Jump to content

టి.ప్రకాశ్ గౌడ్

వికీపీడియా నుండి
(టి.ప్రకాశ్‌ గౌడ్‌ నుండి దారిమార్పు చెందింది)
తొలకంటి ప్రకాష్ గౌడ్
టి.ప్రకాశ్ గౌడ్


పదవీ కాలం
2009 - 2014
2014 - 2018
2018- 2023
,2023 నుండి ప్రస్తుతం
నియోజకవర్గం రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 05 మే 1959
మైలార్‌దేవపల్లి, రాజేంద్రనగర్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ భారత రాష్ట్ర సమితి,

కాంగ్రెస్ పార్టీ

తల్లిదండ్రులు గండయ్య గౌడ్ - లక్ష్మమ్మ
జీవిత భాగస్వామి సులోచన
సంతానం ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు
నివాసం మైలార్‌దేవపల్లి

తొలకంటి ప్రకాష్ గౌడ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2][3] ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.[4]

జననం, విద్య

[మార్చు]

ప్రకాష్ గౌడ్ 1959, మే 5న గండయ్య గౌడ్ - లక్ష్మమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలంలోని మైలార్‌దేవపల్లి గ్రామంలో జన్మించాడు. పదవ తరగతి వరకు చదువుకున్నాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ప్రకాష్ గౌడ్ కు సులోచనతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ విశేషాలు

[మార్చు]

తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ప్రకాశ్ గౌడ్, ఆ పార్టీలో నాయకుడిగా కీలకపాత్ర పోషించాడు. 2009లో 13వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, 2014లో జరిగిన 1వ తెలంగాణ శాసనసభకు తెలుగుదేశం పార్టీ పై రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ పై రెండుసార్లు గెలుపొందాడు.[5] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేణుకుంట్ల గణేష్ పై 25,881 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6] [7] భారత్ రాష్ట్ర సమితి రాజేంద్రనగర్ శాసన సభ నియోజకవర్గం ఎమ్మెల్యే టి. ప్రకాశ్ గౌడ్,2024 జూలై 12 శుక్రవారం రోజున సాయింత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు[8] [9].

శాసనసభకు పోటీ

[మార్చు]
సంవత్సరం నియోజకవర్గం గెలిచిన అభ్యర్థి పార్టీ ఓట్లు ఓడిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు మెజారిటీ
2009 రాజేంద్రనగర్ టి.ప్రకాశ్‌ గౌడ్‌ తెలుగుదేశం పార్టీ బొర్రా జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ పార్టీ 7485
2014 రాజేంద్రనగర్ టి.ప్రకాశ్‌ గౌడ్‌[10] తెలుగుదేశం పార్టీ బొర్రా జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ పార్టీ 25881
2018 రాజేంద్రనగర్ టి.ప్రకాశ్‌ గౌడ్‌ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రేణుకుంట్ల గణేష్ తెలుగుదేశం పార్టీ 58373

ఇతర వివరాలు

[మార్చు]

ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదలైన దేశాలు సందర్శించాడు.

మూలాలు

[మార్చు]
  1. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  2. "Tolkanti Prakash Goud MLA of Rajender Nagar Telangana contact address & email". nocorruption.in (in ఇంగ్లీష్). Retrieved 2021-09-23.
  3. "Rajendranagar Electiion Result 2018 Updates: Candidate List, Winner, Runner-up MLA List". Elections in India. Archived from the original on 2021-09-23. Retrieved 2021-09-23.
  4. Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
  5. "T. Prakash Goud(TDP):Constituency- RAJENDRANAGAR(RANGAREDDY) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2021-09-23.
  6. Sakshi (12 December 2018). "ప్రకాష్‌.. హ్యాట్రిక్‌". Retrieved 4 March 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  7. "RAJENDRANAGAR Election Result 2018, Winner, RAJENDRANAGAR MLA, Telangana". NDTV.com (in ఇంగ్లీష్). Retrieved 2021-09-23.
  8. "Prakash Goud: సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌". EENADU. Retrieved 2024-07-12.
  9. Velugu, V6 (2024-07-12). "కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ : కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి". V6 Velugu. Retrieved 2024-07-12.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  10. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.