJI". Birmingham2022.com. Birmingham Organising Committee for the 2022 Commonwealth Games Limited. Retrieved 5 August 2022.
  2. Nag, Utathya. "Jyothi Yarraji: India's rising star who overcame the hurdle of luck". Olympics. Retrieved 23 June 2022.
  3. "Jyothi Yarraji smashes own-held national record in 100m hurdles after 11 days". The Bridge. Retrieved 23 May 2022.
  4. "Jyothi Yarraji breaks 100m hurdles national record in Cyprus meet". Press Trust of India. 2022-05-11. Retrieved 2022-05-29.
  5. "Anuradha sets National mark". The Hindu. 2002-08-26. Archived from the original on 2012-11-06. Retrieved 2009-10-16.
  6. "Rachita Mistry, Anuradha Biswal corner day's honours". The Hindu. 2000-07-31. Archived from the original on 25 November 2009. Retrieved 2009-10-16.{{cite news}}: CS1 maint: unfit URL (link)
  7. "Jyothi Yarraji breaks 100m hurdles national record in Cyprus meet". Press Trust of India. 2022-05-11. Retrieved 2022-05-29.
  8. Sarangi, Y. B. (2022-10-04). "National Games: Jyothi Yarraji, Ram Baboo hog limelight as athletics events conclude". sportstar.thehindu.com. Retrieved 2023-08-25.
  9. "Meet Jyothi Yarraji – India's multiple record-breaking 100m hurdler". ESPN.IN. 27 May 2022. Retrieved 29 May 2022.
  10. "Racing across Europe, breaking records: How hurdler Jyothi Yarraji rewrote NR thrice in 16 days". ESPN.IN. 29 May 2022. Retrieved 29 May 2022.
  11. "Record Breakers of 2022 (Athletics): the complete list". ESPN.IN. 11 May 2022. Retrieved 29 May 2022.
  12. "Yarraji creates new record, first Indian woman to run sub-13s hurdles". ESPN. 2022-10-17. Retrieved 2023-08-25.
  13. "జ్యోతి మరోసారి.. | Jyoti once again." web.archive.org. 2024-02-20. Archived from the original on 2024-02-20. Retrieved 2024-02-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  14. "'ఫోర్బ్స్‌' జాబితాలో మెరిసిన రష్మిక.. అనుష్క.. సీతాలక్ష్మి. | young women who placed in forbes 30 under 30 list in telugu". web.archive.org. 2024-02-20. Archived from the original on 2024-02-20. Retrieved 2024-02-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  15. Nag, Utathya (2023-10-15). "Jyothi Yarraji: India's rising star who overcame the hurdle of luck". www.olympics.com. Retrieved 2024-01-12.
  16. "National Sports Awards 2016" (Press release). Press Information Bureau, India. 22 August 2016. Archived from the original on 25 August 2016. Retrieved 23 August 2016.
  17. "Asian Games 2023: Disqualified Jyothi Yarraji wins silver in women's 100m hurdles after incredible drama". India Today (in ఇంగ్లీష్). Retrieved 2024-01-12.
  18. "Jyothi Yarraji on silver medal upgrade at Asian Games: This medal has taught me a lot". The Times of India. 2023-10-19. ISSN 0971-8257. Retrieved 2024-01-12.
  19. "No hurdle too high for Jyothi Yarraji". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-02-15. Retrieved 2023-05-03.
  20. Sarangi, Y. B. (2022-10-04). "National Games: Jyothi Yarraji, Ram Baboo hog limelight as athletics events conclude". sportstar.thehindu.com (in ఇంగ్లీష్). Retrieved 2022-10-13.
  21. "Yarraji creates new record, first Indian woman to run sub-13s hurdles". ESPN (in ఇంగ్లీష్). 2022-10-17. Retrieved 2022-10-18.
  22. Singh, Navneet. "Tajinderpal Singh Toor and Jyothi Yarraji are the best athletes of the National Open Athletics Championships". www.sportskeeda.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-10-21.

వెలుపలి లంకెలు

[మార్చు]