టి.ఎస్.ప్రహ్లాద్
టి.ఎస్.ప్రహ్లాద్ | |
---|---|
జననం | 1940 మే 21 |
వృత్తి | ఏరోస్పేస్ శాస్త్రవేత్త |
పురస్కారాలు | పద్మశ్రీ H K ఫిరోదియా పురస్కారం]] IISc డిస్టింగ్విష్‌డ్ అలుమ్నై IE ఎమినెంట్ ఇంజనీర్ |
తుమకూరు సీతారామయ్య ప్రహ్లాద్ (జననం 1940 మే 21) భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, బెంగళూరు లోని నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (NAL) కు మాజీ డైరెక్టరు. అతను ఏరోడైనమిక్స్, ఏరోస్పేస్ డిజైన్‌లో నిపుణుడిగా ప్రసిద్ధి చెందాడు.[1] హంస, NAL సరస్ పౌర విమానాల అభివృద్ధి కార్యక్రమాల్లోను, తేలికపాటి యుద్ధ విమానాల అభివృద్ధి కార్యక్రమంలోనూ అతను కృషి చేసాడు.[2][3] 2004లో భారత ప్రభుత్వం అతనికి పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది, [4] అదే సంవత్సరం, అతను HK ఫిరోడియా మెమోరియల్ ఫౌండేషన్ నుండి HK ఫిరోడియా పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. [5]
జీవిత చరిత్ర
[మార్చు]బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాక, అక్కడే మెకానికల్ ఇంజినీరింగ్‌లోనే మాస్టర్స్ చేసి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో డాక్టరల్ డిగ్రీ (పిహెచ్‌డి) కూడా పొందాడు. [2] ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో తన వృత్తిని ప్రారంభించాడు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)లో ఏరోడైనమిక్స్ డివిజన్, ఏరోస్పేస్ డైనమిక్స్ అండ్ డిజైన్ గ్రూప్, ఫ్లైట్ డైనమిక్స్ గ్రూప్ వంటి వివిధ విభాగాలకు అధిపతిగా పనిచేశాడు. VSSCలో తన పదవీకాలంలో, అతను SLV-3, ASLV, PSLV, GSLV వంటి అంతరిక్ష కార్యక్రమాల అభివృద్ధిలో పాల్గొన్నాడు. తరువాత అతను రక్షణ మంత్రిత్వ శాఖ కింద ఉన్న ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీకి మారాడు. అక్కడ అతను లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. [2]
1996 లో సంస్థ సివిల్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు ప్రహ్లాద నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (NAL) డైరెక్టర్‌గా [6] చేరాడు.[3][7] అప్పటి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) డైరెక్టర్ జనరల్ అయిన రఘునాథ్ అనంత్ మషేల్కర్ ప్రోత్సాహంతో NAL సారస్ కార్యక్రమాన్ని పునరుద్ధరించాడు. 1999 లో ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ ఆమోదం పొందాడు.[3] అతని నాయకత్వంలో, 2002 వరకు కొనసాగింది, NAL దాని మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుని, ఒక సంఘటిత యూనిట్‌గా రూపాంతరం చెందింది.[8]
ప్రహ్లాద్ అనేక వైజ్ఞానిక వ్యాసాలు రాసారు..[9] అనేక శాస్త్రీయ ప్రాజెక్టులలో,[10] [11] వర్క్‌షాప్‌లలో [12] పాల్గొన్నాడు. 2013 సతీష్ ధావన్ మెమోరియల్ లెక్చర్‌తో సహా ప్రసంగాలు చేసాడు.[13] అతను ఆసియన్ ఫ్లూయిడ్ మెకానిక్స్ కమిటీకి చైర్మన్.[1] అతను ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (AeSI),[1] ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ (INAE) లో సభ్యుడు.[14] భారత ప్రభుత్వం అతనికి 2004లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది.[4] అదే సంవత్సరం HK ఫిరోడియా మెమోరియల్ ఫౌండేషన్ యొక్క HK ఫిరోడియా అవార్డు కూడా అందుకున్నాడు.[5] ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అలుమ్ని అసోసియేషన్ అతనిని 2009 విశిష్ట పూర్వ విద్యార్థుల పురస్కారంతో సత్కరించింది [15] ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారి ఎమినెంట్ ఇంజనీర్ అవార్డును అందుకున్నాడు.[2] అతను నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ సలహాదారుగా తన అనుబంధాన్ని కొనసాగించాడు. బెంగళూరు నగరంలో నివసిస్తున్నారు.[1]
ఇవి కూడా చూడండి
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "Prof. T. S. PRAHLAD". Asian Fluid Mechanics Committee. 2015. Archived from the original on 17 నవంబరు 2015. Retrieved 15 November 2015.
- ↑ 2.0 2.1 2.2 2.3 "Advisory Board". Enti Innovations. 2015. Archived from the original on 25 ఆగస్టు 2015. Retrieved 15 November 2015.
- ↑ 3.0 3.1 3.2 "SARAS Takes to the Skies". Science Reporter. October 2004. Archived from the original on 17 November 2015. Retrieved 15 November 2015.
{{cite web}}
: CS1 maint: unfit URL (link) - ↑ 4.0 4.1 "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 అక్టోబరు 2015. Retrieved 21 July 2015.
- ↑ 5.0 5.1 "Awards by Year". H. K. Firodia Memorial Foundation. 2015. Archived from the original on 17 November 2015. Retrieved 15 November 2015.
- ↑ "K N Raju greets his successor" (PDF). National Aerospace Laboratories. 1996. Retrieved 15 November 2015.
- ↑ "First indigenous passenger aircraft Saras rolled out". Economic Times. 4 February 2003. Retrieved 15 November 2015.
- ↑ "About Us". National Aerospace Laboratories. 2015. Retrieved 15 November 2015.
- ↑ P. Bradshaw, ed. (2013). Turbulence. Springer Science & Business Media. p. 338. ISBN 9783662225684.
- ↑ "Investigations of casing treatments with the aim of improving the stable operating range of a single-stage axial compressor subsonic". Universität der Bundeswehr München. 2001. Retrieved 15 November 2015.
- ↑ O. Pironneau (1992). Numerical Simulation of Unsteady Flows and Transition to Turbulence. Cambridge University Press. pp. 146 of 516. ISBN 9780521416184.
- ↑ International Workshop on Surface Engineering and Coatings: June 25-30, 1998. Allied Publishers. 1999. p. 468. ISBN 9788170239734.
- ↑ "Focus on aircraft development: Prahlad". Indian Express. 24 September 2013. Archived from the original on 17 November 2015. Retrieved 15 November 2015.
- ↑ "Search Of Fellows". Indian National Academy of Engineering. 2015. Archived from the original on 2015-04-03. Retrieved 15 November 2015.
- ↑ "Complete List of Distinguished Alumnus Awardees". IISc Alumni. 2015. Archived from the original on 28 May 2016. Retrieved 15 November 2015.