టి.వెంకటేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తాడిపనేని వెంకటేశ్వరరావు, బెజవాడ కార్పొరేషన్ మొదటి మేయర్. [1]1981-83, 1995-2000 సంవత్సరాల మధ్యకాలంలో రెండు సార్లు ఆయన మేయర్ గా పనిచేశాడు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చెమళ్లమూడి. విజయవాడ నగరంలో పేదలకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రముఖ ప్రాత వహించాడు. అఖిల భారత మేయర్ల సంఘం అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. భార్య వసుంధర ది గుంటూరు జిల్లా జూపూడి .1938లో వివాహం జరిగింది.వసుంధర కమ్యూనిస్టు పార్టీలోను, మహిళా సమాఖ్యలోను క్రియాశీలక పాత్ర పోషించారు. ఆమె 3.1.2011 న చనిపోయారు. విజయవాడలో విశాలాంధ్ర భవనం, చండ్రరాజేశ్వరరావు లైబ్రరీ, లెనిన్ సెంటర్లో లెనిన్ విగ్రహం ఏర్పాటుకు ఆయన కృషిచేశారు.బలమైన స్థానిక సంస్థలు ఉన్నప్పుడే రాష్ట్రాభి వృద్ధి సాధ్యమవుతుందంటూ రాజ్యాంగం 74వ సవరణ, స్థానిక సంస్థలకు హక్కుల బదలాయింపు కోసం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెత్తందారీతనం లేని, కమిషనర్ల ఆధిపత్యంలేని మున్సిపాలిటీల్లో స్వయంపాలన సాధించాలని ఉద్యమించారు. స్థానిక సంస్థల హక్కు లు, నిధుల కోసం నిరశన దీక్ష చేశారు.[1]

1965 ఆంధ్రప్రదేశ్ పురపాలకసంఘ చట్టం, 1955 హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ చట్టాలలో మౌలిక మార్పులు అవసరమని, మేయర్లు, చైర్‌పర్సన్లు, ప్రజాప్రతినిధులకు అధికారాలు కల్పించాలని, బెంగాల్ నమూనా మేయర్ ఇన్ కౌన్సిలు విధానాన్ని ప్రవేశపెట్టాలని టీవీ పోరాడాడు. 1995 జూన్ 18న రాష్ట్రంలోని మేయర్లు, ఛైర్మన్ల సదస్సును విజయవాడలో నిర్వహించారు. టీవీని కదిలే మునిసిపల్ చట్టం అని సంబోధించేవారు. టీవీ తొలితరం కమ్యూనిస్టులైన పుచ్చల పల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య, మోటూరు హను మంతరావు, వేములపల్లి శ్రీకృష్ణ ల సహచరుడు. రహస్యజీతం గడుపుతూ1947-48 లో అరెస్టు అయి రాజమండ్రి, కడలూరు జైళ్లలో గడిపాడు. జైలు కమిటీ మేయర్‌గా మూడేళ్లు పనిచేశారు. పార్టీ విభజన అనంతరం సీపీఐ విజయవాడ శాఖ కార్యదర్శిగా పనిచేశారు.సత్యనారాయణపురం రైల్వే ట్రాక్ తొలగించేందుకు కృషి చేశారు. ఫలితంగానే నేడు బీఆర్టీఎస్ రోడ్డును నగర ప్రజలు చూడగలిగారు. పడమట ఎన్టీ ఆర్ సర్కిల్ నుంచి పంటకాలువ రోడ్డు ఏర్పా టుచేశారు. కాలువపై బ్రిడ్జిలు నిర్మించడంలో ఆయన పాత్ర మరవలేనిది. విజయవాడ కొండలపై కాపురాలకోసం కిలోమీటర్ల ఎత్తున బూస్టర్ల ద్వారా నీటి సరఫరా, వీధి దీపాలు ఏర్పాటు చేశారు. పార్కులు, రిక్రియేషన్ క్లబ్‌లకు కూడా నగరపాలకసంస్థ బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. రాష్ట్రంలోనే తొలిసారి కార్పొరేషన్ భాగ స్వామ్యంతో వీధి బాలకార్మికుల కోసం ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థ ఏర్పాటు చేశారు.ఆ సంస్థ 40వేల బాలకార్మికులకు ఆశ్రయం కల్పించింది.[1]ముందు చూపున్న నేత. ఇద్దరు కుమారులు. రమేష్‌ సిద్ధార్థ అకాడమీలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తుండగా, రెండవ కుమారుడు సురేష్‌ న్యూఢిల్లీలోని మినిస్టీరియల్‌ ఆఫ్‌ ఎక్స్‌టర్నల్‌ ఎఫైర్స్‌లో పనిచేస్తున్నారు. 14.10.2013 న కన్ను మూశారు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "'స్థానిక' హక్కుల ఉద్యమనేత టి. వెంకటేశ్వరరావు". Sakshi. 2013-10-16. Retrieved 2021-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]