టక్కరి దొంగ చక్కని చుక్క
టక్కరి దొంగ చక్కని చుక్క (1969 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.ఆర్. దాస్ |
తారాగణం | కృష్ణ, విజయనిర్మల |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | అజమ్ ఆర్ట్స్ |
భాష | తెలుగు |
టక్కరిదొంగ చక్కనిచుక్క కె. ఎస్. ఆర్. దాస్ దర్శకత్వంలో వచ్చిన కౌబాయ్ తరహా చిత్రం. ఇందులో కృష్ణ, విజయ నిర్మల ముఖ్య పాత్రలు పోషించారు. కృష్ణ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమా 1969 మే 16న విడుదలైంది.
తారాగణం
[మార్చు]- కృష్ణ - శ్యామ్, గోపీ
- విజయ నిర్మల - గీత
- రాజనాల
- కైకాల సత్యనారాయణ - భయంకర్
- రాజబాబు - మాలిష్వాలా చిన్నయ్య
- రాజనాల - దాదా
- పి.జె.శర్మ - సైంటిస్ట్
- మీనాకుమారి
- ధూళిపాళ - పోలీస్ సూపర్నెంట్
- త్యాగరాజు - ఇన్స్పెక్టర్ కామేశం
- మాలతి - గోపి తల్లి
- విజయలలిత - లైలా
సాంకేతికవర్గం
[మార్చు]- సంగీతం: సత్యం
- నృత్యం: కెఎస్ రెడ్డి
- పోరాటాలు: మాధవన్
- కళ: చలం
- ఫొటోగ్రఫీ: ఎస్‌ఎస్ లాల్
- మాటలు: టిపి మహరథి
- కూర్పు, దర్శకత్వం: కెఎస్‌ఆర్ దాస్
- నిర్మాత: వైవి రావు
కథ
[మార్చు]ఆ ఊరిలో దాదా (రాజనాల), భ యంకర్ (సత్యనారాయణ) ఇద్దరూ గ్యాంగ్ లీడర్లు. దోపిడీలు దొంగతనాలు చేస్తూ రౌడీలను పెంచి పోషిస్తూ దందాలు చేస్తుంటారు. భయంకర్ సూచనతో ముఠాకు చెందిన శ్యామ్ (కృష్ణ) మ్యూజియంలోంచి అతి విలువైన పరిటాల వజ్రాలు దొంగిలించి తన హోటల్ రూములో సీలింగ్ ఫ్యాన్‌లో దాస్తాడు. బిఏ చదివి, ఏ ఉద్యోగం దొరక్క రిక్షా నడుపుతూ జీవించే వ్యక్తి గోపి (మరో కృష్ణ). ఒకరోజు శ్యామ్ గోపీ రిక్షాను కారుతో ఢీకొట్టడం, అతన్ని తన రూమ్‌కు తీసుకొచ్చి తనకు బదులుగా రూమ్‌లో నెల రోజులు ఉండమని 50వేల రూపాయలు ఇస్తాడు. గోపి అందుకు అంగీకరించటంతో, శ్యామ్ దూరంగా వెళ్లిపోవటం జరుగుతుంది. వజ్రాలు తెచ్చివ్వలేదని భయంకర్, శ్యామ్ కోసం వెతుకుతుంటాడు. అలాగే ఆ వజ్రాల కోసం దాదా గోపీని బంధిస్తాడు. గోపి తనకేమీ తెలియదని చెబుతాడు. తరువాత రూమ్‌కి వచ్చి, అక్కడ శ్యామ్ మరణించి ఉండటాన్ని గమనించి, ఇక భయంకర్‌ను, దాదాను తానే ఒంటరిగా ఎదుర్కొంటుంటాడు. ప్రభుత్వ సైనికుల శక్తి సామర్థ్యాల కోసం తలపెట్టిన ప్రయోగాన్ని సైంటిస్ట్ (పిజె శర్మ), అతని అసిస్టెంటు గీత (విజయనిర్మల) సక్సెస్ చేస్తారు. గీతను ఇష్టపడి ప్రేమించిన గోపి, ఆ ఫార్ములా కాగితాల కోసం సైంటిస్ట్‌ను హత్యచేసి తీసుకోవాలనుకున్న దుండగుల బారినుంచి గీతను, ఫార్ములాను కాపాడతాడు. పత్రాలను ప్రభుత్వానికి అప్పగించటంతో గోపిని ప్రభుత్వం ధనంతో సత్కరిస్తుంది. గీతతో కలిసి తల్లివద్దకెళ్లి వారి ప్రేమ పెళ్ళికి అంగీకారం పొంది, ఇరువురూ ఒకటవటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది[1].
పాటలు
[మార్చు]- ఓ కలలుగనే కమ్మని చిన్నారి నీ సొగసులన్నీ నావే - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: దాశరథి
- కిల్లాడి మావయ్యా నావల్ల కాదయ్య అల్లాడిపోతున్నాను - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: Dr. సినారె
- నేనే మాలీష్‌వాలా నాపేరే చిన్నయ్యలాల రాకెన్‌రోలు - పిఠాపురం - రచన: ఆరుద్ర
- నీ నడకలు చూస్తే మనసౌతుంది కులుకు చూస్తే - ఎస్.పి. బాలు - రచన: Dr. సినారె
- నువ్వు నేను ఇంకెవ్వరు లేరు కమ్మని కౌగిలి రమ్మనె - సుశీల - రచన: Dr. సినారె
- వయసు కుర్రది వంపులున్నది హాయి నైస్‌నైస్‌గ ఐస్ చేస్తది - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: ఆరుద్ర
మూలాలు
[మార్చు]- ↑ సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (22 June 2019). "ఫ్లాష్ బ్యాక్ @ 50 టక్కరి దొంగ- చక్కని చుక్క". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 13 August 2019.[permanent dead link]